మే 25న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కరణ్ జోహార్ (బాలీవుడ్ దర్శకుడు), కార్తి (నటుడు)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరికి ఈ సంవత్సం ఒడుదొడుకులు ఎదురయే అవకాశం ఉంది. బలమైన ప్రయత్నాలతోనే విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి ఎదురవుతుంది. తల్లితరఫు వారినుంచి, భార్య తరఫు వారి నుంచి మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు.
పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. సిద్ధపురుషుల ఆశీస్సులు లభిస్తాయి. సైన్స్, మెడిసిన్ విద్యార్థులకు ఇది మంచి సమయం. విదేశాలలో చదువుకోవాలనుకునేవారి కల నెరవేరుతుంది. విదేశాలలో ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయంలో కొద్దిపాటి ఒడుదొడుకులున్నప్పటికీ, ఆందోళన పడవలసిన పనిలేదు.
లక్కీనంబర్స్:1,2,6,7 లక్కీ కలర్స్: రోజ్, వైట్; సిల్వర్, గ్రే లక్కీ డేస్:ఆది, సోమ, శుక్రవారాలు.
సూచన: సాయిబాబా లేదా దత్త దర్శనం చేసుకోవడం, గోవిందనామాలు పారాయణ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వరారాధన, పేద విద్యార్థులకు అన్నదానం, ఆర్థిక సాయం చేయడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు