కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్ | Prakash Raj Criticized Pawan Kalyan In Tamil Interview | Sakshi
Sakshi News home page

Prakash Raj: ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రచారం చేశారు

Published Tue, Oct 8 2024 3:51 PM | Last Updated on Tue, Oct 8 2024 4:20 PM

Prakash Raj Criticized Pawan Kalyan In Tamil Interview

గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్‍‌ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ వరస ట్వీట్స్ వేస్తున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. దేనికి కూడా పవన్ నుంచి సమాధానం లేదు. ఇక రీసెంట్‌గా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గురించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు.

(ఇదీ చదవండి: కొండా సురేఖపై పిటిషన్.. కోర్టులో నాగార్జున స్టేట్‌మెంట్)

అసలేం జరిగింది?
కార్తీ హీరోగా నటించిన 'సత్యం సుందరం'.. సెప్టెంబరు 28న తెలుగులో రిలీజైంది. అంతకు కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఇందులో యాంకర్, లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. అది సెన్సిటివ్ మేటర్ వద్దులేండి అని కార్తి అనేశాడు. ఇందులో ఏం లేనప్పటికీ.. పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తి క్షమాపణ చెప్పాడు. అంతటితో అది అయిపోయింది.

ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?
దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. కార్తీ ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయలేదని, తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారని అన్నాడు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడని అన్నాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందన్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement