స్వచ్ఛ భారత్ కోసం ప్రసూన్ జోషి పాట!
స్వచ్ఛ భారత్ కోసం ప్రసూన్ జోషి పాట!
Published Fri, Nov 14 2014 6:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
ముంబై: పర్యావరణ పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమ ప్రచారం కోసం ప్రముఖ సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. ఈ పాటను బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్, ప్రసూన్ జోషి కుమార్తె ఐషన్య జోషి, మరికొందరు పిల్లలు పాడారు.
ఈ పాటకు విశాల్ ఖురానా సంగీతాన్ని అందించారు. పరిశుభ్రతపై మహాత్మ గాంధీ అనుసరించిన బాటలోనే నడువాలి. సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అని జోషి అన్నారు. 'స్వచ్ఛ భారత్ కా ఇరాదా' అనే గీతాన్ని రాశారు. భాగ్ మిల్కా భాగ్ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, బ్లాక్, ఢిల్లీ చిత్రాలకు కూడా పాటలు రాశారు.
Advertisement
Advertisement