పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: శాండ్రా బుల్లక్ (నటి), ముగ్ధా గాడ్సే (నటి, మోడల్)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ గ్రహానికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు బుద్ధిబలం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అన్ని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకోని అవకాశాలు వస్తాయి. కుటుంబ పరంగా ఎంతో ఉత్సాహక రంగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ 26. ఇది శనిగ్రహానికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి ఈ సంవత్సరం స్థిరత్వం వస్తుంది. కొత్త వాటి జోలికి పోకుండా పాత ప్రాజెక్టులనే కొనసాగించడం మంచిది. ఆశించిన కొద్దీ ఆశాభంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి దేనినీ ఆశించకపోవడం మంచిది. ఆధ్యాత్మిక, వైరాగ్య భావనలతో గడుపుతారు. ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారులకు, వస్త్రవ్యాపారులకు, ఆయిల్ వ్యాపారులకు బాగుంటుంది.
యూనిఫారమ్ ధరించే ఉద్యోగులు అంటే డాక్టర్లు, లాయర్లు, మిలిటరీ వారు చాలా లబ్ధిపొందుతారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, సిల్వర్, బ్లాక్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు సూచనలు: నవగ్రహారాధన, శనీశ్వరునికి తైలాభిషేకం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, కాకులకు ఆహారం తినిపించడం, పేదలకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; ఆవేశాన్ని, నోటిదురుసుతనాన్ని తగ్గించుకోవడం, ప్రతీకార ధోరణిని విడనాడటం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్