Tollywood Movie Review
-
సైంటిఫిక్ థ్రిల్లర్ 'ఆరంభం'.. ఎలా ఉందంటే?
టైటిల్: ఆరంభంనటీనటులు: మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్కల్యాణ్, రవీంద్రవిజయ్ తదితరులుదర్శకత్వం: అజయ్ నాగ్ వినిర్మాత: అభిషేక్ వీటీసంగీతం: సింజిత్ యర్రమిల్లిసినిమాటోగ్రఫీ: దేవ్‌దీప్ గాంధీ కుందువిడుదల తేదీ: మే 13, 2024మోహన్‌భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్కల్యాణ్, రవీంద్రవిజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం. అజయ్ నాగ్ దర్శకత్వంలో.. అభిషేక్ వీటీ నిర్మించారు. విందు భోజనం, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అజయ్ నాగ్ వి సరికొత్త కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చిన ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..కథ జైలు బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. ఖైదీలు, జైలు సీన్స్‌తో రోటీన్‌గా ప్రారంభించాడు. అయితే జైలు నుంచి మోహన్ భగత్(మిగిల్) ఖైదీ తప్పించుకుంటాడు. ఉరి శిక్ష ఎదుర్కొవాల్సిన మోహన్ భగత్(మిగిల్) ఊహించని విధంగా జైలు నుంచి తప్పించుకుంటాడు. అతను ఎలా తప్పించుకున్నాడో కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్రవిజయ్) రంగంలోకి దిగుతారు. అసలు అంత భద్రత ఉన్న జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అతనికి ఎవరైనా సాయం చేశారా? నాలుగు గోడల మధ్య నుంచి ఎలా మాయమయ్యాడు? అనేది తెలియాలంటే ఆరంభం చూడాల్సిందే.ఎలా ఉందంటే..విందు భోజనం, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అజయ్ నాగ్ వి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఫస్ట్ హాఫ్‌లోనే మొదటి అధ్యాయం 'ముగింపు' అంటూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచారు. జైలు సీన్స్, డిటెక్టివ్ రవీంద్రవిజయ్ ఇంటరాగేషన్ సీన్స్‌తో సీరియస్‌తో పాటు హాస్యభరితంగా అనిపిస్తాయి. మిగిల్ (మోహన్ భగత్), సుబ్రమణ్యరావు(భూషణ్ కల్యాణ్)కు చిన్నప్పుడే పరిచయం కావడం.. వారి మధ్య ఎమోషనల్ సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. మిగిల్, సురభి ప్రభావతి(లీలమ్మ) మధ్య సన్నివేశాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. కథ చాలా నెమ్మదిగా సాగినప్పటికీ.. తెరపై సీన్స్ మాత్రం చాలా సహజంగా చూపించాడు. మిగిల్, సుబ్రమణ్యరావు కలిసి ఓ సైంటిఫిక్ ప్రాజెక్ట్ కోసం పని చేస్తుంటారు. ఆ తర్వాత వీరి మధ్యలోకి శారద(సుప్రిత ) ఎంట్రీ ఇస్తుంది. శారద, సుబ్రమణ్యరావు(భూషణ్ కల్యాణ్)ను కలిశాక ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. వీరిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలంటే ఆరంభం సినిమా తెరపై చూడాల్సిందే.అయితే సెకండాఫ్‌లో కథ మొత్తం సుబ్రమణ్యరావు చేపట్టిన మిషన్ చుట్టే తిరుగుతుంది. మిగిల్, శారద.. సుబ్రమణ్యరావు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం పని చేస్తుంటారు. అసలు ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటనేది తెలియకుండా ఆడియన్స్‌లో సస్పెన్ష్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఊహించని సంఘటనలతో మిగిల్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కథలో అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టించినా.. చాలా సన్నివేశాల్లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఒకవైపు సైన్స్‌ను చూపిస్తూ.. మరోవైపు ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అయితే చివరికీ సుబ్రమణ్యరావు చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? అసలు జైలు నుంచి తప్పించుకున్న మిగిల్ దొరికాడా? దేనికోసం ఆ ప్రాజెక్ట్ చేపట్టారు? ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న మిగిల్, జైలు నుంచి తప్పించుకున్న మిగిల్ ఒక్కరేనా? లేదా ఇద్దరా? జైలు నుంచి పరారైన మిగిల్ను డిటెక్టివ్ (రవీంద్రవిజయ్)కనిపెట్టాడా? అనే విషయాలు తెలియాలంటే ఆరంభం చూడాల్సిందే.ఎవరెలా చేశారంటే..కేరాఫ్ కంచెర్ల పాలెంలో గడ్డం క్యారెక్టర్‌తో మెప్పించిన మోహన్ భగత్ లీడ్ రోల్లో మెప్పించాడు. తన నటన, హావభావాలతో అదరగొట్టేశాడు. సుప్రిత సత్యనారాయణ్ తన పాత్రలో ఒదిగిపోయారు. రవీంద్రవిజయ్ డిటెక్టివ్ పాత్రలో మెప్పించారు. భూషణ్కల్యాణ్, లక్ష్మణ్ మీసాల,సురభి ప్రభావతి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే దేవ్‌దీప్ గాంధీ సినిమాటోగ్రఫీ బాగుంది. సింజిత్ యర్రమిల్లి నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Tenant Movie Review: ‘టెనెంట్' మూవీ రివ్యూ
టైటిల్: టెనెంట్ నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు దర్శకత్వం: వై. యుగంధర్ నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్ ఎడిటర్: విజయ్ ముక్తవరపు సంగీతం: సాహిత్య సాగర్ విడుదల తేదీ: 19-04-2024 అసలు కథేంటంటే.. సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు. ఎవరెలా చేశారంటే.. పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
కరెన్సీ నగర్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: కరెన్సీ నగర్ నటీనటులు: యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ నిర్మాత సంస్థ: ఉన్నతి ఆర్ట్స్ నిర్మాతలు: ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ దర్శకుడు: వెన్నెల కుమార్ పోతేపల్లి సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని ఎడిటర్: కార్తిక్ సినిమాటోగ్రఫీ: సతీష్ విడుదల తేదీ: 2023 డిసెంబర్ 29 యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కరెన్సీ నగర్ . ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మించారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డిసెంబర్ 29న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. సత్య (సుదర్శన్)కు ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దొంగతనం చేసి అయినా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళతాడు. అక్కడ సత్యకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. మాట్లాడే ఒక ఇనుప పెట్టలో బంగారం ఉంటుంది, ఆ బంగారం తీసుకోవాలనే క్రమంలో ఇనుము పెట్ట సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ , మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పులు.. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు ? అతను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతనికి కావాల్సిన ఐదు లక్షలు దొరికాయా ? నిజంగానే ఇనపెట్టే మాట్లాడిందా ? వంటి విషయాలు తెలియాలంటే కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి తాను తీసిన మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తీశాడు. తాను రాసుకున్న కథను తెరమీద చక్కగా చూపించాడు. కేశవ ,చాందిని ఎపిసోడ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మొదటి కథ పెయిన్లో అమ్మ క్యారెక్టర్ చిన్నది అయినా బాగా వర్కవుట్ అయింది. ప్రీ క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అయింది. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇలాంటి కథ, కథనాలతో థియేటర్‌కు వచ్చిన మొదటి సినిమాగా కరెన్సీ నగర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు చదివిన బేతాళ కథలు గుర్తుకు వస్తాయి. కానీ కథలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. తెరమీద చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కరెన్సీ నగర్. ఎవరెలా చేశారంటే... యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే సినిమా టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం బాగుంది. కార్తిక్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. సతీశ్ సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. -
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
#మాయలో మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మాయలో నటీనటులు: నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్, తదితరులు దర్శకత్వం: మేఘా మిత్ర పేర్వార్ నిర్మాణ సంస్థ: ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాతలు: షాలిని నంబు, రాధా కృష్ణ నంబు విడుదల తేది: 15-12-2023 నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '#మాయలో'. ఈ చిత్రానికి మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సినిమాని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం. అసలు కథేంటంటే: మాయ (జ్ఞానేశ్వరి) తన ప్రియుడు పాల్‌తో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమెకు క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులుంటారు. వీరు అంతా కలిసి పెరిగి పెద్దవుతారు. అయితే వీరందరికీ ఒకరితో ఒకరికి రిలేషన్ ఉంటుంది. అయితే... మాయ క్రిష్, సింధుని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దాంతో వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అయితే వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? క్రిష్, సింధూల మధ్య ఉన్న బంధం ఎలాంటిది? అలాగే క్రిష్, మాయల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? మంచి స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా సాగిందంటే? నేటి యువతకి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు వస్తున్నాయి. అవన్నీ ఎక్కువ భాగం ఓటీటీని టార్గెట్ చేస్తూ నిర్మించినవే. అయితే మాయలో మూవీ మాత్రం.. వెండితెరపైనా అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు. యూత్‌కి నచ్చే.. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో... అలాంటి స్క్రీన్ ప్లేకి సంభాషణల రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించారు దర్శకుడు. ఈ చిత్రం ఎక్కువ భాగం రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతుంది. నరేష్ అగస్త్య, భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఎవరెలా చేశారంటే..? మత్తు వదలరా, పంచతంత్ర సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య ఈ సినిమాలో కూడా తనదైన నటనతో మెప్పించారు. భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందది. అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్క్ మోడ్రన్ గర్ల్‌గా మెప్పించింది. ముఖ్యంగా భావన, జ్ఞానేశ్వరి సంభాషణలు క్లైమాక్స్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఆర్జే హేమంత్ పోలీసు పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. మంత్ ఆఫ్ మధులో జ్ఞానేశ్వరి ఎంతబాగా ఆకట్టుకుందో... ఈ చిత్రంలోనూ ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన కూడా ఇన్‌స్టా ఇన్ ఫ్లూయెన్సర్‌గా మెప్పించింది. సాంకేతికత విషయానికొస్తే.. చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్... నేటి యూత్‌ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా సంభాషణలు నేటి యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ కూడా బాగుంది. సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా నిర్మించారు. -
'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ
టైటిల్: మామా మశ్చీంద్ర నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, మృణాళిని రవి, అజయ్ తదితరులు నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ డైరెక్టర్: హర్షవర్ధన్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: అక్టోబర్ 06 నిడివి: 2h 29m కథేంటి? పరశురామ్(సుధీర్ బాబు)కి చాలా స్వార్థం. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని తన మనిషి దాసుకి చెప్తాడు. కానీ వాళ్ళు బతికిపోతారు. కట్ చేస్తే పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి).. దుర్గ(సుధీర్ బాబు) డీజే (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో పడతారు. వీళ్ళిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. వీళ్లు తన మేనల్లుడ్లే అని పరశురామ్‌కి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు పరశురామ్ ఏం తెలుసుకున్నాడు అనేది స్టోరీ. ఎలా ఉంది? సినిమా అంటే ఎవరెన్ని చెప్పినా వినోదం మాత్రమే. రెండు లేదా మూడు గంటలా అనేది ఇక్కడ మేటర్ కాదు. నవ్వించవా, థ్రిల్ చేశావా? ఇలాంటి అంశాలు మాత్రమే ఆడియెన్స్ చూస్తారు. ఈ విషయంలో మామ మశ్చీంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కామెడీ, థ్రిల్, డ్రామా.. ఇలా ఏ పార్ట్ లోనూ కనీసం అలరించ లేకపోయింది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని డైరెక్టర్ అనుకున్నాడు. అవి రెండున్నర గంటలు బుర్ర గొక్కునేల చేశాయి! ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. జాలి దయలేని తండ్రి వల్ల చిన్నప్పుడే పరశురామ్ తల్లి చనిపోవడం... తల్లికి దక్కాల్సిన ఆస్తిని మేనమామ లాగేసుకోవడం.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మేనమామకు కూతురు వరసైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అస్తినంతా దక్కించుకోవడం.. ఇక వయసు పెరిగిన తర్వాత పరశురామ్.. అతడు కూతురు విశాలాక్షీ.. పరశురామ్ దగ్గర పనిచేసే దాసు.. అతడు కూతురు మీనాక్షి.. వీళ్ళ లైఫ్ లోకి దుర్గ, డీజే అనే వ్యక్తులు రావడం.. అల ఈ పాత్రల మధ్య ఎలాంటి డ్రామా నడిచింది చివరకి ఏమైంది అనేదే తెలియాలంటే సినిమా చూడాలి.. స్టోరీ పరంగా స్వార్థం అనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ దాన్ని చెప్పడంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చూసే ప్రేక్షకుడికి కూడా అది ఎక్కలేదు. హీరో సుదీర్ బాబు.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రలు చేశాడు. డీజేగా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఇది ఓకే. కానీ మిగతా రెండు పాత్రలు డిజైన్ అస్సలు సెట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో చాలా చిరాకు పెట్టించారు. పబ్ లో వచ్చే ఆర్జీవీ ఎపిసోడ్ అయితే అనవసరం. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు. క్వాలిటీ విషయం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. క్లైమాక్స్ లో మనిషిలో స్వార్థం గురించి చెప్పే సీన్ మాత్రమే. ఎవరెలా చేశారు? మూడు పాత్రల్లో ఏదో ప్రయోగం చేద్దామని హీరో సుధీర్ బాబు ప్రయత్నించాడు గానీ అది అడ్డంగా బెడిసికొట్టింది. పరశురామ్ కారెక్టర్ ని అయిన మంచిగా రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ గ చేసిన ఈషా రెబ్బ, మృణాళిని రవి ఓకే ఓకే. ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇందులో దాసు పాత్ర చేశాడు అది పర్లేదు. మిగతా కారెక్టర్స్ చేసిన వాళ్ళు మామ అనిపించారు. అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లని సరిగా వాడుకొలేకపోయారు. టెక్నికల్ విషయాల్లో ఈ సినిమాలోని పాటలు పెద్దగా గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు చాలా పూర్. రైటింగ్ కూడా అస్సలు ఎఫెక్టివ్‌గా లేదు. ఓవరాల్‌గా థియేటర్స్‌లో మామ మశ్చీంద నిలబడటం అంటే చాలా కష్టం. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
నా భర్త విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వను: స్వాతీ రెడ్డి
‘‘శ్రీకాంత్ తీసిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమాలో చాలా క్లిష్టమైన భావోద్వేగాలు ఉన్నాయి. ఆయన తీసిన ఈ ‘మంత్ ఆఫ్ మధు’లోనూ అలాంటి భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. నవీన్ చంద్ర, స్వాతీ రెడ్డి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సాయిధరమ్ తేజ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ – ‘‘మా సినిమాకి మంచి కథ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా అన్నీ బాగా కుదిరాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూసినవారు సర్ర్పైజ్ అవుతారు’’ అన్నారు స్వాతీ రెడ్డి. అలాగే తన భర్త నుంచి స్వాతి విడాకులు తీసుకున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తారా అని అడగ్గా.. ‘‘నేనివ్వా’’ అన్నారు స్వాతి. ‘‘మంత్ ఆఫ్ మధు’ అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీకాంత్ నాగోతి. చిత్ర సహనిర్మాత సుమంత్ దామ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రఘువర్మ పేరూరి, నటీనటులు శ్రేయ, రాజా రవీంద్ర, హర్ష, యశ్వంత్ పాల్గొన్నారు. - స్వాతీ రెడ్డి -
ప్రేమదేశపు యువరాణి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశపు యువరాణి నటీనటులు: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి, మెహబూబ్ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్, పవన్ ముత్యాల, రాజారెడ్డి, సందీప్, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు తదితరులు నిర్మాణ సంస్థలు: ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల సంగీతం: అజయ్ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ ఎడిటర్: ఎం.ఆర్. వర్మ విడుదల తేదీ: 02-09-2023. ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు చక్కటి రెస్పాన్స్ వచ్చింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. అమలాపురంలో వీరయ్య అనే రౌడీ షీటర్ చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతూ.. ఎదురు తిరిగిన వారిని చంపుతూ.. నచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతుంటాడు. అయితే అదే ఊర్లో బీటెక్ ఫెయిలై తాగుతూ జూలాయిగా తిరుగుతున్న చెర్రీ (యామిన్ రాజ్)కి, శ్రావణి (ప్రియాంక రేవ్రి) కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెనే తన ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అయిపోతాడు.ఆమె గురించి ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తాడు. అయితే రావులపాలెం నుంచి ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురంకు వచ్చిందని శ్రావణి తండ్రి, చెర్రీ తండ్రి ఇద్దరు చిన్ననాటి స్నేహితులని తెలుస్తుంది. ఆ తరువాత శ్రావణితో పరిచయం కావడం.. దీంతో చెర్రీ బీటెక్ పాసయ్యేందుకు హెల్ప్ చేస్తానని ఆమె అంటుంది. ఆలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. చివరకు పెళ్లి చేసుకుందామని చెర్రీ చెప్పగానే.. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా నాకు చాలా గోల్స్ ఉన్నాయని నో అంటుంది. అయితే పెళ్లి విషయంలో శ్రావణిని చెర్రీ నిలదీయడంతో రవి (విరాట్ కార్తిక్)ను ఇష్టపడ్డానని చెబుతుంది. దీంతో షాక్ తిన్న చెర్రీ శ్రావణి ప్రేమను దక్కించు కోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు శ్రావణి చెర్రీని పెళ్లి చేసుకుందా? అనేదే అసలు కథ. అంతే కాకుండా మరో వైపు అదే ఊరిలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. వీటి వల్ల రౌడీ షీటర్ వీరయ్య మనుషులు చనిపోతూ ఉంటారు. అసలు ఈ మర్డర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే విషయాలు తెలిసేలోపే రౌడీ షీటర్ వీరయ్యతో పాటు తన కొడుకు భైరవ్ హత్యకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది? అసలు ఈ రవి ఎవరు? తనకు శ్రావణి ఎందుకు దూరంగా ఉంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తను కలెక్టర్ అవుతుందా? చివరకు శ్రావణి చెర్రీ కు దగ్గరైందా? లేక రవికి దగ్గరైందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో తప్పకుండా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్ ఉన్న సబ్జెక్ ను ఫీల్‌గుడ్ లవ్‌స్టోరిని తెరకెక్కించారు సాయి సునీల్ నిమ్మల. ఆసక్తికర సన్నివేశాలతో చక్కని కథను మలిచారు. డబుల్ మీనింగ్ జోకులు.. కుల్లి కామెడీ లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు సాయి సునీల్ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అజయ్ పట్నాయక్ అద్భుతమైన సంగీతం సినిమాకు ప్లస్. ఆర్పీ, పట్నాయక్, సునీత పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ‘ప్రేమదేశపు యువరాణి’ సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు. ఎవరెలా చేశారంటే? చెర్రీ పాత్రలో నటించిన (యామిన్ రాజ్) తన నటనతో అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. శ్రావణి పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక రేవ్రి తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది. రవి పాత్రలో లెక్చరర్‌గా నటించిన విరాట్ కార్తిక్ తన పాత్రకు న్యాయ చేశాడు. హీరోకు ఫ్రెండ్స్‌గా నటించిన మెహబూబ్ బాషా, బండ సాయి, బక్క సాయి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో శంకర్ గా నటించిన రాజారెడ్డి నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, క్రైమ్‌ను సాల్వ్ చేసే విషయంలో పోలీసుల ఇన్వేస్టిగేషన్, వారి ఆలోచన తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయనే సన్నివేశాల్లో సహజమైన నటనతో పాటు పాత్రలో ఒదిగిపోయాడు. వీరయ్య పాత్రలో సందీప్ క్రూరమైన విలన్ గా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరో తల్లి తండ్రులుగా హరికృష్ణ, సునీత, యోగి కద్రి, రఘు, ముత్యాల, రాజారెడ్డి, స్రవంతి, , ప్రత్యూష, గోపీనాయుడు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. సాంకేతికత విషయాకొనికొస్తే శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫీ బాగుంది.. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
'హలో మీరా' మూవీ రివ్యూ
నటీనటులు: గార్గేయి ఎల్లాప్రగడ దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల నిర్మాణ సంస్థ: లూమియర్ సినిమా నిర్మాతలు: డాక్టర్ లక్ష్మణరావు దిక్కుల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల సంగీత: ఎస్.చిన్న సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడు విడుదల: ఏప్రిల్ 21, 2023 మంచి ప్రయోగాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం హలో మీరా. ఇది సింగిల్ పాత్రతో రూపొందిన సైకిలాజికల్ డ్రామా చిత్రం. సింగిల్ పాత్రతో చిత్రం చేయడం అంటే కత్తి మీద సామే. ఇంతకు ముందు నటుడు పార్తీపన్ ఇదే తరహాలో రూపొందించిన ఒత్త చెరుప్పు చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు పలు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన వైవిధ్య భరిత కథా చిత్రం హలో మీరా. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైంది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. మీరా (గార్గేయి)కి అనే అమ్మాయికి రెండు రోజుల్లో పెళ్లి. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా.. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జాబ్ చేసే అమ్మాయి పెళ్లి కోసం తన ఫ్రెండ్స్ అందరూ వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు బయలుదేరుతారు. అప్పుడే టైలర్ దగ్గర కెళ్లి దుస్తులు కోసమని వెళ్లిన మీరాకు అప్పుడే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్‌తో ఆమె జీవితం అంతా తలక్రిందులవుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్న అమ్మాయికి వచ్చిన ఫోన్ కాల్ ఎవరిది? అవతలి వ్యక్తి ఏం మాట్లాడారు? అసలు తన పెళ్లి జరిగిందా? ఇంతకీ ఆ కాల్ ఎవరిదై ఉంటుంది? అనేది తెలియాలంటే 'హలో మీరా'ను చూడాల్సిందే. కథ ఎలా సాగిందంటే: ఒక సినిమా తీయాలంటే ఈ రోజుల్లో నటీనటులు ఎంతో కీలకం. ఎంతోమంది పాత్రలను తెరకెక్కించాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు శ్రీనివాస్. కానీ చిత్రంలో మనకు తెరపై కనిపించేది కేవలం ఒక్కరే మీరా (గార్గేయి ఎల్లాప్రగడ). ఆమె తన పాత్రలో చూపించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమాలో ఒక్క పాత్రే అయినా ప్రతి క్షణం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ కథ మొత్తంలో మిగతా వారి ఫోన్ సంభాషణలతోనే కథ ఆసక్తికరంగా సాగింది. కానీ ఈ కథ మొత్తంలో తెరపై కనిపించింది మాత్రం మీరానే. హలో మీరా చిత్రంలో తాను చూపించిన హావభావాలకు ఎవరైనా ఫిదా కాకుండా ఉండలేరు. మొత్తానికి సగటు సినీ ప్రేక్షకుడిని సింగిల్ క్యారెక్టర్‌తో మెప్పించడం దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ చేసింది పెద్ద సాహసమే అని చెప్పాలి. -
'గ్రంథాలయం' మూవీ రివ్యూ
టైటిల్: గ్రంథాలయం నటీనటులు: విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్, సోనియాచౌదరి, అలోక్‌జైన్, జ్యోతిరానా, కాశీశినాథ్, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు నిర్మాణ సంస్థ: వైష్ణవి శ్రీ క్రియేషన్స్ రచన- దర్శకత్వం : శివన్ జంపాన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అల్లంనేని అయ్యప్ప సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్ సంగీతం : వర్ధన్ ఎడిటర్ : శేఖర్‌పసుపులేటి విడుదల తేదీ: మార్చి 3, 2023 విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర జంటగా నటించిన చిత్రం 'గ్రంథాలయం.' కాలకేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 3 నథియేటర్లలో విడుదలైన సినిమా ప్రేక్షకులను ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. ఒక గ్రంథాలయంలో ఉన్న 1965 నాటి పుస్తకాన్ని అందరూ చదవలేరు. అయితే ఆ పుస్తకాన్ని మూడు రోజులు చదివిన తరువాత చదివిన వారందరూ చనిపోతుంటారు. ఆలా అప్పటి వరకు సుమారు 100 మంది ఆ బుక్ చదివి చనిపోయింటారు. అయితే హీరో రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), హీరోయిన్ ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) ప్రేమించుకుని ఉంటారు. అయితే అనుకోకుండా తను ఈ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్‌కు ఆ పుస్తకం మూడు రోజులు చదివిన తరువాత చనిపోతారనే విషయం తెలుసుకుని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది. ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు?. చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు? అనే విషయాన్ని తెలుసుకువాలని ఒకరోజు రాత్రి కెమెరా తీసుకొని రహస్యంగా గ్రంథాలయంలోకి ప్రేవేశిస్తాడు. ఆ తరువాత అక్కడ తనకు ఎదురైనా సంఘటనలు ఏంటీ? ఆ బుక్ చదివిన హీరోయిన్ చనిపోకుండా ఆపగలిగాడా లేదా అనేది తెలుసుకోవాలంటే గ్రంథాలయం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే.. శేఖరం అబ్బాయి సినిమా తర్వాత చేసిన హీరో విన్ను రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇందుమతి వాత్సల్య పాత్రలో నటించిన హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. విలన్‌గా నటించిన కాలకేయప్రభాకర్, అలాగే సోనియాచౌదరి, అలోక్‌జైన్, జ్యోతిరానా, కాశీ విశ్వనాథ్, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త వారి పాత్రలకు న్యాయం చేశారు. ప్రేక్షకులని ఆకట్టు కోనేలా సూపర్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు సాయి శివన్ జంపాన సక్సెస్ అయ్యాడు. సామలభాస్కర్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ మ్యూజిక్ బాగుంది. చిన్నా చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. శేఖర్‌పసుపులేటి ఎడిటింగ్ బాగుంది. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'రిచి గాడి పెళ్లి' మూవీ రివ్యూ
టైటిల్: రిచి గాడి పెళ్లి నటీనటులు: నవీన్ నేని, సత్య ఎస్కే, ప్రణీత పట్నాయక్, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ తదితరులు నిర్మాణ సంస్థ: కేఎస్ ఫిల్మ్ వర్క్స్ దర్శకత్వం: కేఎస్ హేమరాజ్ నిర్మాత: కేఎస్ హేమరాజ్ సంగీతం: సత్యన్ సినిమాటోగ్రఫీ: విజయ్ ఉళగనాథ్ ఎడిటర్: అరుణ్ ఇఎమ్ విడుదల తేదీ: మార్చి 3 2023 కేఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై కేఎస్ హేమరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రిచి గాడి పెళ్లి'. నవీన్ నేని, సత్య ఎస్కే, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా మార్చి 3, 2023న థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షో ప్రదర్శించారు. మరీ 'రిచి గాడి పెళ్లి' మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే: 'రిచి'(సత్య ఎస్కే), 'నేత్ర'(బన్నీవాక్స్) ఇద్దరు ప్రేమించుకుని విడిపోతారు. కొన్ని రోజుల తరువాత రిచి నుంచి తన 'ఫ్రెండ్స్' అందరికీ పెళ్లి కబురు వస్తుంది. దాంతో రిచి గ్యాంగ్ అంత 'ఊటీ'కి బయలుదేరతారు. అప్పటికే 'రిచి గ్యాంగ్'లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక 'వెలితి' ఉంటుంది. మరీ ఆ వెలితి ఈ రిచి గాడి పెళ్లి ద్వారా క్లియర్ అయిందా? ఊటీకి వెళ్లిన రిచి ఫ్రెండ్స్ వల్ల పెళ్లి ఎలాంటి మలుపులు తిరిగింది? 'నేత్ర, 'రిచి' మల్లి కలిశారా లేదా అన్నదే కథ. కథనం ఎలా సాగిందంటే: మానవ సంబంధాలను తెరపై చూపే కథే "రిచి గాడి పెళ్లి”. ఫ్రెండ్స్, కుటుంబాల నేపథ్యంలో సరదాగా సాగే మూవీ ఇది. సినిమా ప్రారంభంలోనే తన దైన మార్క్ చూపించాడు సినిమాటోగ్రాఫర్ . రిచి గాడి పెళ్లి కోసం బిజీ లైఫ్‌ను వదిలిపెట్టి ఫ్రెండ్స్ అందరు 'ఊటీ'కి బయలు దేరుతారు. లక్ష్మీపతి(సతీష్) సరదాగా సాగే ఒక "గేమ్ కాన్సెప్ట్" లోకి రిచి ఫ్రెండ్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎవ్వరికైతే కాల్ వస్తుందో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అందరి ముందు మాట్లాడాలి. అలా కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి వెనక ఏదో ఒక సీక్రెట్ దాగి ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ హేమరాజ్. ముఖ్యంగా నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సతీష్ క్యారెక్టర్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. తెర మీద బన్నీ వాక్స్, చందన రాజ్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే కథ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రాఫర్ ప్లస్. ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎవరెలా చేశారంటే.. సత్య ఎస్కే తన దైన శైలిలో లవర్ బాయ్‌లా నటించిన తీరు బాగుంది. ప్రణీత పట్నాయక్ తన పెర్ఫామెన్స్‌తో అదరకొట్టింది. బన్నీ వాక్స్ ఈ సినిమాలో కి రోల్ పోషించింది. నవీన్ నేని తన పాత్రకు న్యాయం చేశాడు. లక్ష్మీపతి (సతీష్)గా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సత్యన్ సంగీతం పర్వాలేదనిపించాడు. అరుణ్ ఇఎమ్ ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. రేటింగ్: 2.75 -
‘యశోద’ మూవీ పబ్లిక్ టాక్
-
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
విరాటపర్వం పబ్లిక్ టాక్
-
కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
-
‘రాధేశ్యామ్’మూవీ జెన్యూన్ రివ్యూ..
-
చల్లారని ‘మా’ రగడ.. ఎన్నికల అధికారికి లేఖ రాసిన ప్రకాశ్ రాజ్
MAA Elections 2021 Results: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పర్వం ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్‌రాజ్. పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు గురువారం లేఖ రాశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందన్నారు. అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని, ఇందుకోసం పోలింగ్ సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అంటూనే వాటిని కోరే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్ లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని తెలిపారు. -
Ichata Vahanamulu Nilupa Radu Review: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రివ్యూ
-
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇచ్చట వాహనములు నిలుపరాదు జానర్ : రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : సుశాంత్, మీనాక్షి చౌదరి,వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం తదితరులు నిర్మాణ సంస్థలు :ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ నిర్మాతలు : రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల దర్శకత్వం : ఎస్. దర్శన్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్ ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్ విడుదల తేది : ఆగస్ట్ 27,2021 టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం కాలం దాటింది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడనే చెప్పాలి. తొలి సినిమా కాళిదాసుతో పాటు కరెంట్, అడ్డా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా, సుశాంత్‌కు మాత్రం స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయాయి. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో.. ‘చిలసౌ’తో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు సుశాంత్ నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సుశాంత్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. హీరోగా చేసినా రాని గుర్తింపు ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడంతో ద్వారా వచ్చింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అక్కినేని హీరో.. తాజాగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. కరోనా వైరస్ కారణంగా దాదాపు పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సుశాంత్ అందుకున్నాడా? లేదా?, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన సుశాంత్‌ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారు? సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సుశాంత్‌కు మరో హిట్‌ని తనఖాతాలో వేసుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే హైదరాబాద్‌కు చెందిన అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్ట్. అతను పనిచేసే ఆఫీస్‌లోనే మీనాక్షి అలియాస్ మీను (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతుంది. తొలి చూపులోనే మీనాక్షితో ప్రేమలో పడిపోతాడు అరుణ్. ఆమె కోసం డ్రైవింగ్ నేర్చుకొని మరీ కొత్త బైక్‌ని కొంటాడు. ఒక రోజు మీనాక్షి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని, కొత్త బైక్ వేసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు అరుణ్. అదే సమయంలో ఆ ఏరియాలో ఓ సీరియల్ నటిపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఇది అరుణే చేశాడని భావించి ఆ ఏరియా జనాలంతా అరుణ్ కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారిని నుంచి అరుణ్ ఎలా తప్పించుకున్నాడు? అరుణ్‌ని కాపాడడం కోసం మీనాక్షి ఏం చేసింది? అసలు సీరియల్ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి(ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్(వెంకట్) ఎలా ఎంటర్ అయ్యాడు? ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే టైటిల్‌కి ఈ కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? అరుణ్ పాత్రలో సుశాంత్ అద్భుత నటనను ప్రదర్శించాడు. డాన్స్‌తో పాటు ఫైటింగ్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. గత తన సినిమాల్లో కంటే ఇందులో సుశాంత్ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. ఇక మీను పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్ పర్వాలేదనించాడు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి అద్భుత నటనను కనబర్చాడు. బైక్ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్ తనదైన కామెడితో నవ్వించే ప్రయత్నం చేశాడు.అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే కొత్త టైటిల్ పెట్టి సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు దర్శన్.. కథనంలో మాత్రం కొత్తదనం లేకుండా, సాదాసీదాగా నడిపించాడు. కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో కొన్ని అనవసరపు సీన్స్‌ని అతికించి అతి కష్టం మీద రెండున్నర గంటల పాటు సినిమాను లాగాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సస్పెన్స్‌ని ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక సెకండాఫ్‌లో అయినా ఆకట్టుకునే అంశాలేమైనా ఉంటాయకునే ప్రేక్షకుడికి అక్కడా నిరాశే ఎదురవుతుంది. సినిమాలో చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. కానీ, నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్న దర్శకుడి ఆలోచనను ప్రశంసించాల్సిందే. ఇక ఈ సినిమా ప్రధాన బలం ఏదైనా ఉందంటే అని ప్రవీణ్ లక్కరాజు సంగీతమనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ చాలా చోట్ల తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ
టైటిల్ : జాతి రత్నాలు జానర్: కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ : స్వప్న సినిమాస్ నిర్మాతలు : నాగ్ అశ్విన్ దర్శకత్వం : అనుదీప్ సంగీతం : రథన్ సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్ కెమెరా ఎడిటింగ్ : అభినవ్ రెడ్డి దండ విడుదల తేది : మార్చి 11, 2021 కొన్ని సినిమాలపై విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమానే ‘జాతి రత్నాలు’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దానిపై చర్చ మొదలయింది. టైటిల్ డిఫరెంట్‌గా ఉండడం, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించడంతో ‘జాతి రత్నాలు’మూవీపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సూపర్ హిట్ కావడంతో ఆ అంచనాలు తారాస్థాయికి పెరిగాయి. ఇక ప్రొమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసారు. ఇన్ని అంచనాల మధ్య మహాశివరాత్రి కానుకగా గురువారం(మర్చి 11)న విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) మెదక్ జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు. అతనికి ఇద్దరు స్నేహితులు రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి). ఈ ముగ్గురు అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వీరంటే ఊళ్లో వాళ్లకి చిరాకు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియంలో శ్రీకాంత్ పని చేయడంతో అతన్ని అందరూ‘లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్’అని పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తానని బ్యాగు సర్దుకొని సిటీకి బయలుదేరుతాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ శ్రీకాంత్ చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. కట్‌చేస్తే.. ఈ ముగ్గురు అనుకోకుండా ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతారు. అసలు ఆ హత్య కేసుకి, ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి ముగ్గురు ఎలా తప్పించుకున్నారు? అనేదే మిగతా కథ. నటీనటులు ఈ సినిమా మొత్తం నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రల చుట్టే తిరుగుతంది. అమాకత్వం గల శ్రీకాంత్ పాత్రలో నవీన్ ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించి మెప్పించాడు. ఇక ప్రియదర్శి, రామకృష్ణ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా చిట్టి పాత్రలో క్యూట్‌గా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమదైన కామెడీ పంచ్‌లతో నవ్వించారు. విశ్లేషణ అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' అలాంటి చిత్రమే. ముగ్గురు అమాయకులు.. ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కొచ్చి సన్నివేశాల్లో కామెడీ మరీ ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే కేసు విచారణను డీల్ చేసిన విధానం కూడా అంత కన్విన్స్‌గా అనిపించదు. ఎక్కడో లాజిక్స్ మిస్సయ్యారనే భావన కలుగుతుంది. అలాగే సెకండాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాప్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, పంచ్ డైలాగ్స్మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే కోర్టు సీన్ అయితే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మరో జాతి రత్నం సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటర్ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నవీన్, రాహుల్, ప్రియదర్శి నటన అశ్లీలం లేని కామెడీ రథన్ సంగీతం మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు -
'శ్రీకారం' మూవీ రివ్యూ
టైటిల్ : శ్రీకారం నటీనటులు : శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, సాయికుమార్, మురళీ శర్మ, రావు రమేశ్ తదిరులు నిర్మాణ సంస్థ : 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీ ఆచంట దర్శకత్వం : బి.కిశోర్ సంగీతం : మిక్కీ జె. మేయర్ సినిమాటోగ్రఫీ : జే యువరాజ్ ఎడిటింగ్ : మార్తండ్ కె వెంకటేశ్ విడుదల తేది : మార్చి 11, 2021 'జాను' సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. "కావాల్సినంత ప్రేమ.. సరిపోయే సెంటిమెంట్.. అల్లరి చేసే ఫ్రెండ్స్.. ఏడిపించే నాన్న.. నవ్వించే విలన్.. అందమైన అమ్మాయి.. అన్నం పెట్టే భూమి.. దీని చుట్టూ తిరిగే హీరో కారెక్టర్.. ఇదే శ్రీకారం కథ" అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కథ, కాన్సెప్ట్ పూర్తిగా రివీల్ చేశాడు శర్వానంద్. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా నేడు(మార్చి 11)న రిలీజైంది. దీనికి పోటీగా మరో రెండు, మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇటీవల రైతు కథాంశం మీద వచ్చిన సినిమాలు తక్కువే. చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కర్షకుల చిత్రం ఎలా ఉంది? రైతు బిడ్డగా శర్వానంద్ ఏ మేరకు మెప్పించాడు? అన్న అంశాలను రివ్యూలో తెలుసుకుందాం... కథ: అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్ మోహన్) ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే మిగతా కథ. నటీనటులు విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే శర్వానంద్ ఈ సినిమాలోనూ నటనతో మెప్పించాడు. కంప్యూటర్ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్వేర్ పొలంలోకి దిగుతే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తిక్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. తనకు ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా చక్కగా పండించాడు. కథనంతా తన భూజాన వేసుకొని నడిపించాడు. తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్ మోహన్ మెప్పించింది.ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ది. నిరుపేద రైతు కేశవులు పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. ఇక మంచితనం ముసుగు కప్పుకొని జనాన్ని మోసం చేసే ఏకాంబరం పాత్రలో సాయి కుమార్ పర్వాలేదనిపించారు. హీరో తల్లిగా ఆమని ఆకట్టుకుంది. నరేశ్, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్. కష్టంపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. దానికి తోడు స్లో నెరేషన్ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్. ‘ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు’, ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు’లాంటి సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. అలాగే ‘పనిని పట్టి పరువు.. పరువుని పట్టి పలకరింపు’, ‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’అనే డైలాగ్స్ యువతను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ఎడిటర్ మార్తండ్ కె వెంకటేశ్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. b ప్లస్ పాయింట్స్ శర్వానంద్ నటన సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ స్లో నేరేషన్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘షాదీ ముబారక్’ మూవీ రివ్యూ
టైటిల్ : షాదీ ముబారక్ నటీనటులు : సాగర్, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు దర్శకత్వం : పద్మశ్రీ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫి : శ్రీకాంత్ నరోజ్ ఎడిటింగ్ : మధు చింతల విడుదల తేది : మార్చి 5, 2021 బుల్లితెరపై ఆర్కే నాయుడుగా నటించి కుటుంబ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేం సాగర్. గతంలో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో వెండితెరపై తళుక్కుమన్న అతడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘షాదీ ముబారక్’. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా, పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఆకట్టకునే టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ట్రైలర్‌పై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతోమంచి అంచనాలే ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? హీరోగా సాగర్ ఎంత వరకు సక్సెస్ అయ్యాడు? అన్న అంశాలు రివ్యూలో గమనిద్దాం. కథ మాధవ్ (సాగర్) ఫారిన్లో ఉంటాడు. ఆస్ట్రేలియాలో నివసించే అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ, మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్ చూడల్సిందే. నటీనటులు బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్లో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న సాగర్..మంచి కథతో హీరో అయ్యాడు.మాధవ్ పాత్రలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై బాగా కనిపించడమే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడు. ఇక హీరోయిన్ దృశ్య రఘునాథ్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.రాహుల్ రామకృష్ణ, హేమంత్, భద్రం తమదైన కామెడీతో నవ్వించారు. హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ దర్శకుడు పద్మశ్రీకి తొలి సినిమా ఇది. కానీ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుగా కథను తెరకెక్కించాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో ఓ అందమైన కథను ప్రేక్షకులకు అందించాడు. యువతను అకర్షించే అంశాలైన రొమాన్స్, కామెడీని తన కథలో మిస్ కాకుండా చూసుకున్నాడు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సింపుల్ కథని చక్కగా తెరపై చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సునీల్ కశ్యప్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మధు చింతల ఎడిటింగ్, శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏ1 ఎక్స్ ప్రెస్ జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను సంగీతం : హిప్ హాప్ తమిళ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్ విడుదల తేది : మార్చి 05, 2021 టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ కొద్ది కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలం తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో, ఆతర్వాత తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ చవిచూశాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ట్రై చేయడం, సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఆడియో కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకు ఎంత వరకు తోడైంది? సందీప్ కిషన్ కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ యానాం షాట్స్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌కి ఒక చరిత్ర ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. హాకీ కోచ్ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్ అంటే కోచ్ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్(రావు రమేశ్)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్ ఫర్ఫార్మింగ్ లిస్ట్‌లో వేస్తాడు. మరోవైపు.. నేషనల్ లెవల్ టోర్నమెంట్ గెలిస్తే.. తమ గ్రౌండ్ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళి.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కట్ చేస్తే... హైదరాబాద్ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్(సందీప్ కిషన్) తొలి చూపులోనే హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్ విని షాకవుతారు. అసలు సందీప్ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్ మరళికి సందీప్ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. నటీనటులు నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం సందీప్ కిషన్ పడ్డ కష్టం ప్రతీ సీన్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా సందీప్ కిషన్ అవలీలగా నటించేశాడు. ఇక హాకీ క్రీడాకారిణిగా త్రిపాఠి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. టామ్ బాయ్ రోల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది. ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారో కళ్లకుగట్టారు. హీరో స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఆకట్టుకున్నారురు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఇటీవల విడుదలయిన ‘చెక్’ సినిమా కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిందే. అయితే ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే.. హాకీ క్రీడా నేపథ్యంలో సౌత్ ఇండియాలోనే వచ్చిన మొదటి సినిమా ఇది. తొలి సినిమాతోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ నుంచి అసలు కథని చూపించాడు. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. హీరో ప్లాష్‌బ్యాక్‌లో వచ్చిన సీన్లలో నాటకీయత ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హీరో స్నేహితులులు హాకీ జట్టుకు ఎంపికకాకపోవడానికి చూపించిన కారణాలు కూడా అంత కన్విన్స్‌గా అనిపించవు. గేమ్ కంటే లోకల్ పాలిటిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన భావన కలుగుతుంది. ఇక ప్రత్యర్థి హాకీ టీం కోచ్ రోల్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండదు. అతని స్థానంలో ఒక ఫేమస్ నటుడిని తీసుకొని ఉంటే రెండు టీమ్స్ మధ్య జరిగే పోటీ సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండేవి. అయితే, సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ మర్చిపోయి హాకీ ఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న భావన కలుగుతుంది. ఇక సినిమాకు ప్రధాన బలం హిప్ హాప్ తమిళ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకుడికి ఉత్కంఠను పెంచుతాడు. కెవిన్ రాజ్ సినిమటోగ్రాఫి బాగుంది. గ్రౌండ్ విజివల్స్ సినిమాకే హైలెట్. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ సంగీతం సినిమా చివరి 20 నిమిషాలు మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్ రొటీన్ స్టోరీ ప్రత్యర్థి హాకీ టీం కోచ్ బలంగా లేకపోవడం - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
ఇస్మార్ట్ సినిమాలపై ఓ లుక్కేద్దాం