సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక | Alia Bhatt Reveals That She Wants Movie With Trivikram And Samantha, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Alia Bhatt: సమంతకి ఆలియా ఓ రేంజ్ ఎలివేషన్స్

Published Tue, Oct 8 2024 8:58 PM | Last Updated on Wed, Oct 9 2024 11:29 AM

Alia Bhatt Wants Movie With Trivikram And Samantha

చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంతని త్రివిక్రమ్, ఆలియా భట్ ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇదంతా జరిగింది. కొత్త మూవీ ప్రమోషన్ కోసం భాగ్యనగరానికి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. సినిమా గురించి చెప్పడం కంటే సమంతకి ఎలివేషన్స్ ఇచ్చింది. త్రివిక్రమ్‌తో మూవీ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది.

(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

సమంత గురించి మాట్లాడిన ఆలియా భట్.. తెరపైనే కాదు తెరముందు కూడా హీరోనే అని సామ్‌ని ఆకాశానికెత్తింది. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తి దాయకమని, అలాంటి ఆమె తన సినిమాని ప్రొత్సహించేందుకు ముందుకు రావడం చాలా ఆనందం ఉందని చెప్పింది. మంచి సినిమాలను ప్రేమించడంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అని మనోళ్ల ప్రేమ గురించి పొగిడింది. తమ ఇంటికి తెలుగుతో ఎంతో అనుబంధం ఏర్పడిందని, తన కూతురు.. నాటునాటు పాట వినని రోజే ఉండదని ఆలియా చెప్పింది.

అలానే సమంత, తనని లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తీయాలని ఇదే వేడుకకు అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ని ఆలియా భట్ కోరింది. అయితే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. త్వరలో అల్లు అర్జున్‌తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గురూజీ అనుకుంటే బన్నీ సరసన సమంత, ఆలియా భట్‌ని  పెడితే పాన్ ఇండియా తగ్గట్లు సరిపోతుంది. మరి ఆలియా కోరిక త్వరలో తీరుతుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement