ఆ సినిమా బడ్జెట్‌ కంటే కరీనా దుస్తుల ఖర్చు ఎక్కువ: మధుర్ భండార్కర్ | Madhur Bhandarkar once joked Kareena Kapoor's clothes in Heroine cost more than entire budget of Chandni Bar | Sakshi
Sakshi News home page

ఆ సినిమా బడ్జెట్‌ కంటే కరీనా దుస్తుల ఖర్చు ఎక్కువ: మధుర్ భండార్కర్

Published Wed, Sep 29 2021 10:53 AM | Last Updated on Wed, Sep 29 2021 1:00 PM

Madhur Bhandarkar once joked Kareena Kapoor's clothes in Heroine cost more than entire budget of Chandni Bar - Sakshi

చాందినీ బార్, ఫ్యాషన్‌, హీరోయిన్‌ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్‌ దర్శకుడు మధుర్‌ భండార్కర్. ఆయన తన రెండో చిత్రం అయిన చాందినీ బార్‌కి జాతీయ అవార్డు సాధించడ విశేషం. ఆ సినిమా విడుదలై సెప్టెంబర్‌ 28కి రెండు దశాబ్దాలు గడిచింది. ఈ తరుణంలో ఆయన ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

భండార్కర్‌ మాట్లాడుతూ..‘చాందినీ బార్‌ మొత్తం బడ్జెట్‌ 1.5 కోట్లు మాత్రమే. ఇది హీరోయిన్‌ సినిమాలో కరీనా కపూర్‌ దుస్తులకి అయిన ఖర్చు కంటే తక్కువ. ఈ విషయం బెబోతో చెబుతూ జోక్‌ చేసేవాడిని’ అని తెలిపాడు. ఆ మూవీని టబుని దృష్టిలో పెట్టుకొని స్టోరీని రాసినట్లు, అప్పుడు కమర్షియల్‌ హీరోయిన్‌గా ఉన్న ఆమె ఒప్పుకోకపోతే చాలా నిరాశ పడేవాడినని చెప్పాడు. అయితే ఆమె ఈ కథను యాక్సెప్ట్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.

అంతేకాకుండా సినిమా టైటిల్‌ విడుదల సమయంలో చర్చనీయాంశంగా మారిందని, చాలామంది బీ గ్రేడ్‌ మూవీగా భావించారని పేర్కొన్నాడు. అయితే దాదాపు ఆరు నెలల పాటు పరిశోధించి తీసిన ఆ సినిమాకి జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపాడు. అయితే భండార్కర్‌ తీసిన సినిమాలు ఆయన్ని సమయోచిత, వాస్తవిక, కష్టతరమైన చిత్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించి పెట్టాయి. కాగా ప్రస్తుతం ఆయన ఇండియా లాక్‌డౌన్‌ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

చదవండి: ఇండియా లాక్‌డౌన్‌.. టైటిల్‌ పోస్టర్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement