
నయనతార పేరు చెప్పగానే లేడీ సూపర్‌స్టార్ అని అంటారు. 40కి దగ్గర్లో ఉన్నా గానీ వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈమె తీరు వల్ల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు మరో నిర్మాత విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమె తీరుపై మండిపడ్డారు.
(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)
నయనతార సినిమా అయితే చేస్తుంది గానీ ప్రమోషనల్ ఈవెంట్స్‌కి రాదు. ఇదనే కాదు వ్యక్తిగత జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. ఇకపోతే నిర్మాత కమ్ యూట్యూబర్ అంతనన్ తాజాగా ఈమెపై విమర్శలు చేశాడు. తన పిల్లలని చూసే ఇద్దరు ఆయాలని కూడా సెట్స్‌కి తీసుకొస్తుందని, వారి ఖర్చులని కూడా నిర్మాతలే భరించాలని ఒత్తడి చేస్తోందని ఆరోపించాడు. గతంలో ఈయనే.. సెట్‌కి వచ్చేటప్పుడు నయన్ ఏకంగా 8 మందిని తీసుకొస్తుందని కామెంట్స్ చేశాడు.
'నయనతార తన పిల్లల కోసం ఇద్దరూ ఆయాలతో షూటింగ్ లొకేషన్‌కి వస్తోంది. వాళ్లకి నిర్మాతలు డబ్బులు చెల్లించాలని అంటోంది. ఇదెక్కడ న్యాయం. ఆమె పిల్లల నానీలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు. ఆమె తన వ్యక్తిగత విషయాలపై కూడా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది. తన పెళ్లిని కూడా నెట్‌ఫ్లిక్స్‌కి భారీ మొత్తానికి అమ్మేసింది. నయనతార ప్రతిదీ వ్యాపారంగా మార్చుకుంది' అని నిర్మాత, యూట్యూబర్ అంతనన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)
Comments
Please login to add a commentAdd a comment