టైటిల్: ఆరంభం
నటీనటులు: మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్‌కల్యాణ్, రవీంద్రవిజయ్ తదితరులు
దర్శకత్వం: అజయ్ నాగ్ వి
నిర్మాత: అభిషేక్ వీటీ
సంగీతం: సింజిత్ యర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: దేవ్‌దీప్ గాంధీ కుందు
విడుదల తేదీ: మే 13, 2024
మోహన్‌భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్‌కల్యాణ్, రవీంద్రవిజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం. అజయ్ నాగ్ దర్శకత్వంలో.. అభిషేక్ వీటీ నిర్మించారు. విందు భోజనం, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అజయ్ నాగ్ వి సరికొత్త కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చిన ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
కథ జైలు బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. ఖైదీలు, జైలు సీన్స్‌తో రోటీన్‌గా ప్రారంభించాడు. అయితే జైలు నుంచి మోహన్ భగత్(మిగిల్) ఖైదీ తప్పించుకుంటాడు. ఉరి శిక్ష ఎదుర్కొవాల్సిన మోహన్ భగత్(మిగిల్) ఊహించని విధంగా జైలు నుంచి తప్పించుకుంటాడు. అతను ఎలా తప్పించుకున్నాడో కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్రవిజయ్) రంగంలోకి దిగుతారు. అసలు అంత భద్రత ఉన్న జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అతనికి ఎవరైనా సాయం చేశారా? నాలుగు గోడల మధ్య నుంచి ఎలా మాయమయ్యాడు? అనేది తెలియాలంటే ఆరంభం చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
విందు భోజనం, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అజయ్ నాగ్ వి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఫస్ట్ హాఫ్‌లోనే మొదటి అధ్యాయం 'ముగింపు' అంటూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచారు. జైలు సీన్స్, డిటెక్టివ్ రవీంద్రవిజయ్ ఇంటరాగేషన్ సీన్స్‌తో సీరియస్‌తో పాటు హాస్యభరితంగా అనిపిస్తాయి. మిగిల్ (మోహన్ భగత్), సుబ్రమణ్యరావు(భూషణ్ కల్యాణ్)కు చిన్నప్పుడే పరిచయం కావడం.. వారి మధ్య ఎమోషనల్ సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. మిగిల్, సురభి ప్రభావతి(లీలమ్మ) మధ్య సన్నివేశాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. కథ చాలా నెమ్మదిగా సాగినప్పటికీ.. తెరపై సీన్స్ మాత్రం చాలా సహజంగా చూపించాడు. మిగిల్, సుబ్రమణ్యరావు కలిసి ఓ సైంటిఫిక్ ప్రాజెక్ట్ కోసం పని చేస్తుంటారు. ఆ తర్వాత వీరి మధ్యలోకి శారద(సుప్రిత ) ఎంట్రీ ఇస్తుంది. శారద, సుబ్రమణ్యరావు(భూషణ్ కల్యాణ్)ను కలిశాక ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. వీరిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలంటే ఆరంభం సినిమా తెరపై చూడాల్సిందే.
అయితే సెకండాఫ్‌లో కథ మొత్తం సుబ్రమణ్యరావు చేపట్టిన మిషన్ చుట్టే తిరుగుతుంది. మిగిల్, శారద.. సుబ్రమణ్యరావు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం పని చేస్తుంటారు. అసలు ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటనేది తెలియకుండా ఆడియన్స్‌లో సస్పెన్ష్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఊహించని సంఘటనలతో మిగిల్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కథలో అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టించినా.. చాలా సన్నివేశాల్లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఒకవైపు సైన్స్‌ను చూపిస్తూ.. మరోవైపు ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అయితే చివరికీ సుబ్రమణ్యరావు చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? అసలు జైలు నుంచి తప్పించుకున్న మిగిల్ దొరికాడా? దేనికోసం ఆ ప్రాజెక్ట్ చేపట్టారు? ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న మిగిల్, జైలు నుంచి తప్పించుకున్న మిగిల్ ఒక్కరేనా? లేదా ఇద్దరా? జైలు నుంచి పరారైన మిగిల్‌ను డిటెక్టివ్ (రవీంద్రవిజయ్)కనిపెట్టాడా? అనే విషయాలు తెలియాలంటే ఆరంభం చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
కేరాఫ్ కంచెర్ల పాలెంలో గడ్డం క్యారెక్టర్‌తో మెప్పించిన మోహన్ భగత్ లీడ్ రోల్‌లో మెప్పించాడు. తన నటన, హావభావాలతో అదరగొట్టేశాడు. సుప్రిత సత్యనారాయణ్ తన పాత్రలో ఒదిగిపోయారు. రవీంద్రవిజయ్ డిటెక్టివ్ పాత్రలో మెప్పించారు. భూషణ్‌కల్యాణ్, లక్ష్మణ్ మీసాల,సురభి ప్రభావతి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే దేవ్‌దీప్ గాంధీ సినిమాటోగ్రఫీ బాగుంది. సింజిత్ యర్రమిల్లి నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment