డిసెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on december 7 to celebrate birthday celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Mon, Dec 7 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

డిసెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

డిసెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎల్.ఆర్. ఈశ్వరి (గాయని), రాజశ్రీ (నటి)

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవిత ం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతర కులస్థులతో ప్రేమ వ్యవహారాల వల్ల కొంత చికాకు కలుగుతుంది.

దీనిని సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. ఈ రోజు పుట్టిన తేదీ 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరిలో ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి. వేదాంత, తాత్త్విక, జ్యోతిష రహస్యాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి చూపుతారు. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.

యూనిఫారం ధరించే ఉద్యోగులకు అంటే పోలీసులు, మిలిటరీవారు, లాయర్లు తదితరులకు అభివృద్ధికరంగా ఉంటుంది. లక్కీ నంబర్స్: 2,3,5,7,9; లక్కీ కలర్స్: రెడ్, పర్పుల్, వైట్, సిల్వర్,  శాండిల్, ఎల్లో, గోల్డ్; లక్కీ డేస్: మంగళ, గురు, శుక్ర వారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, గణపతి హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement