పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సయీఫ్ అలీఖాన్ (నటుడు), మడోన్నా (గాయని, నటి)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల్ల ఏ కార్యాన్నైనా తెలివితేటలతో చేసి, కార్యజయం పొందుతారు. విద్యార్థులు ఈ మంచి మార్కులు సాధిస్తారు.
పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రచయితలకు, మీడియా వ్యక్తులకు, అధ్యాపకులకు, పాత్రికేయులకు, కంప్యూటర్ రంగ నిపుణులకు, సినీనటులకు శుభ సమయం. విదేశాలలో విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం వీరికి అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి, అనుకోని అవకాశాలు వస్తాయి. వీరు పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ప్రాపంచిక జీవితంపైన కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ ఏర్పడుతుంది. ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.
లక్కీ నంబర్స్: 1,5,6,7, 9; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, వైట్, శాండల్, బ్లూ లక్కీ డేస్: మంగళ, బుధ, గురువారాలు. సూచనలు:కేతు జపం చేయడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, వికలాంగులకు, అనాథలకు సహాయంచేయడం, పార్వతీదేవిని ఆరాధించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్