
అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సీనియర్ హీరోయిన్ రంభ (Rambha Re-Entry) రీఎంట్రీకి రెడీ అవుతోంది. చాలాకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఎట్టకేలకు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సినిమా అంటే నాకెంతో ప్రేమ. వెండితెరకు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నా.. అని రంభ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే 2023లోనూ రంభ కమ్‌బ్యాక్ ఇస్తున్నట్లు చెప్పింది. కానీ ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. ఈసారైనా ఆమె చెప్పింది నిజమైతే బాగుండంటున్నారు అభిమానులు. మరి ఎలాంటి రోల్‌తో రంభ రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!
రంభ జర్నీ..
రంభ అసలు పేరు విజయలక్ష్మి. అమృత అనే పేరును స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. ఆమె నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ. తర్వాతి కాలంలో ఆమె రంభగానే కంటిన్యూ అయిపోయింది. తొలి ముద్దు, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, హిట్లర్, అల్లుడా మజాకా!, బావగారు బాగున్నారా?, బొంబాయి ప్రియుడు, గణేష్, మూడుముక్కలాట.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. వంటి ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది.
సినిమా
తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. ఆమె నటించిన చివరి చిత్రం ద ఫిలింస్టార్ (2011లో వచ్చిన మలయాళ మూవీ). 2010లో బిజినెస్‌మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె కెనడాలో సెటిలైంది. కొంతకాలం తర్వాత బుల్లితెరపై తళుక్కుమని మెరిసింది. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.
చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!
ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్
Comments
Please login to add a commentAdd a comment