
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఓ తెలుగు దర్శకుడు.. ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్‌నే నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)
'ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడు. మా(మూవీ ఆర్టిస్ట్ అసియేషన్) జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్‌గా మారిన నటుడు కాదు. అయితే ఈ విషయంలోకి తనను ఓ నటుడు/రాజకీయ నాయకుడు అనవసరంగా లాగారు' అని పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ పెట్టింది.
పూనమ్ ట్వీట్ పెట్టింది కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇకపోతే గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై తాను మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ అప్పుడు సరిగా పట్టించుకోలేదనే నిజాన్ని బయటపెట్టింది. తాజా ట్వీట్ చూస్తే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌నే పరోక్షంగా టార్గెట్ చేసిందా అనిపించింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?)

Comments
Please login to add a commentAdd a comment