పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Sun, Jul 26 2015 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సాయికుమార్ (నటుడు) రజని (నటి)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. వీరు పుట్టిన తేదీ 27. ఇది కుజునికి సంబంధించి నది. ఇది న్యూమరాలజీ లో మంచి అరుదైన అవకాశాలను ఇచ్చే సంఖ్య. ఇందువల్ల వీరు అందంగా, ఆకర్షణీయంగా, మంచి ధైర్యసాహసాలతో ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, అవివాహితులకు వివాహ యోగం కలుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచి సర్కిల్ ఏర్పడుతుంది. విలాస వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. విదేశాలలో చదువు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరుతుంది. వీరు క్రమశిక్షణగా ఉంటూ, అందరినీ క్రమశిక్షణలో ఉంచాలనుకో వడం వల్ల లేనిపోని విరోధాలు వచ్చే అవకాశం ఉంది.

పోలీసులు, మిలిటరీ వారు, డాక్టర్లు, లాయర్లు బాగా రాణిస్తారు. వీరు ఈ సంవత్సరం బరువు బాగా పెరగడం వల్ల హృద్రోగ సంబంధ వ్యాధులు బాధించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ కలర్స్: రెడ్, పర్పుల్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, బ్లూ; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, రక్తదానం చేయడం, పేద కన్యల వివాహ ఖర్చులను భరించడం, అనవసర వివాదాలలో తలదూర్చకుండా ఉండటం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement