అక్టోబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: గుణ్ణం గంగరాజు (దర్శక-నిర్మాత), సన్నీడియోల్ (నటుడు)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించి, దానిని ముందకు తీసుకు వెళ్లే చొరవ, తెగువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, పిల్లలకు ఉద్యోగ, వివాహ ప్రాప్తి జరుగుతుంది. ట్రాన్స్‌ఫర్లకోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫరవుతుంది.
కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూల సమయం. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. హృద్రోగాలు, నేత్రరోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తగిన సాయం చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్