'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా? | Analysis Behind Bigg Boss 8 Telugu Nayani Pavani Trauma Comments, Trending On Social Media | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: వీటి గురించి ఎవరు మాట్లాడుకోరు.. ఏం?

Oct 9 2024 10:25 AM | Updated on Oct 9 2024 1:00 PM

Bigg Boss 8 Telugu Nayani Pavani Trauma Comments

బిగ్‌బాస్ షోని ఇష్టపడి చూసేవాళ్లు కొందరైతే. ఇదో దిక్కుమాలిన ప్రోగ్రాం అని తిట్టేవాళ్లు మరికొందరు! మంచి-చెడు అనే చర్చ పక్కనబెడితే ఈ షోలో గెలిస్తే లక్షల రూపాయలు డబ్బు, ఊహించని ఫేమ్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఇదే షో వల్ల కంటెస్టెంట్స్ మానసికంగా ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు తొలిసారి ఒకామె నోరు విప్పింది. ఎవరికీ తెలియని చీకటి కోణాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)

ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ నడుస్తోంది. ఈసారి 14 మందిని తీసుకొస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయారు. దీంతో గత కొన్ని సీజన్లలో పాల్గొన్న గంగవ్వ, అవినాష్, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ, మెహబూబ్, నయని పావని  తదితరుల్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేరిట హౌసులోకి తీసుకొచ్చారు. ముందు ముందు వీళ్లు ఏం చేస్తారో చూడాలి?

అసలు పాయింట్‌కి వస్తే మంగళవారం (అక్టోబరు 09) ఎపిసోడ్ చివరలో నయన పావని.. ఈ షో వల్ల తాను ఎంత ట్రామాకు గురయ్యాననేది బయటపెట్టింది. అందరితో సరదాగా కూర్చుని మాట్లాడుతున్న టైంలో నయని పావనిని గత సీజన్ ఎలిమినేషన్ గురించి సీత అడిగింది. క్యాజువల్ సంభాషణ కాస్త.. నిన్ను బయట  బండబూతులు తిట్టారు అని తేజ ఈమెతో అనేసరికి ఒక్కసారి సీరియస్ అయింది.

తేజ కాస్త హర్ష్‌గా అనేసిన 'బండబూతులు' పదం నయని పావనికి ఎక్కడో తగలరాని చోట తగిలేసింది. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. 'అలా ఎలా అంటాడు. అంత రూడ్‌గా మాట్లాడాడు. ఒక్కసారిగా నా పైకి వచ్చి పడినట్లు మాట్లాడాడు. సంవత్సరం పాటు ఆ ట్రామా ఫేస్ చేశాను. అంతకుముందే మా నాన్న చనిపోయారు. తను అలా అనేసరికి అదంతా ఒక్కసారిగా ఫ్లాష్ అయింది. ఇప్పుడు బండ బూతులు తిట్టారని ఎలా అన్నాడు. మరి అలాంటప్పుడు నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది.

నయని చెప్పిన దానిబట్టి చూస్తే వారం ఉండి ఎలిమినేట్ అయిన దానికే ఇంత బాధపడిందా అనిపించింది. ఒక్క వారానికే ఇలా అయిపోతే ఎక్కువ వారాలు ఉండి ఎలిమినేట్ అయిన వాళ్ల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతారు. కానీ ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనే ముసుగులో కంటెస్టెంట్స్ ఎంతలా మానసిక సంఘర్షణకు లోనవుతున్నారనేది ఎవరు చెప్పరే?

అంతెందుకు ఇదే బిగ్‌బాస్ షోలో పాల్గొని అవకాశాలు, ఫేమ్ తెచ్చుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటే. అలాంటివి ఏం రాక కనుమరుగైన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్ల మనోగతాన్ని బయటకు తీస్తే నయని పావని కంటే ఎక్కువ కన్నీళ్లు వస్తాయేమో?

(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement