Madhur Bhandarkar (director)
-
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
ఆ సినిమా బడ్జెట్ కంటే కరీనా దుస్తుల ఖర్చు ఎక్కువ: మధుర్ భండార్కర్
చాందినీ బార్, ఫ్యాషన్, హీరోయిన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్. ఆయన తన రెండో చిత్రం అయిన చాందినీ బార్కి జాతీయ అవార్డు సాధించడ విశేషం. ఆ సినిమా విడుదలై సెప్టెంబర్ 28కి రెండు దశాబ్దాలు గడిచింది. ఈ తరుణంలో ఆయన ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. భండార్కర్ మాట్లాడుతూ..‘చాందినీ బార్ మొత్తం బడ్జెట్ 1.5 కోట్లు మాత్రమే. ఇది హీరోయిన్ సినిమాలో కరీనా కపూర్ దుస్తులకి అయిన ఖర్చు కంటే తక్కువ. ఈ విషయం బెబోతో చెబుతూ జోక్ చేసేవాడిని’ అని తెలిపాడు. ఆ మూవీని టబుని దృష్టిలో పెట్టుకొని స్టోరీని రాసినట్లు, అప్పుడు కమర్షియల్ హీరోయిన్గా ఉన్న ఆమె ఒప్పుకోకపోతే చాలా నిరాశ పడేవాడినని చెప్పాడు. అయితే ఆమె ఈ కథను యాక్సెప్ట్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా సినిమా టైటిల్ విడుదల సమయంలో చర్చనీయాంశంగా మారిందని, చాలామంది బీ గ్రేడ్ మూవీగా భావించారని పేర్కొన్నాడు. అయితే దాదాపు ఆరు నెలల పాటు పరిశోధించి తీసిన ఆ సినిమాకి జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపాడు. అయితే భండార్కర్ తీసిన సినిమాలు ఆయన్ని సమయోచిత, వాస్తవిక, కష్టతరమైన చిత్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించి పెట్టాయి. కాగా ప్రస్తుతం ఆయన ఇండియా లాక్డౌన్ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల -
ఆగస్టు 26న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న మధుర్ భండార్కర్ (దర్శకుడు), నీరూ భజ్వా (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల వివాహ యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. అలంకరణ సామగ్రికి లేదా ఆభరణాల కొనుగోలుకు బాగా వెచ్చిస్తారు. అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతారు. పుట్టిన తేదీ 26. ఇది శని సంఖ్య. శని, శుక్రులు మంచి మిత్రులు కావడం వల్ల వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగా రాణిస్తారు. ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన వారికి ధన, వస్తు, వాహనాలు సమకూరతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మధ్యలో ఆపేసిన చదువును తిరిగి కొనసాగిస్తారు. కళాకారులకు, సినీనటులకు, సంగీతకారులకు, మీడియా రంగంలోని వారికీ, సినీ నిర్మాతలకు, నగల వ్యాపారులకు ఈ సంవత్సరం శుక్రుని శుభదృష్టి వల్ల చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనే కోరిక తీరుతుంది. గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హృద్రోగం వచ్చే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 2,5,6,9; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, ఆరంజ్, రోజ్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు. సూచనలు: అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అన్నదానం, సేవాకార్యక్రమాలు చేయడం, పేద కన్యలకు వివాహ ఖర్చులు భరించడం, కాకులకు, కుక్కలకు, పిల్లులకు ఆహారం పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్