ఆగస్టు 26న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday Celebrating Celebrities | Sakshi
Sakshi News home page

ఆగస్టు 26న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Tue, Aug 25 2015 11:07 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

ఆగస్టు  26న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఆగస్టు 26న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న మధుర్ భండార్కర్ (దర్శకుడు), నీరూ భజ్వా (నటి)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల వివాహ యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. అలంకరణ సామగ్రికి లేదా ఆభరణాల కొనుగోలుకు బాగా వెచ్చిస్తారు. అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతారు. పుట్టిన తేదీ 26. ఇది శని సంఖ్య. శని, శుక్రులు మంచి మిత్రులు కావడం వల్ల వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగా రాణిస్తారు.

ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన వారికి ధన, వస్తు, వాహనాలు సమకూరతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మధ్యలో ఆపేసిన చదువును తిరిగి కొనసాగిస్తారు. కళాకారులకు, సినీనటులకు, సంగీతకారులకు, మీడియా రంగంలోని వారికీ, సినీ నిర్మాతలకు, నగల వ్యాపారులకు ఈ సంవత్సరం శుక్రుని శుభదృష్టి వల్ల చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనే కోరిక తీరుతుంది. గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హృద్రోగం వచ్చే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లక్కీ నంబర్స్: 2,5,6,9; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, ఆరంజ్, రోజ్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు.
 సూచనలు: అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అన్నదానం, సేవాకార్యక్రమాలు చేయడం, పేద కన్యలకు వివాహ ఖర్చులు భరించడం, కాకులకు, కుక్కలకు, పిల్లులకు ఆహారం పెట్టడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement