నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని | Bigg Boss 8 Telugu October 8th Full Episode Review And Highlights: Wild Card Entries Nominations, Arguments Between Contestants | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 37 Highlights: నామినేషన్ పూర్తి.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎందుకు?

Published Wed, Oct 9 2024 8:01 AM | Last Updated on Wed, Oct 9 2024 9:45 AM

Bigg Boss 8 Telugu Day 37 Episode Highlights

ఈ సీజన్‌లో నామినేషన్స్ మరీ సప్పగా సాగేవి. కేవలం ఒక్కరోజులో పూర్తయిపోయేవి. అలాంటిది ఈ వారం మంగళవారం కూడా సాగింది. మరోవైపు డాక్టర్ బాబు గౌతమ్ ప్రతి దానిలో దూరుతున్నాడని నబీల్ ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్‌లో జరిగిన ఓ పని వల్ల టేస్టీ తేజ, నయని పావని మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇంతకీ 37వ రోజు బిగ్‌బాస్ హౌసులో ఏం జరిగింది? అనేది హైలైట్స్‌లో చూద్దాం.

(ఇదీ చదవండి: కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్)

యష్మికి రోహిణి కౌంటర్స్
యష్మిని రోహిణి నామినేట్ చేయడంతో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది. మెగా చీఫ్ టాస్క్‌లో నబీల్-పృథ్వీ ఆడుతున్న టైంలో సంచాలక్ ప్రేరణని తప్పు చేయమనే అర్థమొచ్చేలా పదేపదే చెప్పడం తనకు నచ్చలేదని రోహిణి కారణం చెప్పింది. యష్మి దీనికి ఎంతకీ ఒప్పుకోలేదు. రోహిణి కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్స్ వేసింది. అలానే మొదటితో పోలిస్తే విష్ణుప్రియ ఆట తగ్గిపోయిందని గ్రాఫ్ పెంచుకోమని చెప్పి రోహిణి ఈమెని నామినేట్ చేసింది.

అలిగిన గంగవ్వ
రోహిణి తర్వాత గంగవ్వ వచ్చింది. గేమ్ ఆడట్లేదు, కాళ్లు చేతులు సక్కగా లేవా? ఉన్నా మరెందుకు ఆడట్లే, ఉత్తిగనే కూసుంటున్నావ్ అని చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక హౌసులోకి వచ్చిన తర్వాత తమ ఎనిమిది మందిని అస్సలు పలకరించట్లేదని, కనీసం టీ కూడా ఇవ్వలేదని చెప్పి యష్మిని నామినేట్ చేసింది. తెలంగాణ స్లాంగ్‌లో గంగవ్వ చెప్పిన మాటలు తొలుత యష్మికి అర్థం కాలేదు. నయని చెప్పడంతో అర్థం చేసుకుంది. ఈసారి రోజూ మాట్లాడతా, చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటానని యష్మి చెప్పింది.

(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

కొత్తోళ్లు నామినేషన్స్‌లో ఎందుకు?
చివరగా వచ్చిన అవినాష్.. పృథ్వీ, యష్మిని నామినేట్ చేశాడు. ప్రభావిత టాస్క్‌లో ఆడవాళ్లతో కాస్త హర్ష్‌గా ప్రవర్తించాడని, అలానే గేమ్ కనిపించట్లేదనే కారణంతో పృథ్వీకి కారణాలు చెప్పుకొచ్చాడు. ఇక కన్ఫెషన్ రూంలో మణికంఠకి ఫుడ్ ఇచ్చేసి ఉంటే బయటకొచ్చి అతడిని ఓదార్చే అవసరముండేది కాదు కదా అని యష్మిని నామినేట్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేయాలని, వాళ్లిద్దరూ ఎవరూ ఓజీ క్లాన్ (హౌసులోని పాతోళ్లు) నిర్ణయించాలని అన్నాడు. అన్ని చర్చల తర్వాత మెహబూబ‍్, గంగవ్వని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హౌసులోకి వచ్చిన ఒక్కరోజులోనే వీళ్లని నామినేట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తారు? అనేది అర్థం కాలేదు.

ఉప్పు ప్యాకెట్ రూ.50 వేలు
ఓవరాల్‌గా ఈ వారం పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, సీత, మెహబూబ్, గంగవ్వ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత రేషన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంట్లోని రేషన్ అంతా బిగ్‌బాస్‌కి ఇచ్చేయాలని అన్నాడు. బిగ్‌బాస్ మార్కెట్ ఉంటుందని, బజర్ మోగి, ఆగేలోపు ఎంత తీసుకొస్తే ఆ రేషన్‌ని ఇరు క్లాన్స్ పంచుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. నబీల్-నిఖిల్ అన్నీ తెచ్చారు కానీ ఉప్పు ప్యాకెట్ తీసుకురావడం మర్చిపోయారు. చివరకు బిగ్‌బాస్‌ని ప్రాధేయపడితే ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు తగ్గించుకుని సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)

గౌతమ్ తీరుపై నబీల్ అసహనం
ఏదైనా అనౌన్స్‌మెంట్ మెగా చీఫ్‌గా తనకు బాధ్యత ఉందని, కానీ గౌతమ్ కృష్ణ ప్రతిసారీ వచ్చి తన చేతిలో పేపర్ లాగేసుకుని మరీ చదువుతున్నాడని నబీల్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నానని తన క్లాన్ సభ్యులతో అన్నాడు. అంటే వచ్చే వారం ఇదే కారణం చెప్పి గౌతమ్‌ని నబీల్ నామినేట్ చేయడం గ్యారంటీ.

నోరు జారిన టేస్టీ తేజ
బయట లాన్‌లో అందరూ కూర్చున్న టైంలో అవినాష్, మెహబూబ్.. నయని పావనిని గత సీజన్‌లో నామినేట్ చేయడం గురించి మాట్లాడుకున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్‌గా వచ్చిన తేజ కూడా తనని నామినేట్ చేశాడని నయని చెప్పింది. దీంతో దగ్గర్లో ఉన్న తేజ.. నామినేషన్ విషయంలో నిన్నే బండ బూతులు తిట్టారని, కావాలంటే బయటకెళ్లిన తర్వాత చూస్కో అని నోరు జారాడు. దీంతో నయని పావని వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఆమె దగ్గరకెళ్లి సారీ చెప్పాడు. నీకు ఎందుకురా అంత నోటి దూల అని తనని తానే తిట్టుకున్నాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.

(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement