నటీనటులు: గార్గేయి ఎల్లాప్రగడ
దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల
నిర్మాణ సంస్థ: లూమియర్ సినిమా
నిర్మాతలు: డాక్టర్ లక్ష్మణరావు దిక్కుల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
సంగీత: ఎస్.చిన్న
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడు
విడుదల: ఏప్రిల్ 21, 2023
మంచి ప్రయోగాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం హలో మీరా. ఇది సింగిల్ పాత్రతో రూపొందిన సైకిలాజికల్ డ్రామా చిత్రం. సింగిల్ పాత్రతో చిత్రం చేయడం అంటే కత్తి మీద సామే. ఇంతకు ముందు నటుడు పార్తీపన్ ఇదే తరహాలో రూపొందించిన ఒత్త చెరుప్పు చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు పలు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన వైవిధ్య భరిత కథా చిత్రం హలో మీరా. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైంది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
మీరా (గార్గేయి)కి అనే అమ్మాయికి రెండు రోజుల్లో పెళ్లి. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా.. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జాబ్ చేసే అమ్మాయి పెళ్లి కోసం తన ఫ్రెండ్స్ అందరూ వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు బయలుదేరుతారు. అప్పుడే టైలర్ దగ్గర కెళ్లి దుస్తులు కోసమని వెళ్లిన మీరాకు అప్పుడే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్‌తో ఆమె జీవితం అంతా తలక్రిందులవుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్న అమ్మాయికి వచ్చిన ఫోన్ కాల్ ఎవరిది? అవతలి వ్యక్తి ఏం మాట్లాడారు? అసలు తన పెళ్లి జరిగిందా? ఇంతకీ ఆ కాల్ ఎవరిదై ఉంటుంది? అనేది తెలియాలంటే 'హలో మీరా'ను చూడాల్సిందే.
కథ ఎలా సాగిందంటే:
ఒక సినిమా తీయాలంటే ఈ రోజుల్లో నటీనటులు ఎంతో కీలకం. ఎంతోమంది పాత్రలను తెరకెక్కించాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు శ్రీనివాస్. కానీ చిత్రంలో మనకు తెరపై కనిపించేది కేవలం ఒక్కరే మీరా (గార్గేయి ఎల్లాప్రగడ). ఆమె తన పాత్రలో చూపించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
సినిమాలో ఒక్క పాత్రే అయినా ప్రతి క్షణం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ కథ మొత్తంలో మిగతా వారి ఫోన్ సంభాషణలతోనే కథ ఆసక్తికరంగా సాగింది. కానీ ఈ కథ మొత్తంలో తెరపై కనిపించింది మాత్రం మీరానే. హలో మీరా చిత్రంలో తాను చూపించిన హావభావాలకు ఎవరైనా ఫిదా కాకుండా ఉండలేరు. మొత్తానికి సగటు సినీ ప్రేక్షకుడిని సింగిల్ క్యారెక్టర్‌తో మెప్పించడం దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ చేసింది పెద్ద సాహసమే అని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment