Rambha (actress)
-
రజనీకాంత్‌పై 'రంభ' వైరల్ కామెంట్లు.. సోషల్‌మీడియాలో వివాదం!
రంభ 90వ దశకంలో తమిళ,తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా కొనసాగింది. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, చిరంజీవి వంటి ప్రముఖ నటులందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నటి రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రంభ షూటింగ్ స్పాట్లో నటుడు రజనీకాంత్‌తో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది., నటుడు రజనీకాంత్ చిలిపి పనులలో మునిగిపోతారని రంభ చెప్పిన మాటలను కట్ చేసి రజనీకాంత్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోను కొందరు ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 1997లో సుందర్ సి దర్శకత్వంలో అరుణాచలం చిత్రంలో రజనీ, సౌందర్య, రంభ నటించారు. ఈ సినిమాలో రంభ కీలక పాత్ర పోషించింది. అందులో రజనీకాంత్‌కు అసిస్టెంట్‌గా ఆమె మెప్పించింది. ఆ సినిమా సెట్లో జరిగిన సంఘటన గురించి ఆమె ఇలా తెలిపింది. 'అరుణాచలం సినిమాతో పాటు నేను ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌తో బంధన్ చిత్రం కూడా ఒప్పుకున్నాను. అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్ షూటింగ్ చేశాను. ఆ సమయంలో రజనీకాంత్‌ను కలిసేందుకు హిందీ నటుడు సల్మాన్ ఖాన్ వచ్చాడు.. అప్పుడు నేను ఆయన్ను చూసి వెంటనే వెళ్లి కౌగిలించుకుని పలకరించాను.. ఆ సమయంలో రజనీ దూరంగా కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు.. ఆ తర్వాత రజనీ షూటింగ్ ఆపి దర్శకుడు సుందర్ సితో మాట్లాడుతున్నారు. సల్మాన్ ఖాన్ వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయ్యింది. సెట్లో గందరగోళం.. నెలకొంది. రజనీకాంత్ టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు సుందర్ సి నా వైపు కంగారుగా చూశారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న కెమెరామెన్ కలుగచేసుకుని ఏంటి మేడమ్..? ఇలా చేశారు, ఇకపై మీతో నటించను అని రజినీసార్ అంటున్నారని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో నేను వెంటనే ఏడ్చేశాను . అప్పుడు నేను ఏడుస్తున్నట్లు రజనీ సార్ గమనించి భయపడి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆమెను ఎందుకు ఏడిపించారని అక్కడున్న వారందరిపై మండిపడ్డారు. నేనేం తప్పు చేశాను సార్.. ఏం జరిగింది..? అని నేను అడిగాను. అప్పడు వెంటనే షూటింగ్ స్పాట్లో ఉన్న వారందరినీ రజనీ అక్కడికి పిలిచారు. ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ వెంటనే పరుగెత్తుకుంటు వెళ్లి కౌగిలించుకుంది.. ఇక్కడ ఎవరినైనా ఎప్పుడైనా అలా హగ్ చేసుకుందా అంటూ దానిని ఆయన ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. అదే మా సినిమా సెట్లో అయితే.. గుడ్ మార్నింగ్ సార్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోతుంది. తన బాలీవుడ్ సినిమా హీరో అయితే కౌంగిలించుకుని మరీ విష్ చేస్తుంది అంటూ అందరి రజనీకాంత్ సరదాగా నన్ను ఆటపట్టించారు. నన్ను ఇలా ఆట పట్టించాలని వారు ముందే ప్లాన్ చేసుకున్నారని తర్వాత అర్థం అయింది. అదేం నాకు తెలియకపోవడంతో చాలా సమయం పాటు నేను ఏడ్చాను. అలా సరదాగా రజనీ సార్ నన్ను ఏడిపించారు.' అని ఆనాటి విషయాలను రంభ గుర్తు చేసుకుంది. ఏదేమైనా రజనీ సర్ని ఎప్పుడూ అలా చూడలేదని రంభ చెప్పింది. ఇది ఉత్తర భారత సంస్కృతి అని ఆయనతో చెప్పాను. వెంటనే తను రేపటి నుంచి యూనిట్లో అందరూ వరుసలో నిలుచోవాలని కోరారు. రేపటి నుంచి రంభ వచ్చి అందరినీ కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ చెపుతుందని మరోసారి రజనీ సార్ ఆటపట్టించారని ఆమె గుర్తుచేసుకుంది. కానీ కొందరు సోషల్ మీడియాలు రంభ వ్యాఖ్యలను కొంత వరకు మాత్రమే కట్ చేసి రజనీ కాంత్ పట్ల నెగటివ్‌ను వ్యాప్తి చేయడం గమనార్హం. #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 -
మా ఇద్దరినీ దేవుడు అలా జతపరిచారు: రంభ
-
పెళ్లి తర్వాత సినిమాల గురించి రంభ...!
-
నన్ను అందరూ హీరోలు గారాభం చేసేవారు..!
-
Rambha: ఆ హీరో డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం
-
సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటే.. సంచలనం అయిపోయింది..!
-
ఆ హీరో చెప్పేవన్నీ అబద్ధాలే: రంభ
సీనియర్ నటి, స్టార్ హీరోయిన్ రంభ మరోసారి వార్తల్లో నిలిచారు. అప్పట్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రంభ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో ఆమె నటించిన చిత్రాల్లో బొంబాయి ప్రియుడు సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి సరసన ఆమె నటించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వహించిన ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెంట్ సెట్టర్‌గా నిలిచిపోయింది. తాజా ఇంటర్వూలో మాట్లాడుతూ.. 'నాకు చిత్రపరిశ్రమలోని కొద్దిమంది స్నేహితుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. కానీ అతను నా పెళ్లికి రాలేదు. అందుకు చాలా బాధపడ్డా. అతడికి ఫ్రెండ్షిప్ చేయడం కూడా రాదు. ఎప్పుడు అబద్ధాలు చెబుతాడు.' అంటూ సరదాగా మాట్లాడింది. రంభ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుని అక్కడే ఉండిపోయింది. -
కారు ప్రమాదం తర్వాత రంభ పోస్ట్.. పిల్లలు ఇప్పుడెలా ఉన్నారంటే?
సీనియర్ హీరోయిన్ రంభ కుటుంబం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన ఇద్దరు పిల్లలను కెనడాలో టోరంటోలో స్కూల్ నుంచి తీసుకొస్తుండగా మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభ కూతురు సాషాకు గాయాలవడంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత రెండు రోజులకు హీరోయిన్ రంభ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. తమ కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి రంభ లైవ్) తాజాగా ఇవాళ సోషల్ మీడియాతో ఫోటోలు పంచుకుంది అందాల భామ రంభ. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పిక్స్‌తో పాటు గుడ్ మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగుందా అంటూ రిప్లై ఇస్తున్నారు. View this post on Instagram A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) -
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి రంభ లైవ్
సీనియర్ హీరోయిన్ రంభ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే! పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తున్న సమయంలో ఆమె కారు యాక్సిడెంట్ అయింది. రంభ కూతురు సాషాకు గాయాలవడంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు నిన్న ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా కారు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది రంభ. తన కూతురి కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. 'మొదటిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ ఎంతగానో రుణపడి ఉంటాను. ఇప్పుడు నా కుటుంబం క్షేమంగా ఉంది. నా కూతురు సాషా కూడా క్షేమంగా ఉంది. తనను ఇంటికి తీసుకొచ్చాం. మా మీద ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా ఉంది' అని ఎమోషనలైంది రంభ. View this post on Instagram A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) చదవండి: అల్లు శిరీష్ నాకు అప్పటినుంచే తెలుసు: అనూ ఇమ్మాన్యుయేల్ మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు -
తెలుగింటి ఆడపడుచుని, రంభలా ఆ పాత్రలు చేయాలని ఆశ: కోలీవుడ్ నటి
చిన్నతనంలో చిత్రాలు చూసినప్పుడు నటి రంభలా తాను కూడా గ్లామరస్ పాత్రలో నటించాలని ఆశపడేదాన్నని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఈమె తాజా చిత్రం తిట్టం ఇరండు (ప్లాన్ బి)లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. ఇందులో నవ నటుడు సుభాష్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలో సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని తెలిపారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాను ఇందులో పోలీసు అధికారిగా నటించినట్లు తెలిపారు. తను తెలుగింటి ఆడపడుచునని.. చిన్నతనంలో రంభలా గ్లామరస్‌గా నటించాలని ఆశించేదానన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని, అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఈ అమ్మడు తన సినిమా సెలక్షన్లో ఆచితూచి అడుగులు వేస్తుందని, పాత్ర నచ్చితే తప్ప రోల్ చేయడానికి అంగీకరించదని వినికిడి. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాకు ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి. ఇటీవల ఇందులో ఓ ముఖ్య పాత్రలో ఈ భామ కనిపించనుందని సమాచారం. బన్నీకి చెల్లెలుగా ఐశ్వర్య కనిపించనున్నట్లు అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. -
జూన్ 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు ముఖేష్‌భట్ (బాలీవుడ్ నిర్మాత), రంభ (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. వీరికి ఈ సంవత్సరం జీవితంలో తొమ్మిదేళ్ల మహర్దశ పడుతుంది. ఫలితంగా చాలా మంచి మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయే వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పాత స్నేహాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త స్నేహాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. సమస్యలన్నింటినీ శాంతియుతంగా, సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావడం వల్ల మా అంతటి వారు లేరన్న అహంకారంతో సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. విదేశీ చదువు, విదేశీ ఉద్యోగం కల నెరవేరుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. వ్యాపారులు లాభదాయకమైన కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లక్కీ నంబర్స్: 1,5,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, పర్పుల్, గ్రీన్, మెటాలిక్ గోల్డ్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు; సూచనలు: నోటిదురుసును, అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. తలిదండ్రులను, పెద్దలను, వృద్ధులను గౌరవించడం, ఆదరించడం, వికలాంగులకు, అసహాయులకు అన్నదానం చే యడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్ సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు