డిసెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On December 6 to celebrate birthday Celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Sun, Dec 6 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

డిసెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

డిసెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నిరుపమా రావ్ (మాజీ దౌత్యవేత్త)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం మీ జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. ప్రాపంచిక విషయాలపై విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. కొత్త వాటి కోసం ప్రయత్నిస్తే అనుకూలిస్తాయి.

ఈ రోజు పుట్టిన తేదీ 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల వీరు జన్మతః అందంగా ఉంటారు. విలాసంగా జీవించడానికి అలవాటు పడతారు. ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఆరంజ్, వయొలెట్, క్రీమ్, గోల్డెన్, శాండల్;

లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు.
 సూచనలు: ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయవద్దు; గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శుక్రజపం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం, పేదరోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement