అక్టోబర్ 18న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఓం పురి (నటుడు), జ్యోతిక (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంబంధమైనది. ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కూడా కుజసంబంధమైనదే కాబట్టి కుజుని ప్రభావం వల్ల వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి ఉండటం వల్ల యూనిఫారం ధరించే ఉద్యోగాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 9 అనేది సంపూర్ణతకి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపించాలనే కోరిక తీరుతుంది.
రియల్ ఎస్టేట్‌లోనూ, మైన్స్, భూమికి సంబంధించిన వ్యవహారాలలోనూ విజయం సాధిస్తారు. వాహనాలు కొంటారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. దూకుడుగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల సహోద్యోగులతోనూ, తోటివారితోనూ వివాదాలు తలెత్తవచ్చు. లక్కీ డేస్: 1,3,6,9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: ఆది, మంగళ, శుక్రవారాలు? సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించడం, దుర్గాదేవి ఆలయాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేయించుకోవడం, మతగ్రంథాల పఠన, వికలాంగులను ఆదరించడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్