'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం | Anirudh Performance For Manasilayo Song In Vettaiyan Audio Launch, Why Jr NTR Fans Felt Disappointed | Sakshi
Sakshi News home page

Anirudh: తారక్ అభిమానులు.. ఇదే మిస్ అయ్యారుగా

Published Tue, Oct 8 2024 9:30 PM | Last Updated on Wed, Oct 9 2024 11:07 AM

Anirudh Performance Manasilayo In Vettaiyan Audio Launch

'దేవర' మూవీ ఇంకా థియేటర్లలో ధనాధన్ లాడిస్తూనే ఉంది. ఇప్పటికే రూ.450 కోట్ల మార్క్ దాటేసింది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి రూ.500 కోట్లు సులభంగా దాటేస్తుంది. ఇదంతా పక్కనబెడితే తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి తెగ బాధపడిపోతున్నారు. దీనికి అనిరుధ్ కారణం. ఎందుకంటే?

(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక)

లెక్క ప్రకారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. కానీ ఊహించిన దాని కంటే ఎక్కువమంది వచ్చేసరికి విధ్వంసం జరిగింది. కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. సరే అదలా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం రజినీకాంత్ 'వేట్టయన్' ఆడియో లాంచ్ జరిగింది. ఇప్పటికే సూపర్ అయిపోయిన 'మనసిలాయో' పాటకు అనిరుధ్ అదిరిపోయే లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

గతంలో 'హుకుం' సాంగ్‌కి స్టేడియంలో జనాలు ఎలా ఊగిపోయారో.. ఇప్పుడు 'మనసిలాయో'కి కూడా అదే సీన్ రిపీటైంది. తాజాగా ఈ ఫెర్ఫార్మెన్స్ వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అయ్యో ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ మిస్ అయిపోయామే అని అనుకుంటున్నారు. ఈవెంట్ సంగతి ఏమైనా సరే 'ఫియర్' సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకు థియేటర్లలో ఆల్రెడీ టాప్ లేచిపోయిందిగా అని సంతృ‍ప్తి పడుతున్నారు.

(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement