నవంబర్ 01 పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఐశ్వర్యారాయ్ (నటి), ఇలియానా (నటి), వీవీఎస్ లక్ష్మణ్ (మాజీ క్రికెటర్)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 11. ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న సంఖ్య. దీనిలో రెండు ఒకట్లు (సూర్యుని సంఖ్యలు) కలిసి చంద్రుని సంఖ్య 2 ఏర్పడింది కాబట్టి ఇది మాస్టర్ నంబర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పోయిన సంవత్సరం ప్రారంభించిన ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు గడిస్తారు.
వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. ఇంటర్యూలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. దానివల్ల ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ, మంచి ఫలితం కూడా ఉంటుంది. వీరికిది ల్యాండ్‌మార్క్ ఇయర్‌గా మిగిలిపోతుంది. వీరి పుట్టిన తేదీ 1 సూర్యసంఖ్య కాబట్టి వీరికి స్వతహాగానే నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి అయితే సూర్యచంద్రుల దుష్ర్పభావం వల్ల వీరికి ఈ సంవత్సరం మానసికాందోళన, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూడీగా అయిపోతుండటం వంటి ప్రమాదాలున్నాయి కాబట్టి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండటం మంచిది.
లక్కీ నంబర్స్: 1, 2, 3, 6, 7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమవారాలు.
సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని కానీ, తల్లితో సమానురాలైన వారిని కానీ ఆదరించి, గౌరవించి సేవ చేయడం, ఆలయాలలో, మదరసాలలో, చర్చిలలో అన్నదానం చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్