హ్యాపీ బర్త్ డే | Happy Birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్ డే

Sep 16 2015 4:13 AM | Updated on Sep 3 2017 9:27 AM

హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
మీనా (నటి), ప్రసూన్ జోషీ (రచయిత)

 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి.     టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచిమార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

వీరు 16వ తేదీన పుట్టినందువల్ల వీరిపై కేతు ప్రభావం ఉంటుంది. కేతువు మోక్ష కారకుడు కాబట్టి వీరికి ప్రాపంచిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ కలుగుతుంది. కేతుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం.  

 లక్కీ నంబర్లు: 2,6,7,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, లైట్ బ్లూ, సిల్వర్. లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్ర వారాలు.
 సూచనలు: డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. శుక్రజపం, భృగుపాశుపత హోమం, గణపతి ఆరాధన, కన్నెపిల్లల వివాహానికి సాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement