#RC16: జాన్వీ బర్త్‌డే స్పెషల్‌.. లుక్‌ అదిరిందిగా! | Ram Charan Sweet Birthday Wishes to Janhvi Kapoor | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: రామ్‌చరణ్‌ కొత్త సినిమా.. జాన్వీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Published Thu, Mar 6 2025 3:11 PM | Last Updated on Thu, Mar 6 2025 3:46 PM

Ram Charan Sweet Birthday Wishes to Janhvi Kapoor

దివంగత నటి శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) దేవర సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. తంగంగా తన మాటలు, యాక్టింగ్‌తో అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్‌చరణ్‌తో కలిసి #RC16 మూవీలో నటిస్తోంది. నేడు (మార్చి 6) జాన్వీ కపూర్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా RC16 చిత్రబృందం జాన్వీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో జాన్వీ గొర్రెలమంద ముందు నిల్చుంది. 

కుడిచేత్తో పొట్టేలు పిల్లను చేతిలో పెట్టుకుని మరో చేత్తో గడ్డిపోచలు పట్టుకుంది. ఈ పోస్టర్‌ను చరణ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. హ్యాపీ బర్త్‌డే జాన్వీ కపూర్‌. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ విజయాలను అందుకోవాలి అని ఆకాక్షించారు. జాన్వీ లుక్‌ చూసిన జనాలు బాగుందని కామెంట్లు చేస్తున్నారు. బుచ్చిబాబు, చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. శివరాజ్‌కుమార్‌ ముఖ్యపాత్రలో మెరవనున్నారు.

 

 

చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్‌ రికార్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement