Prasoon Joshi
-
సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్‌బీ
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పటి నుంచి బిగ్‌బీ తరచూ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన రచనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి ‘అకెలెపాన్ కా బాల్’ అనే కవితను షేర్ చేస్తూ అది తన తండ్రి రాసినట్లుగా చెప్పారు. కానీ అది గేయ రచయిత ప్రసూన్ జోషీ రాశారు. వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకున్న బిగ్‌బీ గురువారం క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు. ‘సరిదిద్దుకున్నా: నిన్న నేను పంచుకున్న పద్యం మా నాన్న హరివంశ్ రాయ్ బచ్చన్ రాసినది కాదు. అది ప్రసూన్ జోషి రాసినది. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు. బిగ్ బీ తండ్రి హరివంశ్ బచ్చన్ ప్రసిద్ద సాహిత్య కవి. (చదవండి: నాపై గౌరవం పోయినా సరే, నేను ఇంతే) CORRECTION : कल T 3617 pe जो कविता छपी थी , उसके लेखक , बाबूजी नहीं हैं । वो ग़लत था । उसकी रचना , कवि प्रसून जोशी ने की है । इसके लिए मैं क्षमा प्रार्थी हूँ । 🙏🙏 उनकी कविता ये है - pic.twitter.com/hZwgRq32U9 — Amitabh Bachchan (@SrBachchan) August 6, 2020 ఆయన రాసిన సాహిత్య రచనలైన ‘అగ్నిపత్’, ‘అలాప్’, ‘సిల్సిలా’ పేరుతో వచ్చిన సినిమాల్లో అమితాబ్ నటించాడు. ప్రసూన్ జోషీ కవి, గేయ రచయిత, స్క్రీన్ రైటర్ కూడా. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తారే జమీన్ పర్’, ‘చిట్టాగ్యాంగ్’, ‘ఢిల్లీ 6’ సినిమాలకు కథను అందించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చీఫ్‌గా ఉన్నారు.ఇటీవల బిగ్‌బీ, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, మనవరాలు అరాధ్య బచ్చన్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో మొదట ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు కోలుకోగా బిగ్‌బీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అభిషేక్ మాత్రం ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడు. (చదవండి: నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్) -
‘ఇది మన సమాజం ఆలోచన తీరు’
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘రాస్భరి’. అయితే దీనిలోని ఓ సన్నివేశం పట్ల సినీ గేయ రచయిత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చీఫ్ ప్రసూన్ జోషి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగి ఉన్న పురుషుల ముందు ఓ చిన్న అమ్మాయి వారిని రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేస్తుందని.. పిల్లలను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం అవసరమా అని ప్రసూన్ జోషి ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘రాస్భరి’ టీమ్‌తో పాటు దీనిలో ప్రధాన పాత్రలో నటించిన స్వరా భాస్కర్‌ను ఉద్దేశిస్తూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు. ‘‘రాస్భరి’ వెబ్‌సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను చూస్తే చాలా విచారం కలిగింది. ‘రాస్భరి’ టీం ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతాలా లేక దోపిడీ స్వేచ్ఛకు ఉదాహరణలా’ అనే దాని గురించి ప్రేక్షకులు, మేధావులు ఆలోచించుకోవాలి. వినోదం కోసం చిన్నారులను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు. (బరువు పెరుగుతున్నా!) Saddened byWebseries #Rasbhari’s irresponsible content portraying alittle girl child dancing provocatively in frontof men drinking.Creators& audience need 2seriously rethink Freedomof expression or freedom of exploitation?Let’s spare children in thedesperate need4 entertainment. — Prasoon Joshi (@prasoonjoshi_) June 26, 2020 దీనిపై స్వరా భాస్కర్ స్పందించారు. ‘బహూశా ఈ సీన్ అపార్థానికి దారి తీస్తుందేమో. కానీ ఈ సన్నివేశం మీరు ఊహించిన దానికి పూర్తిగా భిన్నం. ఆ పాన తన ఇష్టానుసారం డ్యాన్స్ చేస్తుంది. అది చూసి ఆమె తండ్రి సిగ్గుపడతాడు. అంతే తప్ప ఇక్కడ ఆ చిన్నారి డ్యాన్స్ ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశంతో తీయలేదు. సమాజం తనను కూడా లైంగిక దృష్టితో చూస్తుందనే విషయం పాపం తనకు తెలియదు. ఇది మన సమాజపు ఆలోచన తీరు’ అంటూ ఘాటుగా స్పందించారు స్వరా భాస్కర్. వెబ్‌సిరీస్‌లో ఈ సన్నివేశం స్వరా చిన్నప్పటి వెర్షన్లో వస్తుంది. ఓ స్టూండెట్ తన టీచర్ వెంటపడే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌పై ఇప్పటికే చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. (అమ్మా తప్పు చేశానా?) -
సీబీఎఫ్సీ కార్యాలయాలు మూసివేత
కోవిడ్ 19 (కరోనావైరస్) ప్రభావంతో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రసూన్ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశం ఇలా.... ‘‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు సంబంధించిన మా క్లయింట్స్, ప్యానెల్ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, మిగతా సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని తొమ్మిది సీబీఎఫ్సీ కార్యాలయాలను మూసివేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో ఇకపై సినిమాలు స్క్రీనింగ్ కావు. కరోనా ప్రభావం తగ్గగానే తిరిగి మా సేవలను ప్రారంభిస్తాం. సందేహాలకోసం ఆయా కార్యాలయాల్లో హెల్ప్‌లైన్ నెంబర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనున్నారు. తద్వారా ఆన్ లైన్ అప్లికేషన్స్, ఫిల్మ్ అప్లికేషన్స్ వంటి వాటిని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మనందరి సమిష్టి పోరాటంతో ఈ విపత్కర పరిస్థితుల నుంచి త్వరలోనే బయట పడతామనే నమ్మకం నాకు ఉంది’’ అని జోషి పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. -
‘సంజు’పై ఫిర్యాదు; ఇండియా పరువేంగాను?
న్యూఢిల్లీ: రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాపై ఫిర్యాదు నమోదైంది. ‘సంజు’ ట్రైలర్లో చూపించిన ‘జైలు టాయిలెట్ లీకేజీ సీన్ల’ను తక్షణమే తొలగించాలని, లేకుంటే సినిమా విడుదలపై స్టే కోరుతూ కోర్టుకు వెళతామని ఫృథ్వీ మస్కే అనే స్వచ్ఛంద కార్యకర్త.. సెన్సార్ బోర్డును హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషికి ఫిర్యాదును అందజేశారు. ఇండియా పరువేంగాను?: ‘‘సంజు సినిమా ట్రైలర్లో టాయిలెట్ లీకేజీ సీన్ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సీన్ వల్ల ఇండియాలోని జైళ్ల నిర్వహణ, అధికారుల పనితీరుపై ప్రపంచానికి తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో జైల్ సీన్లు ఉన్నప్పటికీ, ఇలా టాయిలెట్ లీకేజీని చూపించిన దాఖలాలు లేవు. వాస్తవానికి అలాంటి సంఘటనేదీ జరిగినట్లు ఎక్కడా నమోదుకాలేదు’’ అని ఫృథ్వీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు సీన్‌పై సెన్సార్ బోర్డు స్పందించకుంటే, సినిమా విడుదల నిలిపేసేలా కోర్టుకు వెళతానని తెలిపారు. కాగా, ఈ ఫిర్యాదుపై సీబీఎఫ్సీ స్పందన ఇంకా వెలువడాల్సిఉంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న ‘సంజు’ విడుదలకానుంది. సంజు ట్రైలర్ -
పద్మావతి కాదు.. పద్మావత్
శనివారం ‘పద్మావతి’ సెన్సార్ కండీషన్ల గురించి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ..సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి స్పందించారు. ‘‘ పద్మావతి సినిమా పై సెన్సార్ బృందం 26 కట్స్‌ను విధించింది అన్న వార్తలు అవాస్తవం. మేము ఎటువంటి కట్స్ చెప్పలేదు. కేవలం 5 మార్పులు మాత్రమే చెప్పాం’’ అని అన్నారు. ‘తి’ కాదు.. ‘త్’.. అవును ఇక ‘పద్మావతి’ కాదు.. ‘పద్మావత్’. అదేంటీ? ఎందుకీ మార్పు? సినిమా మొత్తం పూర్తయి, రిలీజ్‌కి రెడీ అయిన సమయంలో టైటిల్లో మార్పేంటి? అనేకదా మీ సందేహం. ‘సెన్సార్ బోర్డ్’ ఆజ్ఞాపన ఇది. నిజానికి ఏ ముహూర్తాన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ని మొదలుపెట్టారో కానీ..అడుగడుగునా అడ్డంకులే. షూటింగ్ స్పాట్లో దర్శకుడు భన్సాలీపై దాడి చేయటం, సెట్స్ తగులబెట్టడం, చరిత్రను వక్రీరిస్తున్నారని, చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వబోమని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుచెప్పటం, మమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఉందని రాజ్‌పుత్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేయటం, చిత్ర కథానాయిక దీపికా పదుకోన్‌ని బెదిరించటం.. ఇలా ఎన్నో ఇబ్బందులు. ఈ కారణంగా ‘పద్మావతి’ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాను విడుదల చేయటం కష్టం అని భావించిన చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 ‘పద్మావతి’ సినిమాను వాయిదా వేసింది. ఈ సినిమాను సెన్సార్ సభ్యులతో పాటు కొంతమంది చరిత్రకారులు, రాజ్‌పుత్‌లను వీక్షించమని కోరారు నిర్మాతలు. ఈ నెల 28న సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి ఆధ్వర్యంలో సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూశారు. ఆ తర్వాత కొన్ని నిబంధనలు విధించారనే సమాచారం బయటికొచ్చింది. అవేంటంటే... ► ‘పద్మావతి’ సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చాలి. ► సుమారు 26 కట్స్ చేయమని కోరింది. ► సినిమా మెదలైనప్పుడు, ఇంటర్వెల్‌తో పాటు కొన్ని సీన్స్‌లో ..... హెచ్చరిక జారీ చేయమని ఆదేశించింది. సతీ సహగమనం సన్నివేశాల్లో , ఘూమర్ పాటలో ఈ డిస్క్లైమర్లు వేయాలని కోరారు. ఈ మార్పులు చేసి, మళ్లీ సెన్సార్ బోర్డ్‌కి సినిమాని సబ్మిట్ చేశాక సభ్యులందరూ వీక్షిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారు. చెప్పిన మార్పులు చేస్తే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ను లభిస్తుందని పేర్కొన్నారట. -
టీవీ చానల్స్ చర్చలతో భాషా తీవ్రవాదం
పణజి : టీవీ చానల్స్‌లో రోజూ ప్రసారం అవుతోన్న చర్చా కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారిని ఓడించడమే లక్ష్యంగా.. చాలా సార్లు అడ్డదిడ్డంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, అంతూపొంతూ లేకుండా సాగుతోన్న టీవీ చర్చా కార్యక్రమాలు దేశంలో భాషా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. నిజమైన ప్రజాస్వామిక భావనలకు ఇలాంటి చర్చలు అవరోధాలని ప్రసూన్ జోషి అభిప్రాయపడ్డారు. ఆదివారం పణజి(గోవా)లో ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహిస్తోన్న ‘ఇండియా ఐడియాస్ కంక్లేవ్-2017’ లో ఆయన మాట్లాడారు. ‘టీవీ చర్చల్లో.. ఆయా పక్షాలకు చెందిన కొందరు సుశిక్షితులు గెలుపు కోసమే వాదించడం చూస్తూంటాం. వారి ముందు.. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు సైతం డీలా పడిపోతుంటారు. ఎదుటివారు వాదనను మొదలుపెట్టేలోపే ఇటు నుంచి దాడి పూర్తవుతుంది. ఇది సరైన విధానం కాదు. నిజంగా ప్రజాస్వామ్యంగా ఉండాలనుకున్నప్పుడు.. వాదనలు వినే, వాదనలు గెలవడంలో కొత్త మార్గాన్ని కనుగొనవలసి ఉంది’’ అని ప్రసూన్ జోషి అన్నారు. ప్రసూన్ జోషి (ఫైల్ ఫొటో) -
తెలుగు ‘మెర్సల్’ ; సెన్సార్ బోర్డుపై విమర్శలు దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : వారాలకు వారాలు వాయిదా పడుతూ వస్తోన్న ‘అదిరింది’(మెర్సల్ తెలుగు డబ్బింగ్) సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ‘మెర్సల్’ లోని ప్రభుత్వ వ్యతిరేక డైలాగులపై వివాదం చెలరేగిన దరిమిలా, సెన్సార్ బోర్డు కవాలనే సినిమాను అడ్డుకుంటోందని నిర్మాతలు ఆరోపించారు. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే, సినిమా ఆలస్యానికి తాము ఏమాత్రమూ కారణం కాదని, అనవసరంగా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి వాపోయారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘అదిరింది’ ఆలస్యంపై వివరణ ఇచ్చారు. ‘‘సెన్సార్ బోర్డు నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. ఏ రాజకీయ కారణమో, వాణిజ్యపరమైన అంశమో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ‘మెర్సల్’ సినిమా తెలుగు డబ్బింగ్ ‘అదిరింది’ కి సర్టిఫికేట్ జారీ చేయడంలేదని మాపై విమర్శలు చేయడం దారుణం. తమిళ మాత్రుకకు ఎలాగైతే నిబంధనల ప్రకారమే సర్టిఫికేట్ ఇచ్చామో, తెలుగుకు కూడా అలానే ఇస్తాం. అయితే, మా పనిలో ఆలస్యం తలెత్తడం సహజం. నిజానికి సర్టిఫికేషన్‌కు గరిష్టంగా 68 రోజులు పడుతుంది. కానీ మేం సాధ్యమైనంత తొందరగానే పని పూర్తిచేసేస్తాం. కొన్నిసార్లు సెలవులు కూడా తీసుకోకుండా కష్టపడతాం. అలాంటిది మావల్లే సినిమా విడుదల ఆలస్యమవుతోందని విమర్శలు చేయడం సరికాదు’’ అని ప్రసూన్ జోషి వివరణ ఇచ్చారు. మెర్సల్‌కు ఊరట : వివాదాస్పద ‘మెర్సల్’ను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీని విమర్శిస్తూ ‘మెర్సల్’లో డైలాగులు ఉండటాన్ని తమిళనాడు బీజేపీ తప్పుపట్టడంతో మొదలైన వివాదం క్రమంగా దేశాన్ని కుదిపేసే స్థాయికి వెళ్లింది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ‘మెర్సల్’ మద్దతు పలికాయి. అంతలోనే విజయ్ క్రైస్తవుడు కాబట్టే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటూ కొందరు కాషాయ నేతలు వ్యాఖ్యానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. తమిళంలో రూపొందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువదించారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, తెలుగులో అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. -
పహ్లాజ్ నిహలానీపై వేటు
► ప్రసూన్ జోషికిసెన్సార్ బోర్డు బాధ్యతలు ► సభ్యురాలిగా విద్యాబాలన్ న్యూఢిల్లీ: జాతీయ సెన్సార్ బోర్డు(సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై వేటు పడింది. సీబీఎఫ్సీ పదవినుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం ఆదేశించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. జూలై చివర్లోనే నిహలానీని తప్పిస్తారని కేంద్రం సంకేతాలిచ్చింది. సీబీఎఫ్సీ కమిటీలో నిర్మాణాత్మక మార్పులు జరగనున్నాయని ఇటీవలే సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఎంపికైన∙దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. బ్లాక్, తారే జమీన్పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, ఢిల్లీ–6, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీ అవార్డును, ఉత్తమ గీతరచయితగా జాతీయ అవార్డు అందుకున్న జోషి.. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌తో పాటుగా పలు పథకాల ప్రచార గీతాలను రచించారు. జోషిని సీబీఎఫ్సీ చీఫ్‌గా నియమించటంపై చిత్రపరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తోపాటు గౌతమీ తాడిమల్ల, జీవితా రాజశేఖర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. వివాదాల పుట్ట నిహలానీ.. 2015లో సెన్సార్ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచీ నిహలానీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆరెస్సెస్ అండదండలతోనే నిహలానీకి ఈ పదవి దక్కిందనే విమర్శలూ ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు, చిత్రాల సెన్సార్ విషయంలో చిత్రసీమ నిహలానీ తీరును చాలాసార్లు బహిరంగంగానే విమర్శించింది. తనను ‘ట్రూ ఇండియన్’గా పరిచయం చేసుకునే నిహలానీ.. చాలా చిత్రాలకు కట్స్, బీప్స్, ఖండనల విషయంలో అతిగా వ్యవహరించేవారని విమర్శలున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ చిత్రంలో అశ్లీలం ఎక్కువగా ఉందంటూ భారత్‌లో విడుదలకు అనుమతించ కపోవటంతో తొలిసారిగా నిహలానీ వార్తల్లో కెక్కారు. జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’లోనూ చాలా సీన్లను ఈయన తొలగించారు. ఆ తర్వాత ఎన్‌హెచ్ 10, దమ్ లగాకే హైస్సా, అలీగఢ్, ఉడ్తా పంజాబ్, హరామ్ ఖోర్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఇందు సర్కార్, బాబుమషాయ్ బందూక్‌బాజ్ మొదలైన చిత్రాల్లోనూ కీలక సన్నివేశాల్లో దృశ్యాలను తొలగించారు. -
హ్యాపీ బర్త్ డే
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు మీనా (నటి), ప్రసూన్ జోషీ (రచయిత) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచిమార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వీరు 16వ తేదీన పుట్టినందువల్ల వీరిపై కేతు ప్రభావం ఉంటుంది. కేతువు మోక్ష కారకుడు కాబట్టి వీరికి ప్రాపంచిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ కలుగుతుంది. కేతుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. లక్కీ నంబర్లు: 2,6,7,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, లైట్ బ్లూ, సిల్వర్. లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్ర వారాలు. సూచనలు: డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. శుక్రజపం, భృగుపాశుపత హోమం, గణపతి ఆరాధన, కన్నెపిల్లల వివాహానికి సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
స్వచ్ఛ భారత్ కోసం ప్రసూన్ జోషి పాట!
ముంబై: పర్యావరణ పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమ ప్రచారం కోసం ప్రముఖ సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. ఈ పాటను బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్, ప్రసూన్ జోషి కుమార్తె ఐషన్య జోషి, మరికొందరు పిల్లలు పాడారు. ఈ పాటకు విశాల్ ఖురానా సంగీతాన్ని అందించారు. పరిశుభ్రతపై మహాత్మ గాంధీ అనుసరించిన బాటలోనే నడువాలి. సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అని జోషి అన్నారు. 'స్వచ్ఛ భారత్ కా ఇరాదా' అనే గీతాన్ని రాశారు. భాగ్ మిల్కా భాగ్ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, బ్లాక్, ఢిల్లీ చిత్రాలకు కూడా పాటలు రాశారు. -
బీజేపీ ప్రచారానికి రూ.400 కోట్లా?
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయనున్నట్టు చెబుతున్న 400 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) నేత అశతోష్ ప్రశ్నించారు. ఇది నల్లధనమా లేక బీజేపీ ఏదైనా వ్యాపారం చేసి సంపాదించిందా అని అడిగారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి అంబానీ లేదా అదానీ నిధులిచ్చారా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తలెకెత్తుకోవద్దని పియూష్ పాండే, ప్రసూన్ జోషిలకు అశతోష్ విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి రూ.400 కోట్లు ఖర్చు చేయనుందని వార్తలు వచ్చాయి. ప్రచార బాధ్యతను ప్రకటనల రంగంలో ప్రముఖులైన పాండే, జోషిలకు అప్పగించినట్టు సమాచారం.