జూన్ 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on june 05 the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూన్ 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Thu, Jun 4 2015 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

జూన్ 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూన్ 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ముఖేష్‌భట్ (బాలీవుడ్ నిర్మాత), రంభ (నటి)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. వీరికి ఈ సంవత్సరం జీవితంలో తొమ్మిదేళ్ల మహర్దశ పడుతుంది. ఫలితంగా చాలా మంచి మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయే వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పాత స్నేహాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త స్నేహాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. సమస్యలన్నింటినీ శాంతియుతంగా, సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావడం వల్ల మా అంతటి వారు లేరన్న అహంకారంతో సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. విదేశీ చదువు, విదేశీ ఉద్యోగం కల నెరవేరుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. వ్యాపారులు లాభదాయకమైన కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లక్కీ నంబర్స్: 1,5,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, పర్పుల్, గ్రీన్, మెటాలిక్ గోల్డ్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు; సూచనలు: నోటిదురుసును, అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. తలిదండ్రులను, పెద్దలను, వృద్ధులను గౌరవించడం, ఆదరించడం, వికలాంగులకు, అసహాయులకు అన్నదానం చే యడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement