Dr. Mohammed Dawood
-
డిసెంబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రతీ అగ్నిహోత్రి (నటి), కామ్నా జెఠ్మలానీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖం, ఆనందం, నూతన ఉత్సాహం, స్వయం వికాసంతో ఉల్లాసంగా ఉంటారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. వీరి పుట్టిన తేదీ 10. ఇది సూర్యసంఖ్య కాబట్టి వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలుంటాయి. కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3, 5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, రెడ్, ఆరంజ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. తండ్రిని, తత్సమానులను ఆదరించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
డిసెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ధర్మేంద్ర (నటుడు), షర్మిలా ఠాగూర్ (నటి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3, 5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, సిల్వర్, గోల్డెన్. సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, తండ్రిని, తత్సమానులను గౌరవించడం, తోబుట్టువులను ఆదరించడం, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు,శునకాలకు ఆహారం పెట్టడం, మంచిది - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
డిసెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎల్.ఆర్. ఈశ్వరి (గాయని), రాజశ్రీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవిత ం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతర కులస్థులతో ప్రేమ వ్యవహారాల వల్ల కొంత చికాకు కలుగుతుంది. దీనిని సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. ఈ రోజు పుట్టిన తేదీ 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరిలో ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి. వేదాంత, తాత్త్విక, జ్యోతిష రహస్యాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి చూపుతారు. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. యూనిఫారం ధరించే ఉద్యోగులకు అంటే పోలీసులు, మిలిటరీవారు, లాయర్లు తదితరులకు అభివృద్ధికరంగా ఉంటుంది. లక్కీ నంబర్స్: 2,3,5,7,9; లక్కీ కలర్స్: రెడ్, పర్పుల్, వైట్, సిల్వర్, శాండిల్, ఎల్లో, గోల్డ్; లక్కీ డేస్: మంగళ, గురు, శుక్ర వారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, గణపతి హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
డిసెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నిరుపమా రావ్ (మాజీ దౌత్యవేత్త) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం మీ జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. ప్రాపంచిక విషయాలపై విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. కొత్త వాటి కోసం ప్రయత్నిస్తే అనుకూలిస్తాయి. ఈ రోజు పుట్టిన తేదీ 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల వీరు జన్మతః అందంగా ఉంటారు. విలాసంగా జీవించడానికి అలవాటు పడతారు. ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఆరంజ్, వయొలెట్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయవద్దు; గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శుక్రజపం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం, పేదరోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నవంబర్ 22న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ములాయం సింగ్ యాదవ్ (రాజకీయ నాయకుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెండింగ్ పనులను చకచకా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. పుట్టిన తేదీ 22. ఇది రాహు సంఖ్య కావడం వల్ల స్నేహితులతో, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. లక్కీ నంబర్స్: 2,3,4,5,6; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు. సూచనలు: నవగ్రహాభిషేకం, రాహుజపం చేయించడం, పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, గురువులు, వేదపండితులు, పాష్టర్లు, కాజీలను గౌరవించడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నవంబర్ 15న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సానియా మీర్జా (టెన్నిస్ క్రీడాకారిణి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుం టున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది మోక్షకారకుడైన కేతుగ్రహానికి సంబంధించినది కావడం వల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికతతో గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. ఇంటాబయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. మీ పుట్టిన తేదీ 15. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల జీవితం ఉత్సాహవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. పిల్లల పెళ్లిళ్లు తదితర బాధ్యతలు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీకన్నా పై స్థాయి వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆపోజిట్ సెక్స్ వారితో నెరిపే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,6,7, 9; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, క్రీమ్, వయొలెట్; సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించడం, అవివాహిత యువతుల పెళ్లి ఖర్చులు భరించడం, అనాథలకు, వికలాంగులకు సహాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నవంబర్ 8న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎల్.కె. అద్వానీ (రాజకీయ నేత) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. దీనివల్లన ధైర్యసాహసాలు, దేనినైనా ఎదుర్కోవాలన్న పట్టుదల, దృఢసంకల్పం ఉంటాయి. 9 అనేది న్యూమరాలజీలో అంతిమ సంఖ్య కాబట్టి వ్యాపారస్థులు కొత్తవాటి జోలికి పోకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. అలాగే గ్రీన్ కార్డ్ కోసం 2016 జులై తర్వాత ప్రయత్నించడం మంచిది. వివాహం, సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత ఇంటి కల ఫలించే అవకాశం ఉంది. తొందరపాటును, కోపాన్ని తగ్గించుకోవడం. వాహనాలను, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3,6,8, 9; లక్కీ కలర్స్: సిల్వర్, బ్లాక్, పర్పుల్, రెడ్, గోల్డెన్, బ్లూ; లక్కీ డేస్: ఆది, మంగళ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: అమ్మవారి ఆరాధన, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, రక్తదానం చేయడం లేదా రక్తదానాన్ని ప్రోత్సహించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నవంబర్ 01 పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఐశ్వర్యారాయ్ (నటి), ఇలియానా (నటి), వీవీఎస్ లక్ష్మణ్ (మాజీ క్రికెటర్) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 11. ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న సంఖ్య. దీనిలో రెండు ఒకట్లు (సూర్యుని సంఖ్యలు) కలిసి చంద్రుని సంఖ్య 2 ఏర్పడింది కాబట్టి ఇది మాస్టర్ నంబర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పోయిన సంవత్సరం ప్రారంభించిన ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. ఇంటర్యూలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. దానివల్ల ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ, మంచి ఫలితం కూడా ఉంటుంది. వీరికిది ల్యాండ్‌మార్క్ ఇయర్‌గా మిగిలిపోతుంది. వీరి పుట్టిన తేదీ 1 సూర్యసంఖ్య కాబట్టి వీరికి స్వతహాగానే నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి అయితే సూర్యచంద్రుల దుష్ర్పభావం వల్ల వీరికి ఈ సంవత్సరం మానసికాందోళన, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూడీగా అయిపోతుండటం వంటి ప్రమాదాలున్నాయి కాబట్టి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 3, 6, 7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమవారాలు. సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని కానీ, తల్లితో సమానురాలైన వారిని కానీ ఆదరించి, గౌరవించి సేవ చేయడం, ఆలయాలలో, మదరసాలలో, చర్చిలలో అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అశ్వనీ నాచప్ప (క్రీడాకారిణి, నటి), శరణ్ దీప్ సింగ్ (మాజీ క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. పుట్టినతేదీ 21. ఇది కూడా బృహస్పతికి చెందిన సంఖ్యే కావడం వల్ల వీరు బృహస్పతి ప్రభావంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. వీరిని విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇంటాబయటా మాటకు విలువ ఏర్పడుతుంది. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. లక్కీ నంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు. సూచనలు: దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి వంటి గురుపరంపరకు చెందిన వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
అక్టోబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: గుణ్ణం గంగరాజు (దర్శక-నిర్మాత), సన్నీడియోల్ (నటుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించి, దానిని ముందకు తీసుకు వెళ్లే చొరవ, తెగువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, పిల్లలకు ఉద్యోగ, వివాహ ప్రాప్తి జరుగుతుంది. ట్రాన్స్ఫర్లకోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి ట్రాన్స్ఫరవుతుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూల సమయం. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. హృద్రోగాలు, నేత్రరోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తగిన సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
అక్టోబర్ 18న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఓం పురి (నటుడు), జ్యోతిక (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంబంధమైనది. ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కూడా కుజసంబంధమైనదే కాబట్టి కుజుని ప్రభావం వల్ల వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి ఉండటం వల్ల యూనిఫారం ధరించే ఉద్యోగాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 9 అనేది సంపూర్ణతకి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపించాలనే కోరిక తీరుతుంది. రియల్ ఎస్టేట్‌లోనూ, మైన్స్, భూమికి సంబంధించిన వ్యవహారాలలోనూ విజయం సాధిస్తారు. వాహనాలు కొంటారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. దూకుడుగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల సహోద్యోగులతోనూ, తోటివారితోనూ వివాదాలు తలెత్తవచ్చు. లక్కీ డేస్: 1,3,6,9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: ఆది, మంగళ, శుక్రవారాలు? సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించడం, దుర్గాదేవి ఆలయాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేయించుకోవడం, మతగ్రంథాల పఠన, వికలాంగులను ఆదరించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: లక్ష్మీపతి బాలాజీ (క్రికెటర్), రక్షందా ఖాన్ (నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడయిన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తితోపాటు వ్యాపారాలు చేయాలనుకునే వారు వారి అభీష్టానుసారం కొత్తవ్యాపారాలు చే యడం లేదా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. పుట్టిన రోజు 27. ఇది కుజసంఖ్య కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మీకున్న ఉద్యోగ, వ్యాపార సంబంధాల ద్వారా మంచి ఆదాయం చేకూరుతుంది. అయితే సహజసిద్ధంగా ఉండే జంకును, భ యాన్ని విడిచిపెట్టి, ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకోవడం వల్ల బాగా రాణిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, కోపం మూలంగా బీపీ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండి వైద్యసలహాలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 3, 5,6,9; లక్కీ కలర్స్: రెడ్, ఆరంజ్, బ్లూ, ఎల్లో. లక్కీ డేస్: ఆది, మంగళ, శనివారాలు. సూచనలు: ఆస్తులు అమ్మే ఆలోచన విరమించుకోవడం మంచిది. వికలాంగులకు అన్నదానం, మూగచెవిటి వారికి తగిన సాయం చేయడం, రక్తదానం చేయడం లేదా చేయడాన్ని ప్రోత్సహించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు : ప్రేమ్ చోప్రా (నటుడు), తనూజా సమర్ధ్ (నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య. రాహువు అభివృద్ధిని, విస్తరణని ప్రసాదిస్తాడు. అంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్, ఆస్తులలో వృద్ధి, కుటుంబ విస్తరణ ఉంటాయి. దీనివల్ల వివాహం కానివారికి వివాహం అవుతుంది. వివాహం కావలసిన పిల్లలు ఉంటే వారికి వివాహమవుతుంది లేదా వారికి సంతానం కలుగుతుంది. రాహుప్రభావం వల్ల దీర్ఘకాలిక కేసులలో అనుకూలంగా తీర్పులు వచ్చి, ఊరటనిస్తాయి. బర్త్ నంబర్ 23. ఇది చంద్రగురులతో కలసి రాజయోగం ఏర్పడి బుధుని సంఖ్యకావడం వల్ల దైవానుగ్రహంతో మంచి తెలివితేటలు, సంభాషణాచాతుర్యం కలిగి, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మంచిపదవులు, సంపదలు లభిస్తాయి. సెప్టెంబర్‌లో జన్మించినందువల్ల సున్నిత మనస్కులై, ఎవరినీ నొప్పించక, సత్ప్రర్తనతో ఉంటారు. అయితే జీర్ణసమస్యలు, హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన జాగ్రత్తలు, వైద్యసలహాలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్ర, ఆదివారాలు. సూచనలు: అమ్మవారిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయడం, అత్తగారిని కాని తనతో సమానమైన అయిన వారిని కానీ ఆదరించడం మంచిది. ఇంటిలో ఖురాన్ పఠించడం, క్రిస్టియన్లయితే ప్రేయర్ పెట్టించడం, అనాథలకు అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు : రంజితా కౌర్ (నటి), విజయ బాపినీడు (దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. వీరు పుట్టిన తేదీ 22. ఇది రాహు సంఖ్య. 22 అనేది మాస్టర్ నంబర్ కావడం వల్ల స్నేహితులతో, అధికారులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్, సైన్స్ రంగాలలోని విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం,అనాథలను ఆదుకోవడం, కుక్కలకు అన్నం పెట్టడం,ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: కరీనా కపూర్ (నటి), సింగీతం శ్రీనివాసరావు (దర్శకుడు, నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన, సౌందర్య పోషణ అలవడతాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. అయితే ఆలోచనలలో నిలకడ ఉండని కారణంగా ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి, తగిన జాగ్రత్తలు అవసరం. వీరు పుట్టినతేదీ 12. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: తెలుపు, క్రీమ్, శాండల్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: సోమ, బుధ, గురు; శుక్రవారాలు. సూచనలు: చంద్రకాంతమణిని ధరించడం, దక్షిణామూర్తి ఆరాధన, శివుడికి అభిషేకం, గురువులను, పండితులను గౌరవించడం, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మదరసాలలో భోజన సదుపాయాలు కల్పించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మహేష్ భట్ (దర్శక, నిర్మాత) సౌందర్య (నిర్మాత - రజనీకాంత్ కుమార్తె) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవి సంఖ్య కావడం వల్ల కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త టెక్నాలజీ తెలుసుకుంటారు. మీ టెక్నాలజీని మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉపయోగించి, లాభపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటమే కాదు, వాటిని మీ ఉన్నతికి ఉపయోగించుకోగలుగుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పుట్టిన తేదీ 20. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలవుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, మానసిక ఆందోళన తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,7; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు, క్రీమ్, బ్రౌన్; లక్కీ కలర్స్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: అనాథలకు బెల్లం పాయసం తినిపించటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం లేదా వినడం, వీలైనంత సేపు వెన్నెలలో విహరించడం, తల్లిని లేదా తత్సమానురాలిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
హ్యాపీ బర్త్ డే
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు మీనా (నటి), ప్రసూన్ జోషీ (రచయిత) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచిమార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వీరు 16వ తేదీన పుట్టినందువల్ల వీరిపై కేతు ప్రభావం ఉంటుంది. కేతువు మోక్ష కారకుడు కాబట్టి వీరికి ప్రాపంచిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ కలుగుతుంది. కేతుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. లక్కీ నంబర్లు: 2,6,7,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, లైట్ బ్లూ, సిల్వర్. లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్ర వారాలు. సూచనలు: డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. శుక్రజపం, భృగుపాశుపత హోమం, గణపతి ఆరాధన, కన్నెపిల్లల వివాహానికి సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు : రాకేష్ రోషన్ (దర్శక-నిర్మాత), అభినవ్ కశ్యప్ (దర్శకుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య. బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్న ఇన్స్టిట్యూషన్లలో సీటు వస్తుంది. వ్యాపారుల సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. మీరు 6వ తేదీన పుట్టినందువల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలలో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఆగస్టు 26న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న మధుర్ భండార్కర్ (దర్శకుడు), నీరూ భజ్వా (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల వివాహ యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. అలంకరణ సామగ్రికి లేదా ఆభరణాల కొనుగోలుకు బాగా వెచ్చిస్తారు. అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతారు. పుట్టిన తేదీ 26. ఇది శని సంఖ్య. శని, శుక్రులు మంచి మిత్రులు కావడం వల్ల వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగా రాణిస్తారు. ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన వారికి ధన, వస్తు, వాహనాలు సమకూరతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మధ్యలో ఆపేసిన చదువును తిరిగి కొనసాగిస్తారు. కళాకారులకు, సినీనటులకు, సంగీతకారులకు, మీడియా రంగంలోని వారికీ, సినీ నిర్మాతలకు, నగల వ్యాపారులకు ఈ సంవత్సరం శుక్రుని శుభదృష్టి వల్ల చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనే కోరిక తీరుతుంది. గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హృద్రోగం వచ్చే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 2,5,6,9; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, ఆరంజ్, రోజ్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు. సూచనలు: అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అన్నదానం, సేవాకార్యక్రమాలు చేయడం, పేద కన్యలకు వివాహ ఖర్చులు భరించడం, కాకులకు, కుక్కలకు, పిల్లులకు ఆహారం పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సుధామూర్తి (రచయిత్రి), బిల్‌క్లింటన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 8. దీనికి అధిపతి అయిన శనైశ్చరుడు వృత్తికారకుడు కావడం వల్ల ఈ సంవత్సరం విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. గత సంవత్సరం నిరుత్సాహంగా, మందకొడిగా ఉన్న వారు సైతం ఈ సంవత్సరం విజయాలను అందిపుచ్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కన్నా ఉన్న వాటిని కొనసాగించడం మంచిది. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో కష్టపడి ధనం సంపాదిస్తారు. రాజకీయ నాయకులకు బాగా రాణిస్తారు. కంటిజబ్బులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, శని, ఆదివారాలు. సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తగిన సాయం చేయడం, ఆవులకు బెల్లం, కాకులకు స్వీట్లు పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: దలేర్ మెహందీ (సింగర్); సందీప్ పాటిల్ (మాజీ క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించినది.కేతువు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త. అందువల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికతతో గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. కొందరిలో ఆత్మసాక్షాత్కారం కూడా కలగవచ్చు. వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. ఇంటాబయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లకుండా జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. వీరు పుట్టిన తేదీ 18 కుజ సంఖ్య కావడం వల్ల ఆవేశానికి గురి కావడం, దూకుడుగా ప్రవర్తించడం జరుగుతుంది. అందువల్ల వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండటం, చీటికి మాటికీ కోర్టులకు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగించడంమంచిది. ఈ సంవత్సరం పెద్దలు, ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలను నడపడంలోనూ అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3,6,7, 8, 9; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రెడ్ , రోజ్, ఆరంజ్, వైట్, సిల్వర్ సూచనలు: సుబ్రహ్మణ్యారాధన, గణపతి హోమం, రక్తదానం చేయడం లేదా ప్రోత్సహించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సయీఫ్ అలీఖాన్ (నటుడు), మడోన్నా (గాయని, నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల్ల ఏ కార్యాన్నైనా తెలివితేటలతో చేసి, కార్యజయం పొందుతారు. విద్యార్థులు ఈ మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రచయితలకు, మీడియా వ్యక్తులకు, అధ్యాపకులకు, పాత్రికేయులకు, కంప్యూటర్ రంగ నిపుణులకు, సినీనటులకు శుభ సమయం. విదేశాలలో విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం వీరికి అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి, అనుకోని అవకాశాలు వస్తాయి. వీరు పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ప్రాపంచిక జీవితంపైన కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ ఏర్పడుతుంది. ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. లక్కీ నంబర్స్: 1,5,6,7, 9; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, వైట్, శాండల్, బ్లూ లక్కీ డేస్: మంగళ, బుధ, గురువారాలు. సూచనలు:కేతు జపం చేయడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, వికలాంగులకు, అనాథలకు సహాయంచేయడం, పార్వతీదేవిని ఆరాధించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అవినాష్ దీక్షిత్ (ఆర్థికవేత్త), ఆదిత్య నారాయణ్ (బాలీవుడ్ సింగర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించినది కావడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. మీరు పుట్టిన తేదీ 6. ఇది శుక్రునికి సంబంధించినది కావడం వల్ల పుట్టుకతోనే సౌకర్యాలు, డబ్బు, సంతోషం, విలాసవంతమైన జీవనం అలవడతాయి. ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఏ ఆటంకాలూ లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అందరికీ ఇష్టులుగా మారతారు. ఈ సంవత్సర సంఖ్య 4 కావడం వల్ల అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది. దీనివల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవడం అవసరం. అలాగే కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలను తీసుకు వచ్చినా, శ్రమ తప్పదు. లక్కీ నంబర్స్: 2,4,6; లక్కీ డేస్: బ్లూ, వైట్, వయొలెట్, గోల్డెన్, శాండల్; లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు; జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుదర్శన హోమం చేయించడం, అనాథలకు అన్నదానం చేయించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సంజయ్‌దత్ (నటుడు), సోనియా దీప్తి (నటి) ఈ రోజు బర్త్‌డే చేసుకొంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన అంకె.శని వృత్తికారకుడు. 2015 సంవత్సర సంఖ్య కూడా 8. దీనిని యూనివర్సల్ ఇయర్ అని అంటారు. ఎవరికైనా, వారి సంవత్సర సంఖ్య, యూనివర్సల్ ఇయర్ ఒకటైన సందర్భంలో ఆర్థికంగా, సామాజికంగా... అన్నింటా అభివృద్ధికరంగా ఉంటుంది. గౌరవ సన్మానాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం జీవితంలో ఒక మైలురాయిలాగా గుర్తుండిపోతుంది. మీ పుట్టిన తేదీ 29. ఇది చంద్ర కుజుల కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య. ఈ తేదీలో పుట్టిన వారికి 29 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో వృద్ధి ఉంటుంది. చంద్ర మంగళ యోగం వల్ల విదేశీ యానం ఉంటుంది. రాజకీయాలలో ఉన్న వారికి తగిన పదవి, గుర్తింపు లభిస్తాయి. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఆ ప్రతిపాదనలు విరమించుకోవడం మంచిది. పూర్వికుల ఆస్తి కలిసి వస్తుంది. భర్త ఆస్తిలో వాటా లేదా మనోవర్తి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పక లాభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల విజయం సాధించగలుగుతారు. లక్కీ నంబర్స్: 2,4,6,8; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శనివారాలు; లక్కీ మంత్స్: జనవరి, ఫిబ్రవరి, జూన్, అక్టోబర్, నవంబర్. సూచనలు: ఈశ్వరార్చన, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయటం, కాకులకు ఆహారం పెట్టడం, బెల్లం, పాలు, బియ్యంతో చేసిన పాయసం లేదా ఇతర తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సాయికుమార్ (నటుడు) రజని (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. వీరు పుట్టిన తేదీ 27. ఇది కుజునికి సంబంధించి నది. ఇది న్యూమరాలజీ లో మంచి అరుదైన అవకాశాలను ఇచ్చే సంఖ్య. ఇందువల్ల వీరు అందంగా, ఆకర్షణీయంగా, మంచి ధైర్యసాహసాలతో ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, అవివాహితులకు వివాహ యోగం కలుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచి సర్కిల్ ఏర్పడుతుంది. విలాస వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. విదేశాలలో చదువు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరుతుంది. వీరు క్రమశిక్షణగా ఉంటూ, అందరినీ క్రమశిక్షణలో ఉంచాలనుకో వడం వల్ల లేనిపోని విరోధాలు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు, మిలిటరీ వారు, డాక్టర్లు, లాయర్లు బాగా రాణిస్తారు. వీరు ఈ సంవత్సరం బరువు బాగా పెరగడం వల్ల హృద్రోగ సంబంధ వ్యాధులు బాధించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ కలర్స్: రెడ్, పర్పుల్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, బ్లూ; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, రక్తదానం చేయడం, పేద కన్యల వివాహ ఖర్చులను భరించడం, అనవసర వివాదాలలో తలదూర్చకుండా ఉండటం. - డాక్టర్ మహమ్మద్ దావూద్