Madonna (singer
-
'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్
అమెరికన్ పాపులర్ సింగర్ మడోన్నా ప్రపంచ వ్యాప్తంగా తన గాత్రంతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ గత కొద్దిరోజులుగా వరల్డ్ టూర్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. (ఇదీ చదవండి: SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటన చేశారు. కొద్దిరోజులుగా ఆమె బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్కు గురైయారని తెలిపాడు. దీంతో ఆమెకు అత్యవసరంగా చికిత్స అందించేందుకు ICUలో చేర్పించాల్సి వచ్చిందని ఆయన తెలిపాడు. ప్రస్థుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, అయితే ఆమె ఇంకా వైద్య సంరక్షణలో ఉండాల్సి వస్తుందని ఆయన ప్రకటించాడు. దీంతో ఆమె ముందుగా ఒప్పుకున్న అన్ని ప్రోగ్రామ్‌లకు తాత్కాలికంగా కొంతమేరకు విరామం ఇస్తున్నట్లు ఆయన తెలిపాడు. మడోన్నా కోలుకున్న తర్వాత మళ్లీ ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలిపారు. మడోన్నా అనారోగ్యానికి గురికావడం వల్ల తప్పని సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆమె పర్యటనకు సంబంధించి కొత్త తేదీలను రీషెడ్యూల్ చేస్తామన్నారు ఆ షోల వివరాలను త్వరలో తెలుపుతామని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: డైరెక్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఎన్ని లక్షలో తెలుసా?) మడోన్నా తన సంగీత కెరీర్ 40వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో 'సెలబ్రేషన్' పర్యటనను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తన గానంతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ఈ పర్యటనను జూలై 15న వాంకోవర్‌లో ప్రారంభమై US, యూరప్‌కు వెళ్లే ముందు డిసెంబర్ 1న ఆమ్‌స్టర్‌డామ్‌లో ముగుస్తుందని ఆమె గతంలో తెలిపింది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు చింతిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna (@madonna) -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సయీఫ్ అలీఖాన్ (నటుడు), మడోన్నా (గాయని, నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల్ల ఏ కార్యాన్నైనా తెలివితేటలతో చేసి, కార్యజయం పొందుతారు. విద్యార్థులు ఈ మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రచయితలకు, మీడియా వ్యక్తులకు, అధ్యాపకులకు, పాత్రికేయులకు, కంప్యూటర్ రంగ నిపుణులకు, సినీనటులకు శుభ సమయం. విదేశాలలో విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం వీరికి అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి, అనుకోని అవకాశాలు వస్తాయి. వీరు పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ప్రాపంచిక జీవితంపైన కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ ఏర్పడుతుంది. ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. లక్కీ నంబర్స్: 1,5,6,7, 9; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, వైట్, శాండల్, బ్లూ లక్కీ డేస్: మంగళ, బుధ, గురువారాలు. సూచనలు:కేతు జపం చేయడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, వికలాంగులకు, అనాథలకు సహాయంచేయడం, పార్వతీదేవిని ఆరాధించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్