23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrating a birthday today | Sakshi
Sakshi News home page

23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Tue, Sep 22 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు : ప్రేమ్ చోప్రా (నటుడు), తనూజా సమర్ధ్ (నటి)
 
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య. రాహువు అభివృద్ధిని, విస్తరణని ప్రసాదిస్తాడు. అంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్, ఆస్తులలో వృద్ధి, కుటుంబ విస్తరణ ఉంటాయి. దీనివల్ల వివాహం కానివారికి వివాహం అవుతుంది. వివాహం కావలసిన పిల్లలు ఉంటే వారికి వివాహమవుతుంది లేదా వారికి సంతానం కలుగుతుంది. రాహుప్రభావం వల్ల దీర్ఘకాలిక కేసులలో అనుకూలంగా తీర్పులు వచ్చి, ఊరటనిస్తాయి. బర్త్ నంబర్ 23. ఇది చంద్రగురులతో కలసి రాజయోగం ఏర్పడి బుధుని సంఖ్యకావడం వల్ల దైవానుగ్రహంతో మంచి తెలివితేటలు, సంభాషణాచాతుర్యం కలిగి, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.

మంచిపదవులు, సంపదలు లభిస్తాయి. సెప్టెంబర్‌లో జన్మించినందువల్ల సున్నిత మనస్కులై, ఎవరినీ నొప్పించక, సత్ప్రర్తనతో ఉంటారు. అయితే జీర్ణసమస్యలు, హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన జాగ్రత్తలు, వైద్యసలహాలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్ర, ఆదివారాలు.
 
సూచనలు: అమ్మవారిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయడం, అత్తగారిని కాని తనతో సమానమైన అయిన వారిని కానీ ఆదరించడం మంచిది. ఇంటిలో ఖురాన్ పఠించడం, క్రిస్టియన్లయితే ప్రేయర్ పెట్టించడం, అనాథలకు అన్నదానం చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement