పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: లక్ష్మీపతి బాలాజీ (క్రికెటర్), రక్షందా ఖాన్ (నటి)
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడయిన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తితోపాటు వ్యాపారాలు చేయాలనుకునే వారు వారి అభీష్టానుసారం కొత్తవ్యాపారాలు చే యడం లేదా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. పుట్టిన రోజు 27. ఇది కుజసంఖ్య కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది.
ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మీకున్న ఉద్యోగ, వ్యాపార సంబంధాల ద్వారా మంచి ఆదాయం చేకూరుతుంది. అయితే సహజసిద్ధంగా ఉండే జంకును, భ యాన్ని విడిచిపెట్టి, ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకోవడం వల్ల బాగా రాణిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, కోపం మూలంగా బీపీ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండి వైద్యసలహాలు తీసుకోవడం మంచిది.
లక్కీ నంబర్స్: 3, 5,6,9; లక్కీ కలర్స్: రెడ్, ఆరంజ్, బ్లూ, ఎల్లో. లక్కీ డేస్: ఆది, మంగళ, శనివారాలు. సూచనలు: ఆస్తులు అమ్మే ఆలోచన విరమించుకోవడం మంచిది. వికలాంగులకు అన్నదానం, మూగచెవిటి వారికి తగిన సాయం చేయడం, రక్తదానం చేయడం లేదా చేయడాన్ని ప్రోత్సహించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్