పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Birthday celebration Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Sat, Sep 19 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మహేష్ భట్ (దర్శక, నిర్మాత) సౌందర్య  (నిర్మాత - రజనీకాంత్ కుమార్తె)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవి సంఖ్య కావడం వల్ల కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త టెక్నాలజీ తెలుసుకుంటారు. మీ టెక్నాలజీని మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉపయోగించి, లాభపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటమే కాదు, వాటిని మీ ఉన్నతికి ఉపయోగించుకోగలుగుతారు.

అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పుట్టిన తేదీ 20. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలవుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, మానసిక ఆందోళన తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,7; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు, క్రీమ్, బ్రౌన్; లక్కీ కలర్స్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: అనాథలకు బెల్లం పాయసం తినిపించటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం లేదా వినడం, వీలైనంత సేపు వెన్నెలలో విహరించడం, తల్లిని లేదా తత్సమానురాలిని ఆదరించడం మంచిది.
 
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement