#మాయలో మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Tollywood Movie Mayalo Review In Telugu | Sakshi
Sakshi News home page

#Mayalo Movie Review: #మాయలో మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published Fri, Dec 15 2023 11:15 PM | Last Updated on Fri, Dec 15 2023 11:16 PM

Tollywood Movie Mayalo Review In Telugu - Sakshi

టైటిల్: #మాయలో
నటీనటులు: నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్, తదితరులు
దర్శకత్వం: మేఘా మిత్ర పేర్వార్
నిర్మాణ సంస్థ:  ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌
నిర్మాతలు: షాలిని నంబు, రాధా కృష్ణ నంబు
విడుదల తేది: 15-12-2023

నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం  '#మాయలో'. ఈ చిత్రానికి మేఘా మిత్ర పేర్వార్  దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సినిమాని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం. 

అసలు కథేంటంటే: 

మాయ (జ్ఞానేశ్వరి) తన ప్రియుడు పాల్‌తో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమెకు క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులుంటారు. వీరు అంతా కలిసి పెరిగి పెద్దవుతారు. అయితే వీరందరికీ ఒకరితో ఒకరికి రిలేషన్ ఉంటుంది. అయితే... మాయ క్రిష్, సింధుని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దాంతో వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అయితే వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? క్రిష్, సింధూల మధ్య ఉన్న బంధం ఎలాంటిది? అలాగే క్రిష్, మాయల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? మంచి స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఎలా సాగిందంటే?

 నేటి యువతకి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు వస్తున్నాయి. అవన్నీ ఎక్కువ భాగం ఓటీటీని టార్గెట్ చేస్తూ నిర్మించినవే. అయితే మాయలో మూవీ మాత్రం.. వెండితెరపైనా అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు. యూత్‌కి నచ్చే.. ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంటుందో... అలాంటి స్క్రీన్ ప్లేకి సంభాషణల రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించారు దర్శకుడు. ఈ చిత్రం ఎక్కువ భాగం రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతుంది. నరేష్ అగస్త్య, భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. 

ఎవరెలా చేశారంటే..?

మత్తు వదలరా, పంచతంత్ర సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య ఈ సినిమాలో కూడా తనదైన నటనతో మెప్పించారు. భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందది. అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్క్ మోడ్రన్ గర్ల్‌గా మెప్పించింది. ముఖ్యంగా భావన, జ్ఞానేశ్వరి  సంభాషణలు క్లైమాక్స్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఆర్జే హేమంత్ పోలీసు పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. మంత్ ఆఫ్ మధులో జ్ఞానేశ్వరి ఎంతబాగా ఆకట్టుకుందో... ఈ చిత్రంలోనూ ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన కూడా ఇన్‌స్టా ఇన్ ఫ్లూయెన్సర్‌గా మెప్పించింది. 

సాంకేతికత విషయానికొస్తే.. చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్... నేటి యూత్‌ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా సంభాషణలు నేటి యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ కూడా బాగుంది. సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement