జూన్ 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on june 06 the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూన్ 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Fri, Jun 5 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

జూన్ 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూన్ 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: గౌరీ ముంజల్ (నటి), భావన (నటి)

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి బర్త్‌డేట్‌లో రెండు ఆర్లు ఉండటం గమనించే ఉంటారు. శుక్రగ్రహ ప్రభావం వల్ల వీరికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. కోరిన కోరికలన్నీ తీరుతుంటాయి. శుభ్రమైన వస్తువులు, వస్త్రాభరణాలు ధరించడంపై మక్కువ చూపుతారు.

వీరి సంవత్సర సంఖ్య 2 కావడం వల్ల ఈ సంవత్సరం వీరికి కొంచెం ఒడుదొడుకులు తప్పవు. కొత్తవాటి జోలికి వెళ్లకుండా గత సంవత్సరం ప్రారంభించిన పనులు లేదా ప్రాజెక్టులనే కొనసాగించడం మంచిది. రుణాల కోసం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక రంగమైన టీవీ, మీడియా రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. మీ సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు. మీ నైపుణ్యానికి తగ్గ ఆదాయం లభించడం లేదని వాపోయినప్పటికీ, అది తాత్కాలికమే అని గ్రహించండి. మీ ధోరణి వల్ల బంధువులతో మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది.
 
లక్కీనంబర్స్: 2, 6, 7, 9; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, సిల్వర్, ఎల్లో;
లక్కీ డేస్: శుక్ర, శని, సోమవారాలు.
సూచనలు: ఉద్యోగాలు మారాలనే కోరికను వాయిదా వేసుకోవడం మంచిది. వీలున్నప్పుడల్లా చంద్రుని వెన్నెలలో సేదతీరుతుండాలి. చంద్రజపం చేయించుకోవాలి. చంద్రకాంతమణిని ధరించాలి. అనాథలకు బెల్లం పాయసం తినిపించాలి.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement