bhavana (actress)
-
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్‌లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్‌లు రావడంతో టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్‌తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
#మాయలో మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మాయలో నటీనటులు: నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్, తదితరులు దర్శకత్వం: మేఘా మిత్ర పేర్వార్ నిర్మాణ సంస్థ: ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాతలు: షాలిని నంబు, రాధా కృష్ణ నంబు విడుదల తేది: 15-12-2023 నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '#మాయలో'. ఈ చిత్రానికి మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సినిమాని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం. అసలు కథేంటంటే: మాయ (జ్ఞానేశ్వరి) తన ప్రియుడు పాల్‌తో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమెకు క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులుంటారు. వీరు అంతా కలిసి పెరిగి పెద్దవుతారు. అయితే వీరందరికీ ఒకరితో ఒకరికి రిలేషన్ ఉంటుంది. అయితే... మాయ క్రిష్, సింధుని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దాంతో వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అయితే వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? క్రిష్, సింధూల మధ్య ఉన్న బంధం ఎలాంటిది? అలాగే క్రిష్, మాయల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? మంచి స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా సాగిందంటే? నేటి యువతకి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు వస్తున్నాయి. అవన్నీ ఎక్కువ భాగం ఓటీటీని టార్గెట్ చేస్తూ నిర్మించినవే. అయితే మాయలో మూవీ మాత్రం.. వెండితెరపైనా అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు. యూత్‌కి నచ్చే.. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో... అలాంటి స్క్రీన్ ప్లేకి సంభాషణల రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించారు దర్శకుడు. ఈ చిత్రం ఎక్కువ భాగం రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతుంది. నరేష్ అగస్త్య, భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఎవరెలా చేశారంటే..? మత్తు వదలరా, పంచతంత్ర సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య ఈ సినిమాలో కూడా తనదైన నటనతో మెప్పించారు. భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందది. అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్క్ మోడ్రన్ గర్ల్‌గా మెప్పించింది. ముఖ్యంగా భావన, జ్ఞానేశ్వరి సంభాషణలు క్లైమాక్స్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఆర్జే హేమంత్ పోలీసు పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. మంత్ ఆఫ్ మధులో జ్ఞానేశ్వరి ఎంతబాగా ఆకట్టుకుందో... ఈ చిత్రంలోనూ ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన కూడా ఇన్‌స్టా ఇన్ ఫ్లూయెన్సర్‌గా మెప్పించింది. సాంకేతికత విషయానికొస్తే.. చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్... నేటి యూత్‌ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా సంభాషణలు నేటి యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ కూడా బాగుంది. సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా నిర్మించారు. -
జూన్ 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: గౌరీ ముంజల్ (నటి), భావన (నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి బర్త్డేట్లో రెండు ఆర్లు ఉండటం గమనించే ఉంటారు. శుక్రగ్రహ ప్రభావం వల్ల వీరికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. కోరిన కోరికలన్నీ తీరుతుంటాయి. శుభ్రమైన వస్తువులు, వస్త్రాభరణాలు ధరించడంపై మక్కువ చూపుతారు. వీరి సంవత్సర సంఖ్య 2 కావడం వల్ల ఈ సంవత్సరం వీరికి కొంచెం ఒడుదొడుకులు తప్పవు. కొత్తవాటి జోలికి వెళ్లకుండా గత సంవత్సరం ప్రారంభించిన పనులు లేదా ప్రాజెక్టులనే కొనసాగించడం మంచిది. రుణాల కోసం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక రంగమైన టీవీ, మీడియా రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. మీ సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు. మీ నైపుణ్యానికి తగ్గ ఆదాయం లభించడం లేదని వాపోయినప్పటికీ, అది తాత్కాలికమే అని గ్రహించండి. మీ ధోరణి వల్ల బంధువులతో మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది. లక్కీనంబర్స్: 2, 6, 7, 9; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, సిల్వర్, ఎల్లో; లక్కీ డేస్: శుక్ర, శని, సోమవారాలు. సూచనలు: ఉద్యోగాలు మారాలనే కోరికను వాయిదా వేసుకోవడం మంచిది. వీలున్నప్పుడల్లా చంద్రుని వెన్నెలలో సేదతీరుతుండాలి. చంద్రజపం చేయించుకోవాలి. చంద్రకాంతమణిని ధరించాలి. అనాథలకు బెల్లం పాయసం తినిపించాలి. - డాక్టర్ మహమ్మద్ దావూద్ సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు