Nirupama Rao
-
స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా..!
బెంగళూరు: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావుకు చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ వల్ల ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో అపరిశుభ్ర టాయిలెట్ ఫోటోలు తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీటిని బెంగుళూరు విమానాశ్రయ అధికారిక ట్విటర్ ఖాతాకు నిరుపమ ట్యాగ్ చేశారు. దీంతోపాటు ‘విరిగిన పోయిన టాయిలెట్ టబ్, నిండినపోయిన చెత్త క్యాన్లు ఉన్నాయి. ఇదేనా ‘స్వచ్ఛ భారత్’ అంటే.. ‘స్వచ్ఛ భారత్’ ఎక్కడ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఇలా ఉండటం బాధాకరం’ అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో నిరుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు నిరుపమకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సత్వరమే టాయిలెట్ను బాగు చేసి మళ్లీ తమ ట్విటర్లో ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. ఎయిర్పోర్టు ఆధికారులు స్పదించిన తీరుకు నిరుపమ సంతోషించారు. ఈ క్రమంలో త్వరగా స్పందించి.. ఎయిర్ పోర్టు అధికారులు నిరుపమ మనసును గెలుచుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
నిరుపమారావుకు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన నిరుపమారావు(66)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఉడ్రో విల్సన్ సెంటర్కు రీసెర్చ్ ఫెలోగా ఆమె ఎంపికయ్యారు. 3 నెలల పాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా నిరుపమారావు చైనా–భారత్ సంబంధాలపై అధ్యయనం చేయనున్నారు. జూన్ నుంచి మొదలు కానున్న ఈ ప్రాజెక్టులో ఇరుదేశాల మధ్య సంబంధాలతో పాటు ఆసియా పురోగతిలో భారత్ పాత్రపై కూడా చర్చిస్తామని ఉడ్రో విల్సన్ సెంటర్ ప్రతినిధి తెలిపారు. 2009–11 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా నిరుపమారావు పనిచేశారు. చైనాకు నియమితులైన తొలి భారత మహిళా రాయబారిగా చరిత్ర సృష్టించారు. అమెరికా 28వ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ స్మృత్యర్థం 1968లో కాంగ్రెస్ ఈ సెంటర్ను ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇక్కడ పరిశోధకులు అధ్యయనం చేస్తారు. -
డిసెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నిరుపమా రావ్ (మాజీ దౌత్యవేత్త) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం మీ జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. ప్రాపంచిక విషయాలపై విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. కొత్త వాటి కోసం ప్రయత్నిస్తే అనుకూలిస్తాయి. ఈ రోజు పుట్టిన తేదీ 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల వీరు జన్మతః అందంగా ఉంటారు. విలాసంగా జీవించడానికి అలవాటు పడతారు. ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఆరంజ్, వయొలెట్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయవద్దు; గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శుక్రజపం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం, పేదరోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్