![Reliance nationwide campaign for cleaner greener India](/styles/webp/s3/article_images/2024/10/3/reliance-.jpg.webp?itok=ea5SftR-)
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ దేశ పరిశుభ్రతలో తన వంతు పాలుపంచుకుంది. స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా రిలయన్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన జన్ ఆందోళన్‌కు విశేష స్పందన లభించింది. 75,000 మంది వాలంటీర్లు 4,100 చోట్ల స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు.
భారత ప్రభుత్వ 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమానికి మద్దతుగా రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రజలు పరిశుభ్రత చర్యల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పాఠశాలల్లో స్వచ్ఛతపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణానికి సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశమని రిలయన్స్ ఫౌండేషన్ సీఈవో జగన్నాథ కుమార్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్, జియో ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రిలయన్స్ వాలంటీర్లు నిర్వహించిన అవగాహన క్విజ్‌లు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు, ఇతర కార్యకలాపాలలో 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఒడిశా, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో 17,000 మొక్కలను నాటింది.
Comments
Please login to add a commentAdd a comment