సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Samantha And Trivikram Speech Jigra Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Samantha: సమంత-త్రివిక్రమ్.. ఆసక్తికర సంభాషణ

Published Tue, Oct 8 2024 7:20 PM | Last Updated on Tue, Oct 8 2024 7:43 PM

Samantha And Trivikram Speech Jigra Movie Pre Release Event

హీరోయిన్ సమంత రీసెంట్ టైంలో సినిమాలు చేయనప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నీమధ్య తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా సామ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదలా ఉంచితే చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చింది. ఆలియా భట్ 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి హాజరైన సామ్‌పై త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)

సమంత ఏం చెప్పింది?
సినిమా టీమ్‌కి విషెస్ చెప్పింది. అలానే హీరోయిన్లుగా తమకు ఎంతో బాధ్యతగా ఉంటుందని, ప్రతి అమ్మాయి కథలో వాళ్లే హీరోలని చెప్పింది. చాలారోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని అభిమానులని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తన కుటుంబమని క్లారిటీ ఇచ్చింది.

త్రివిక్రమ్ టీజింగ్
ఇదే ఈవెంట్‌కి హాజరైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఏ మాయ చేశావే' సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే ఏం అక్కర్లేదని, ఆమెనే ఓ శక్తిని ఆకాశానికెత్తేశాడు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. 'అత్తారింటికి దారేది' లాగా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అని అనలేమో అని త్రివిక్రమ్ చెప్పారు.

(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్‌ కౌర్‌ ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement