టైటిల్: గ్రంథాలయం
నటీనటులు: విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్, సోనియాచౌదరి, అలోక్‌జైన్, జ్యోతిరానా, కాశీశినాథ్, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు
నిర్మాణ సంస్థ: వైష్ణవి శ్రీ క్రియేషన్స్
రచన- దర్శకత్వం : శివన్ జంపాన
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అల్లంనేని అయ్యప్ప
సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్
సంగీతం : వర్ధన్
ఎడిటర్ : శేఖర్‌పసుపులేటి
విడుదల తేదీ: మార్చి 3, 2023
విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర జంటగా నటించిన చిత్రం 'గ్రంథాలయం.' కాలకేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 3 నథియేటర్లలో విడుదలైన సినిమా ప్రేక్షకులను ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
ఒక గ్రంథాలయంలో ఉన్న 1965 నాటి పుస్తకాన్ని అందరూ చదవలేరు. అయితే ఆ పుస్తకాన్ని మూడు రోజులు చదివిన తరువాత చదివిన వారందరూ చనిపోతుంటారు. ఆలా అప్పటి వరకు సుమారు 100 మంది ఆ బుక్ చదివి చనిపోయింటారు. అయితే హీరో రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), హీరోయిన్ ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) ప్రేమించుకుని ఉంటారు. అయితే అనుకోకుండా తను ఈ బుక్ చదవడం మొదలు పెడుతుంది.
అయితే రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్‌కు ఆ పుస్తకం మూడు రోజులు చదివిన తరువాత చనిపోతారనే విషయం తెలుసుకుని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది. ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు?. చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు? అనే విషయాన్ని తెలుసుకువాలని ఒకరోజు రాత్రి కెమెరా తీసుకొని రహస్యంగా గ్రంథాలయంలోకి ప్రేవేశిస్తాడు. ఆ తరువాత అక్కడ తనకు ఎదురైనా సంఘటనలు ఏంటీ? ఆ బుక్ చదివిన హీరోయిన్ చనిపోకుండా ఆపగలిగాడా లేదా అనేది తెలుసుకోవాలంటే గ్రంథాలయం సినిమా చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే..
శేఖరం అబ్బాయి సినిమా తర్వాత చేసిన హీరో విన్ను రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇందుమతి వాత్సల్య పాత్రలో నటించిన హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. విలన్‌గా నటించిన కాలకేయప్రభాకర్, అలాగే సోనియాచౌదరి, అలోక్‌జైన్, జ్యోతిరానా, కాశీ విశ్వనాథ్, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త వారి పాత్రలకు న్యాయం చేశారు. ప్రేక్షకులని ఆకట్టు కోనేలా సూపర్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు సాయి శివన్ జంపాన సక్సెస్ అయ్యాడు. సామలభాస్కర్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ మ్యూజిక్ బాగుంది. చిన్నా చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. శేఖర్‌పసుపులేటి ఎడిటింగ్ బాగుంది. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment