టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ బ్రో. తమిళంలో సూపర్ హిట్ సాధించిన వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే! మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేశాడు. తెలుగు నేటివిటికీ తగ్గట్టు చాలా మార్పులే చేశాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. డైరెక్టర్ కథను పక్కన పెట్టి పవన్‌ను హైలైట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఈజీగా నచ్చుతుంది కానీ అందరినీ మెప్పించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే ఏ సినిమా అయినా థియేటర్‌లో రిలీజైన కొంతకాలానికి ఓటీటీలో రావడం పక్కా! అందుకు బ్రో కూడా అతీతం కాదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన బ్రో మూవీ కూడా ఆగస్టు నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
బ్రో సినిమా విషయానికి వస్తే.. ఇందులో పవన్, సాయిధరమ్ తేజ్‌తో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment