Swacch Bharat
-
స్వచ్ఛత సేవలో రిలయన్స్
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ దేశ పరిశుభ్రతలో తన వంతు పాలుపంచుకుంది. స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా రిలయన్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన జన్ ఆందోళన్‌కు విశేష స్పందన లభించింది. 75,000 మంది వాలంటీర్లు 4,100 చోట్ల స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు.భారత ప్రభుత్వ 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమానికి మద్దతుగా రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రజలు పరిశుభ్రత చర్యల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పాఠశాలల్లో స్వచ్ఛతపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణానికి సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశమని రిలయన్స్ ఫౌండేషన్ సీఈవో జగన్నాథ కుమార్ పేర్కొన్నారు.సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్, జియో ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రిలయన్స్ వాలంటీర్లు నిర్వహించిన అవగాహన క్విజ్లు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు, ఇతర కార్యకలాపాలలో 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఒడిశా, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో 17,000 మొక్కలను నాటింది. -
తెలంగాణకు 12 ‘స్వచ్ఛ’ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రంలోని పట్టణాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. దార్శనికత గల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మున్సిపల్ చట్టంలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ దేశవ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ, సవాళ్లపై నిర్వహించిన పోటీలో తెలంగాణ రాష్ట్రం సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ అవార్డుతోపాటు వివిధ కేటగిరీల్లో 12 అవార్డులను గెలుచుకుందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సీడీఎంఏ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్యను 72 నుంచి 142కి పెంచుకున్నట్లు తెలిపారు. పట్టణాలకు రూ. 2,959 కోట్లు ఇచ్చాం... 2019లో నూతన మున్సిపల్ చట్టాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ పట్టణాల రూపురేఖలు మార్చేందుకు పట్టణ ప్రగతిని తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలికవసతుల కోసం రూ. 2,959 కోట్లు విడుదల చేశామన్నారు. ఎక్కడా లేని విధంగా గ్రీన్ బడ్జెట్ ద్వారా హరిత పట్టణాలను రూపొందించే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 142 పురపాలక సంస్థలు, కార్పొరేషన్లలో ఓడీఎఫ్ ప్లస్ కింద 101, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ కింద 8 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయన్నారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం దేశంలోనే విజయవంతంగా అమలైన నగరం హైదరాబాదేనన్నారు. వీధి వ్యాపారు లకు రూ. 10 వేల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు నిధుల కొరత లేదని, చిన్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచే నిధులు అందజేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలకోసారి జీతాలు ఇచ్చేవారని, ప్రస్తుతం నెలనెలా వేతనాలను అంది స్తూ కార్మికులకు అండగా నిలుస్తున్నామన్నారు. అవార్డులను గెలుచుకున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. వారు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో పాటు గోల్కొండ, లంగర్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో రక్షణ శాఖకు చెందిన అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేల నిర్మాణం, రోడ్ల వెడల్పు పనుల గురించి సీఎం స్వయంగా రక్షణ శాఖకు లేఖలు రాసినా పట్టించుకోవట్లేదని, రక్షణ శాఖ పరిధిలోని భూములు రాష్ట్రంలో లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కం టోన్మెంట్, లంగర్హౌస్లలో సమాంతర పాలన సాగిస్తున్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో భాగంగా ఉన్నా మని మరిచిపోయారని విమర్శించారు. ఈ విషయంలో తగిన విధంగా స్పందించకుంటే పోరాటమే దిక్కన్నారు. హైదరాబాద్‌కు సం బంధించి తాము చేసిన విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. -
గ్రామాల్లో మౌలిక వసతులు ‘పది’లం
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నంత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగిలిన ఐదు నెలల కాలంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం రూ.10 కోట్లకు తక్కువ కాకుండా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లించే వేతనాలతో నిమిత్తం లేకుండా మెటీరియల్ నిధుల కేటగిరీలో రూ.2,000 కోట్లు.. స్వచ్ఛ భారత్ పథకంలో మరో రూ.600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంది. ఈ నిధులతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.10 కోట్లకు తగ్గకుండా కొత్తగా అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకొని, వేగంగా పనులు ప్రారంభించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టే కొత్త పనులకే... ఉపాధి హామీ పథకంలో, ఆయా శాఖల్లో గత ప్రభుత్వంలో అనుమతి తీసుకున్న పనులకు ఈ నిధులను ఉపయోగించకుండా.. గ్రామాల్లో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టే కొత్త పనులకు మాత్రమే ఈ నిధులను ఉపయోగించుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు 13 జిల్లాల పరిధిలో 2,903 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కాంక్రీట్ మురుగు కాల్వల నిర్మాణానికి ఆయా జిల్లాల నుంచి పలు ప్రతిపాదనలు అందినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాంక్రీట్ మురుగు కాల్వలు, సచివాలయ భవనాలకు ప్రాధాన్యత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా.. కాంక్రీట్ మురుగు కాల్వల నిర్మాణం, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి పనుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కనీసం 3 వేల కిలోమీటర్ల పొడవునా కాంక్రీట్ మురుగు కాల్వల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ పంచాయతీ కార్యాలయం లేని చోట్ల రూ.35 లక్షలతో సచివాలయ కార్యాలయం నిర్మించాలని.. ఏదో ఒక భవనం ఉన్న చోట సచివాలయ అవసరాలకు తగ్గట్టు అదనపు భవన నిర్మాణానికి రూ.12–15 లక్షల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐదు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు దాకా ఖర్చు చేయాలని ప్రణాళికగా పెట్టుకున్నారు. గ్రామాల్లో ఉండే స్కూళ్ల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి వాటికి రూ.100 కోట్లు, అటవీ, గృహ నిర్మాణ శాఖల ద్వారా రూ.100 కోట్ల చొప్పున మరో రూ.200 కోట్లు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మిగిలిన శాఖల ద్వారా మరో రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. -
పండుగ పూటా... పస్తులేనా...?
సాక్షి, కడప(ప్రొద్దుటూరు) : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. కుటుంబ పోషణకోసం వీధుల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తూ కాలువలను శుభ్రం చేస్తుంటారు. మహిళా కార్మికులు సైతం రిక్షాలతో వీధుల్లో తిరుగుతూ చెత్తా చెదారాన్ని సేకరిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా తమకు ఏడు నెలలుగా వేతనం అందడం లేదని వీరంతా వాపోతున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 24 మంది గ్రీన్ అంబాసిడర్లను అధికారులు నియమించారు. నెలకు రూ.6వేలు వేతనం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్‌లో విధుల్లో చేరారు. మూడు నెలలు మాత్రమే వేతనాలు పొందారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఇష్టమైతే పనిచేయండి, లేకపోతే మానుకోండని అధికారులు చెబుతుండటంతో వీరు ఆందోళన చెందుతున్నారు. దసరాకు ప్రసిద్ధి ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రొద్దుటూరుకు ప్రాధాన్యత ఉంది. పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను అన్ని వర్గాలూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడం ఆనవాయితీ. ప్రాధాన్యతగల ఈ పండుగ ఈనెలాఖరును ప్రారంభమవుతున్నా వేతనాలు రాకపోవడంపై కార్మికులు కలత చెందుతున్నారు. కొందరు చేసేది లేక పని మానుకుందామని ఆలోచించినా ఇంటి వద్ద ఉంటే బకాయి వేతనాలు వస్తాయో రావోననే ఆందోళన వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 3వేల మంది కార్మికులు గ్రామ పంచాయతీల పరిధిలో గ్రీన్ అంబాసిడర్ల పేరుతో పారిశుద్ధ్య పని చేస్తున్నారు. స్వచ్ఛభారత్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పసుపు–కుంకుమకు మళ్లించడంతో వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 9,856 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను రూ.376 కోట్లు వెచ్చించి నిర్మించారు. వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున నియమితులైన గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించడం లేదు. చాలా చోట్ల కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఈ ఏడాది జూన్ 25న సర్కులర్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ద్వారా ముందుగా వీరికి వేతనాలు చెల్లించాలని సూచించారు. తర్వాత ప్రభుత్వం ఈ నిధులను గ్రామ పంచాయతీలకు చెల్లిస్తుందని తెలిపా రు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి విడుదలయ్యే నిధుల కోసం వేచి ఉండవద్దన్నారు. అయితే ఇంతవరకు ఈ కార్మికులకు వేతనాలు మాత్రం అందలేదు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లారెడ్డిని సాక్షి వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము బిల్లులను పంపామని చెప్పారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యాన్ని వివరణ కోరగా ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఆస్పత్రికి వెళ్లాలన్నా డబ్బు లేదు ఎడమ వైపు కర్ణబేరి దెబ్బతింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం చేయించుకోవాలన్నా డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. వేతనాలు ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఒక్క నెల కూడా వేతనం పడలేదు. – యు.భార్గవ, కార్మికుడు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు ఒక్క నెల వేతనం కూడా పడలేదు ఏడాదిగా పనిచేస్తున్నా ఒక్క నెల కూడా వేతనం అందలేదు. ఇందుకు ఏవేవో కారణాలు చెబుతున్నారు. కుటుంబ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. – చంద్రరంగ, కార్మికుడు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఇచ్చేది నెలకు రూ.6వేలు వేతనం. మా శ్రమ ఆ దేవుడికి తెలుసు. ఇన్ని నెలలు వేతనం ఇవ్వకుంటే ఎలా పనిచేయాలి. మా లాంటి వారికి ఇన్ని కష్టాలా..? – సునీత, కార్మికురాలు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు -
‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’
ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు. హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర. Haan films main , mujhe bhi अनाड़ी लग रहीं थीं . मैं ने मगर बचपन में , अपनी माँ का हमेशा हाथ बटाया है । मैं झाड़ू में माहिर था । I love cleanliness 🍀🍀🍀🍀🍀🍀🍀🍀 — Dharmendra Deol (@aapkadharam) July 14, 2019 -
చీపురు పట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
-
ట్రాఫిక్‌లో సాధారణ పౌరుడిలా ప్రధాని..
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శనివారం ఢిల్లీలోని పహర్‌గంజ్- అంబేద్కర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వేదికకు చేరుకున్న సమయంలో సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో.. తాను ప్రయాణిస్తున్న రాణీ ఝాన్సీ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించకూడదని అధికారులను ఆదేశించారు. తిరిగి అదే మార్గంలో ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. చీపురు పట్టిన ప్రధాని, బీజేపీ నేతలు.. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మీకేం తెలుసునంటూ వారిని ప్రశ్నించారు. తమకు ఈ కార్యక్రమం గురించి అవగాహన ఉందని, తాము ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామంటూ వారు సమాధానం ఇవ్వడంతో మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే మోదీ కేవలం ప్రచారం కోసమే.. సాధారణ పౌరుడిలా ట్రాఫిక్‌లో ప్రయాణించారని.. ఇదో పబ్లిక్ స్టంట్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ -
చార్మినార్ చుట్టూ ట్రామ్వే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో ఆకర్షణ వచ్చి చేరనుంది. హైదరాబాద్‌కు ప్రతీక అయిన చారిత్రక చార్మినార్ ప్రాంతానికి న్యూ జనరేషన్ ట్రామ్వే ఏర్పాటు దిశగా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వివిధ రవాణా వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా ప్రజా రవాణావైపు ప్రజానీకాన్ని మళ్లించేందుకు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరంతో కుదుర్చుకున్న సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పట్టణ ప్రాంత పునరుద్ధరణ కింద అక్కడ విజయవంతంగా నడుస్తున్న ట్రామ్‌వేను హైదరాబాద్‌లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డో మెట్రోపోలిస్ ప్రతినిధి విక్టర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో పాటు చార్మినార్ పథకం ప్రాజెక్టు డైరెక్టర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషార్రఫ్ ఫారుఖీని కలిశారు. సమగ్ర అధ్యయనం చేపట్టాక ట్రామ్వే మార్గాన్ని ఎంపిక చేయనున్నారు. సుందరీకరణ పనులు దాదాపు పూర్తి... స్వచ్ఛ భారత్ పథకంలో భాగమైన స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల ప్రాజెక్టు కింద చార్మినార్ ఎంపికవడంతో దాని పరిసరాల్లో చేపట్టిన సుందరీకరణ పనులు (చార్మినార్ పాదచారుల పథకం) ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పరిసరాల్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. నగరానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువశాతం చార్మినార్‌ను సందర్శించకుండా వెనుదిరగరు. ఈ నేపథ్యంలో పర్యాటక ఆకర్షణగా, పర్యావరణపరంగానూ ట్రామ్వే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కోల్‌కతా మినహా మిగిలిన నగరాల్లో చతికిల... దేశంలో చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, ముంబై, నాసిక్, పట్నా తదితర ప్రాంతాల్లో వందేళ్ల క్రితమే ట్రామ్‌వేలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కొనసాగలేక మూతపడ్డాయి. అయితే ఒక్క కోల్‌కతాలో మాత్రమే ప్రజల అభిమానాన్ని చూరగొనడంతో అక్కడ ట్రామ్వే సేవలు కొనసాగుతున్నాయి. చార్మినార్ కేంద్రంగా పాతబస్తీకి... ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రోరైలు త్వరలో ఎంజే మార్కెట్ మీదుగా పరుగులు తీయనుంది. అక్కడి నుంచి చార్మినార్ లేదా గుల్జార్‌హౌస్ వరకు ట్రామ్వే ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితమే అధికారులు భావించారు. చార్మినార్ వద్ద ఉన్న చిరువ్యాపారులను అక్కడి నుంచి తరలించేందుకు సాలార్జంగ్ మ్యూజియం వద్ద స్కైవే నిర్మాణానికి ఇటీవల సిద్ధమయ్యారు. దీంతోపాటు పార్కింగ్ సదుపాయాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకొని అన్నివిధాలా అనుకూలమైన మార్గంలో చార్మినార్ వైపు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, బోర్డో సిటీ మధ్య కుదిరిన సిస్టర్సిటీ ఒప్పందంలో భాగంగా ట్రామ్‌వేకు బోర్డో మెట్రోపోలిస్ సాంకేతిక సహకారం అందిస్తోంది. మరికొన్ని మార్గాల్లోనూ ట్రామ్‌వేపై వచ్చిన అభిప్రాయాలివీ చార్మినార్ ఔటర్ రింగ్‌రోడ్ మీదుగా..అఫ్జల్‌గంజ్–సాలార్జంగ్ మ్యూజియం–మీరాలం మండి–శాలిబండ–ముర్గీచౌక్–ఖిల్వత్ ప్యాలెస్–సిటీ కాలేజ్–హైకోర్టు–అఫ్జల్‌గంజ్.చార్మినార్ ఇన్నర్ రింగ్‌రోడ్ మీదుగా..గుల్జార్‌హౌస్–మిట్టికాషేర్–రాయల్ ఫంక్షన్ హాల్–మీర్‌మొమిన్ దర్గా–మొఘల్‌పురా–పారిస్ కార్నర్–పంచ్‌మొహల్లా–మిట్టికాషేర్– గుల్జార్‌హౌస్. ఇతర మార్గాలు మదీనా– గుల్జార్ హౌస్– ఖిల్వత్–హుస్సేనీ ఆలం–గోల్కొండ గోల్కొండ– కుతుబ్‌షాహీ టూంబ్స్ ఎంజే మార్కెట్–అబిడ్స్–నాంపల్లి– స్నో వరల్డ్–ట్యాంక్‌బండ్ ఏడాదిన్నర క్రితం చేసిన ప్రాథమిక అధ్యయనం మేరకు.. పైలట్ ప్రాజెక్టుగా ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ట్రామ్వే 2.3 కి.మీ. ప్రాజెక్టు అంచనా వ్యయం(రూ. కోట్లలో) 250 ఆదాయం అంచనా(రూ. కోట్లలో) 75 నిర్వహణ ఖర్చులు (రూ. కోట్లలో) 45 సగటు వేగం గంటకు 20 కిలోమీటర్లు ఒక్కో వాహనంలో ప్రయాణికుల సామర్థ్యం 650 మెట్రోరైలు కంటే ప్రయాణ చార్జీ తక్కువ. భూసేకరణ అవసరం ఉండదు. ఉన్నా చాలా స్వల్పం పట్టాల మధ్య నుంచే విద్యుత్ సరఫరా.దీన్నే న్యూ జనరేషన్ ట్రామ్‌వేగా వ్యవహరిస్తారు. -
అభివృద్ధికి అందరూ సహకరించాలి
లింగాపూర్ : మండలంలోని ప్రతీ అధికారి మండల అభివృద్ధికి సహకారించాలని మండల ప్రత్యేక అధికారి ఏయూ ఖాన్ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు మండలంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అన్నివిధాల కృషి చేస్తామని ఎంఈవో కుడిమెత సుధాకర్ అన్నారు. మూడు మినీ భూసార పరీక్ష కేంద్రాలు.. వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను 50శాతం సబ్సిడిపై రైతులకు అందజేయడానికి నిధులు విడుదల చేసిందన్నారు. ఇందులో ఫెన్సింగ్ వైరు, స్ప్రింక్లర్లు, ఆయిల్ఇంజన్లు, తాడిపత్రిలు, పాడిపశువులైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల పటించాలన్నారు. భూముల సారాన్ని పరీక్షించడానికి మూడు మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐకేపీ అధికారులపై కోరం సభ్యుల ఆగ్రహం.. ఐకేపి అ«ధికారుల పనితీరుపై కోరం సభ్యులు, అధికారులు మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాలకు విపరీతంగా రుణాలు అందజేసి రికవరీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్బీఎం మరుగుదొడ్ల నిర్మాణంలో ఎందుకు సహకరించడంలేదన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సంఘాలకు ఇచ్చిన రుణాలను రికవరీ చేయకపోవడంతో బ్యాంకు అధికారులు స్వయం ఉపాధి కోసం అందించే రుణాలను ఇవ్వకుండా నిలిపివేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా ఎవరూ నడుచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎస్సై రామారావు, ఐసీడీఎస్ సీడీపీవో ప్రభావతి, ఈవోపీఆర్డీ ఆనందరావు, సర్పంచ్‌లు సుదర్శన్, నాగోరావు, జాలీంశావ్, పద్మ పాల్గొన్నారు. -
స్వచ్ఛత.. ఉత్తిదే!
వనపర్తి టౌన్ : మున్సిపాలిటీలో ప్రజాసమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన స్వచ్ఛత యాప్ వినియోగంలో వనపర్తి మున్సిపాలిటీ అట్టడుగు స్థానంలో ఉంది. పట్టుమని పది సమస్యలను కూడా పరిష్కరించలేని అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల ఫొటోలు తీసి ఫిర్యాదుచేస్తే వాటిని రాష్ట్ర, జాతీయస్థాయి అధికారులు పరిశీలించేలా యాప్‌ను రూపొందించారు. వనపర్తి మున్సిపాలిటీలో 26వార్డులు ఉండగా, లక్ష జనాభా ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31వరకు దేశంలోని పురపాలక, నగర పాలక సంఘాల పరిధిలో ఆండ్రాయిడ్ యాప్‌తో పట్టణప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించిన తీరును పరిశీలించి స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఇటీవల ర్యాంకులు ప్రకటించారు. జాతీయస్థాయిలో అత్యధికంగా సమస్యలు పరిష్కరించిన మున్సిపాలిటీలకు ప్రకటించిన ర్యాంకుల్లో వనపర్తికి అట్టడుగుస్థానం దక్కింది. వనపర్తితో పాటు గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు స్థానం దక్కలేదు. కొన్నేళ్లుగా స్వచ్ఛత యాప్ అమలులో ఉంది. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అప్లోడ్ చేయడంపై పెద్దగా ఆసక్తిచూపలేదు. సమస్యల నమోదు ఆండ్రాయిడ్ పరిజ్ఞానం కలిగి ఫోన్ ద్వారా ప్లే స్టోర్‌లోకి వెళ్లి స్వచ్ఛత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆయా సమస్యల పరిష్కారంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై తమ అభిప్రాయాలను పోస్ట్చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ర్యాంకులు కేటాయించే సమయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు సమస్యలు అనేకం రోజురోజుకూ మున్సిపాలిటీ విస్తరిస్తోంది. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో సమస్యను పరిష్కరించమని వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. యాప్ సేవలు ఉన్నాయనే విషయం తమకు ఇంతవరకు తెలియదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. ఇక మీదట పక్కాగా.. స్వచ్ఛత యాప్‌లో ముందుకు పోలేకపోయినం. ఆ కార్యక్రమం ముగిసింది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు సాధించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. – వెంకటయ్య, వనపర్తి కమిషనర్ -
వెయ్యి మంది గాంధీలొచ్చినా!
న్యూఢిల్లీ: స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను రాజకీయం చేయటం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెయ్యి మంది మహాత్మా గాంధీలొచ్చినా దేశాన్ని స్వచ్ఛంగా మార్చలేరని, 125 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యం లేకుండా ఈ కార్యక్రమ లక్ష్యాలను చేరుకోవటం సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. చీపురు పట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభించినపుడు తనను చాలా మంది విమర్శించారన్నారు. ‘మోదీని విమర్శించాలంటే చాలా అంశాలున్నా యి. కానీ సమాజంలో మార్పు తీసుకొచ్చే అంశాలపై హాస్యాస్పదంగా మాట్లాడటం, రాజ కీయం చేయటం సరికాదు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. మహాత్ముడు చూపిన మార్గంలో ముందుకెళ్తాను’అని ప్రధాని పేర్కొన్నారు. అక్టోబర్ 2 నాటి సెలవును వృథా చేస్తున్నా నంటూ కొందరు ప్రజలు, మరికొందరు తోటి రాజకీయ నాయకులు విమర్శించారన్నారు. ‘వెయ్యి మంది మహాత్మా గాంధీలు, లక్ష మంది నరేంద్ర మోదీలు, ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు ఏకమైనా స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోవటం కష్టం. 125 కోట్ల మంది దేశ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం’ అని మోదీ వెల్లడించారు. తను చాలా విషయాల్లో ఓపికగా ఉంటానన్న మోదీ.. విమర్శలను సహించడంలోనూ తన సామర్థ్యా న్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. ‘ఐదేళ్ల క్రితం విద్యార్థులు స్కూళ్లు ఊడుస్తుంటే పెద్ద వివాదం చేశారు. తల్లిదండ్రులు కూడా టీచర్ల తీరును తప్పుబట్టారు. కానీ ఇప్పుడు ఆ విద్యార్థులే స్కూళ్లల్లో పారిశుధ్యం కోసం పనిచేస్తుండటాన్ని గొప్ప విషయంగా చూస్తున్నారు’ అని ఆయన తెలిపారు. మీడియా, పౌర సమాజం సభ్యులు స్వచ్ఛత ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయటంలో కీలక భూమిక పోషించారన్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో సాధించింది స్వల్పమేనని.. చేయాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు. -
స్వచ్ఛ, స్వాస్థ్ భారత్ కావాలి
దత్తత గ్రామం పుట్టమరాజువారి కండ్రిగలో ప్రజలకు సచిన్ టెండూల్కర్ పిలుపు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్వచ్ఛ భారత్‌తోపాటు స్వాస్థ్(ఆరోగ్య) భారత్ తయారు కావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. తాను దత్తత తీసుకున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టమరాజువారి కండ్రిగ గ్రామంలో సచిన్ బుధవారం పర్యటిం చారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2014 నవంబరు 16న నెర్నూరు పంచాయ తీని దత్తత తీసుకున్నానని చెప్పారు. పుట్టమ రాజు కండ్రిగను పూర్తి స్థారుులో అభివృద్ధి చేశామని అన్నారు. ఇక్కడ రెండేళ్లలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించామని, మరో రెండు నెలల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనన్నారు. రెండో విడతలో ఈ పంచాయతీలోని నెర్నూరు, గొల్లపల్లి గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆటలు, చదువు.. రెండూ ముఖ్యమే రెండేళ్ల క్రితం తాను పుట్టమరాజువారి కండ్రిగకు వచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా మారిపోరుుందని, ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పు కనిపిస్తోందని సచిన్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీలోని మిగిలిన రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణరుుంచినట్లు ప్రకటించారు. యువత బాగా ఆటలాడుతూ బాగా చదవాలని, మనిషి పరిపూర్ణ అభివృద్ధికి ఈ రెండూ ముఖ్యమేనన్నారు. గ్రామస్తులు మద్యం, పొగాకు మాని ఆ సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడపడానికి కేటారుుంచాలని సచిన్ కోరారు.పుట్టమరాజువారి కండ్రిగలోని రెండు క్రికెట్ జట్లకు బ్యాట్లు పంపిణీ చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మాట్లాడుతూ... హరిశ్చంద్రారెడ్డి అనే దాత సహకారంతో ఆరెకరాల భూమిలో సచిన్ పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరారు. వస్తానని సచిన్ హామీ ఇచ్చారు. తెలుగులో పలకరింపు తన దత్తత గ్రామమైన పుట్టమరాజువారి కండ్రిగ ప్రజలనుద్దేశంచి సచిన్ టెండూల్కర్ తెలుగులో ‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’ అని పలకరించారు. సభకు ముందు గ్రామంలో మహేశ్ అనే యువకుడి ఇంటికి వెళ్లి సచిన్ తేనీరు సేవించారు. 2014 నవంబరు 16న గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే ఇంట్లో కొంతసేపు గడిపారు. క్రికెట్ దిగ్గజం రెండుసార్లు తన ఇంటికి రావడం పట్ల మహేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. -
బాలిక దీక్ష...148 కుటుంబాలకు ప్రేరణ
♦ మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుటుంబాలు ♦ స్థానికుల్లో చైతన్యం తెచ్చిన లావణ్య ♦ అమితాబ్ ‘ఆజ్‌కి రాత్‌హై జిందగీ’ కార్యక్రమంలో ప్రస్తావన తుమకూరు: ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాల్సిందేనంటూ ఓ బాలిక చేసిన ఉపవాస దీక్ష.. కేవలం తన ఇంట్లోనే కాక ఆ ఊరిలో ఉన్న 148 కుటుంబాలు సైతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రేరణ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ చేపట్టిన ‘ఆజ్‌కి రాత్‌హై జిందగీ’ అనే కార్యక్రమంలో ఈ చిన్నారి ప్రస్తావన రావడంతో ‘స్వచ్ఛ భారత్’లో ఆ చిన్నారిని భాగస్వామిని చేయాలని దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు భావిస్తున్నాయి. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా శిరా తాలూకా హలేనళ్లిలోని దేవరాజు, భాగ్యమ్మ దంపతుల కుమార్తె లావణ్య చిక్కనహళ్ళిని. ఈ బాలిక శాంతలా పాఠశాల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శిరాలో ఏడాది కిందట వివేకానంద యూత్ క్లబ్ చేపట్టిన జాగృతి కార్యక్రమంలో లావణ్య సహ విద్యార్థులతో కలసి పాల్గొంది. కాలకృత్యాలు తీర్చేకునేందుకు ఆరుబయటకు వెళ్తే జరిగే అనర్థాలు, అనారోగ్యాలపై అవగాహన పెంచుకుంది. అదే రోజు స్వగ్రామానికి వెళ్లి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని పట్టుబట్టింది. అంతడబ్బు తమ వద్ద లేదని కూలీపనులు చేసుకునే ఆ తల్లిదండ్రులు పేర్కొన్నా లావణ్య పట్టువీడలేదు. మరుగుదొడ్డి నిర్మించే వరకు భోజనం ముట్టనని భీష్మించుకు కూర్చుంది. రెండు రోజుల పాటు ఉపవాసం ఉంది. చేసేది లేక మరుగుదొడ్డి నిర్మిస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. లావణ్యను స్ఫూర్తిగా తీసుకున్న సాటి విద్యార్థినులు తమ తల్లిదండ్రులను ఒప్పించి మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తుందని, మరుగుదొడ్ల నిర్మాణంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని లావణ్య స్థానికుల్లో చైతన్యం తెచ్చింది. దీంతో ఇటీవల గ్రామంలో మరో 148 కుటుంబాలు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించాయి. లావణ్య సేవలను గుర్తించిన దేశంలోని స్వచ్ఛంద సంస్థలు ఆ చిన్నారిని ‘స్వచ్ఛ భారత్’లో భాగస్వామిని చేయాలని భావిస్తున్నాయి. అయితే లావణ్య ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. లావణ్యతో పాటు మరొకరు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి సంబంధించి దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అందుకు అవసరమైన ధన సహాయాన్ని అందజేసేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించింది. -
సర్కారీ దవాఖానాల్లో కానరాని ‘స్వచ్ఛ’త
ప్రభుత్వాసుపత్రుల్లో తాండవిస్తున్న అపరిశుభ్రత సాక్షి నెట్వర్క్: స్వచ్ఛ భారత్ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది! ఈ కార్యక్రమంలో భాగంగా చేతుల్లో చీపుర్లు పట్టుకొని రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో చెత్తాచెదారాన్ని ఊడుస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన అధికారులు ఆ తర్వాత అటు వైపే తొంగి చూడడం లేదు. ఒక్కరోజు హడావుడి చేసి చేతులు దులుపుకోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఫలితంగా సర్కారీ ఆసుపత్రులు ఎప్పట్లాగే కంపు కొడుతున్నాయి! జిల్లా, ప్రాంతీయ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. ఒకటేమిటి అన్నిచోట్లా అపరిశుభ్రత తాండవిస్తోంది. వార్డుల్లో, ఆసుపత్రుల ఆవరణలో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించడం లేదు. ఆసుపత్రి చుట్టూ ఉండే కాలువలు మురుగుతో నిండిపోయాయి. మరుగుదొడ్లు ఉపయోగించడానికి వీల్లేనంత అధ్వాన్నంగా ఉన్నాయి. ఆసుపత్రుల ఆవరణల్లో పందులు, పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. దవాఖానాలో వినియోగించిన పరికరాలు, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. పారిశుధ్యం కోసం ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. ‘స్వచ్ఛ’త కానరావడం లేదు. చెత్తాచెదారం నిండిపోయి ప్రాంగణాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నా.. ఆసుపత్రుల ఉన్నతాధి కారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అంతా బాగుందంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అంటూ నినాదాలిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. సిబ్బంది కొరత కూడా ప్రభుత్వ ఆసుపత్రులను పీడిస్తోంది. డాక్టర్లు, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు తగిన సంఖ్యలో కనిపించడం లేదు. ఆదిలాబాద్: పారిశుధ్యం సున్నా ఆదిలాబాద్ రిమ్స్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఎమర్జెన్సీ వార్డు, గైనిక్ వార్డు, మరుగుదొడ్లు, బాత్రూంలు, అబ్జర్వేషన్ గది, ఆపరేషన్ థియేటర్లను ప్రతి రోజూ నాలుగు నుంచి ఆరు సార్లు శుభ్రం చేయాల్సిన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా లక్షల రూపాయలు వెచ్చిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో ఆసుపత్రి ఆవరణ చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది. రంగారెడ్డి: ఒక్కరోజే స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫోటోలకే పరిమితమైంది. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల ఆవ రణలో పారిశుధ్యం మచ్చుకు కూడా కనిపించడం లేదు. పరిగి మండల కేంద్రంలోని ఆసుపత్రిలో మురుగు నీరు పేరుకుపోవడంతో పందులు నివాసం ఏర్పర్చుకున్నాయి. మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెలైన్, మందు బాటిళ్లు కుప్పలుగా పేరుకుపోయాయి. రోగుల కోసం వాడిన సిరంజీలు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. నల్లగొండ: ముక్కుపుటాలు అదరాల్సిందే.. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో వైద్యశాల ప్రాంగణం పందులకు నిలయంగా మారింది. ఆసుపత్రి చుట్టూ డ్రైనేజీలు మురుగుతో నిండిపోయాయి. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వైద్యశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు సగానికి పైగా వినియోగించుకోవడానికి వీల్లేని స్థితిలో ఉన్నాయి. రామన్నపేట ఆసుపత్రిలో అంతే. గేట్ల వద్ద గార్డ్ లేకపోవడంతో పందులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నాయి. రోగుల సహాయకులు భోజనాలు చేస్తుంటే వారి మధ్య నుంచే పందులు సంచరిస్తున్నాయి. నిజామాబాద్: సిబ్బందే లేరు 8 అంతస్తులు ఉన్న నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో కేవలం 36 మంది మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గర్భిణీ వార్డు, చిన్న పిల్లల వార్డు, ఎముకల వార్డు, జనరల్ సర్జన్ వార్డు, అత్యవసర విభాగాలు కంపుకొడుతున్నాయి. బోధన్, బాన్సువాడ, కామారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు 136 మంది పనిచేయాల్సి ఉంటే కేవలం 42 మందితో నడిపిస్తున్నారు. కరీంనగర్: అధ్వానంగా మరుగుదొడ్లు జిల్లాలో ఏ ఆసుపత్రికి వెళ్లినా అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా ఆసుపత్రులకు ప్రహారీ గోడలు లేకపోవడంతో పందులు, పశువులు ప్రవేశిస్తున్నాయి. ఆసుపత్రుల్లో నీటి కోరత వల్ల మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. వేములవాడ, సిరిసిల్ల, చందుర్తి, హుజురాబాద్, మంథని, హుస్నాబాద్, కోహెడ ఆసుపత్రుల ఆవరణలు ముళ్ల పోదలు, తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలతో అడవులను తలపిస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో రోగులు, సిబ్బంది కోసం నిర్మించిన టాయిలెట్లను స్టోర్రూములుగా మార్చారు. వరంగల్: చెత్తకు కేరాఫ్ జిల్లాలోని మానుకోట ఏరియా ఆసుపత్రి చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రి ఆవరణలోని కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి కంపు వాసనతో రోగులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు సక్రమంగా శుభ్రం చేయడం లేదు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలోనూ కూడా పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. మెదక్: వ్యర్థాలు ఎక్కడివక్కడే.. మెదక్‌లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆసుపత్రి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ఇక పీహెచ్‌సీల్లోని మరుగుదొడ్ల వైపు వెళ్లాలంటేనే పేషెంట్లు, వారి సహాయకులు జంకుతున్నారు. చాలా వాటికి ప్రహరీలు లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో కుక్క లు, పందులు, ఇతర జంతువులు సంచరిస్తున్నాయి. దోమ లు విజృంభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్: ఆవరణంతా కంపు మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లోని ఏరియా ఆసుపత్రుల్లో పరిశుభ్రత మచ్చుకు కూడా కానరావడం లేదు. విధిగా మూడు రోజులకు ఒకసారి పడకల్లో దుప్పట్లు, బెడ్ షీట్లను మార్చాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా ప్రధాన ఆసుపత్రి పందులకు నిలయంగా మారింది. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. లేని రోగాలు వచ్చేట్టు ఉన్నాయి జ్వరమొచ్చిందని సర్కారు దవాఖానకు వస్తే ఈడ ఉండడానికి తావిచ్చిండ్రు. కానీ వాసన వశపడ్తలేదు. ఆ రూంలకు ఎట్ల పోయత్తుండ్రో ఏమో.. కంపు వాసన వస్తుంది. దవాఖానకు వస్తే లేని రోగాలు వచ్చేటట్టున్నాయి. - వరదయ్య, దాచారం, సిరిసిల్ల, కరీంనగర్ -
పార్లమెంట్లో ‘గాంధీగిరి’
పంజాబ్‌లో దళితులపై అకృత్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన కాంగ్రెస్ ఎంపీలకు గులాబీలు ఇచ్చిన బీజేపీ సభ్యులు న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీజేపీ గాంధీగిరి చేసింది. లోక్‌సభలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు గులాబీలు ఇచ్చి శాంతిపజేసే ప్రయత్నం చేసింది. పంజాబ్‌లో దళితులపై అకృత్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలు రద్దు చే సి, పంజాబ్‌లో దళితుల అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులను స్పీకర్ సుమిత్రా మహజన్ తిరస్కరించారు. దీంతో వారు వెల్ లోకి దూసుకెళ్లి ప్రధాని మోదీ, అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని షేమ్.. షేమ్.., పంజాబ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో వెల్‌లోకి వెళ్లిన బీజేపీ సభ్యులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు గులాబీలు అందించారు. కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే మాట్లాడుతూ దళితుల అంశం కీలకమైనదని, దీనిపై చర్చించేందుకు అనుమతించాలని అన్నారు. అందుకు అనుమతించని స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం జీరోఅవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. పంజాబ్‌లో దళితులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. బీజేపీ, అకాలీదళ్ ఈ ఆరోపణలను తోసి పుచ్చాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. స్వచ్ఛభారత్ ద్వారా రూ.10వేల కోట్లు స్వచ్ఛ్ భారత్ సెస్ రూ. 10 వేల కోట్లు వస్తుందని అంచనా: స్వచ్ఛ్ భారత్ సెస్ కింద ఏడాదికి రూ. 10 వేల కోట్లు రాబట్ట వచ్చని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. -
‘ముద్ర’ ప్రారంభం
జార్ఖండ్‌లో ప్రారంభించిన ప్రధాని ఖుంటి(జార్ఖండ్): జార్ఖండ్‌లో శుక్రవారం ముద్ర యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సంథాల్ పరగణాలోని దుంకాలో ‘ముద్ర మహారుణ మేళా’ను, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులకు తొలి విడతగా మోదీ రూ. 10 వేల చొప్పున రుణం అందించారు. ఇది రుణమని, దీన్ని నామమాత్ర వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వడ్డీ భారం పడకుండా విడతలవారీగా రుణం తీసుకోవడం ఉత్తమమని సూచించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజనను ముందుకు తీసుకువచ్చామన్నారు. సంథాల్ పరగణాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను ప్రస్తావిస్తూ.. పేదలకు బ్యాంకింగ్ సదుపాయాలు, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ. 26 వేల కోట్లను 20 లక్షల మంది మహిళలు సహా అర్హులైన 42 లక్షల మందికి రుణాలుగా అందిస్తారు. అంతకుముందు, జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా కోర్టు, కలెక్టరేట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన 180 కేవీ సౌర విద్యుత్ ప్లాంటునూ మోదీ ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఆయన జయంతి అక్టోబర్ 2 తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు. పేదలకు న్యాయం జరగాలన్న బాపూజీ కల.. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ద్వారానే సాకారమవుతుందన్నారు. దేశంలోనే సౌరవిద్యుత్ సౌకర్యమున్న తొలి కోర్టుగా ఖుంటి జిల్లా కోర్టు నిలిచిందని, ఇదే బాపూజీకి ఘన నివాళి అని అన్నారు. స్వచ్ఛభారత్‌కు కలసిరండి.. లేదా తప్పుకోండి! న్యూఢిల్లీ: ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తే తప్ప ‘స్వచ్ఛభారత్’ విజయం సాధించలేదని మోదీ తేల్చి చెప్పారు. ఆ ఉద్యమాన్ని ఏ ఒక్క వ్యక్తికో, ప్రభుత్వానికో, లేక ఏ ఒక్క పార్టీకో ఆపాదిస్తే అది విఫలమవుతుందన్నారు. ‘స్వచ్ఛభారత్ కార్యక్రమం నచ్చనివారు అందులో పాల్గొనకండి.. పక్కకు తప్పుకోండి.. అంతేకానీ విమర్శించకండి’ అంటూ విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛభారత్‌లో చురుగ్గా పాల్గొన్న వారికి శుక్రవారం ఆయన ఢిల్లీలో అవార్డులు అందజేసి ప్రసంగించారు. -
'స్వచ్ఛ భారత్'.. సానియా మాటల్లో..!
-
స్వచ్ఛ భారత్ కోసం ప్రసూన్ జోషి పాట!
ముంబై: పర్యావరణ పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమ ప్రచారం కోసం ప్రముఖ సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. ఈ పాటను బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్, ప్రసూన్ జోషి కుమార్తె ఐషన్య జోషి, మరికొందరు పిల్లలు పాడారు. ఈ పాటకు విశాల్ ఖురానా సంగీతాన్ని అందించారు. పరిశుభ్రతపై మహాత్మ గాంధీ అనుసరించిన బాటలోనే నడువాలి. సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అని జోషి అన్నారు. 'స్వచ్ఛ భారత్ కా ఇరాదా' అనే గీతాన్ని రాశారు. భాగ్ మిల్కా భాగ్ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, బ్లాక్, ఢిల్లీ చిత్రాలకు కూడా పాటలు రాశారు. -
'స్వచ్ఛ భారత్ ను ప్రధాని ఓ ఆయుధంగా మలిచారు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. 'ప్రజల ఆలోచనా విధానాన్ని, అభిరుఛులను మనం మార్చాల్సిన బాధ్యత ఉంది. దేశం పరిశుభ్రంగా ఉంటే, ప్రజల మనస్సుల్లో కూడా స్వచ్చత ఉంటుంది. ఈ కార్యక్రమం అవినీతిపై పోరాటానికి ప్రారంభం లాంటిది. ఒక్కరితో ఏది సాధ్యం కాదనే , రాహుల్ కు భోదపడటం లేదు' అని జవదేకర్ అన్నారు. దేశంలో మార్పుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని ఓ ఆయుధంగా మార్చారని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణం, నీటి కాలుష్యాన్ని తగ్గించాలని, ఎనర్జీ, నీటి వనరులను రక్షించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నేతలు ఫోటోలు దిగడానికి, ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారని జవహర్ లాల్ నెహ్రూ 125వ జన్మదిన వేడుకల్లో రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. -
నేటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛ్ భారత్’
దోమ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నారు. ‘స్వచ్ఛ్ భారత్- స్వచ్ఛ్ విద్యాలయ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి 27వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఇందులో పరిశుభ్ర భారత్‌ను రూపొందించాల్సిన ఆవశ్యకతను, దాని కోసం ప్రతిఒక్కరూ తమ వంతుగా చేయాల్సిన కృషిని వివరిస్తూ పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి శాఖలు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాలల ఆవరణ, పరిసరాలు, క్రీడా పరికరాలు, గదులను శుభ్రం చేయడంతో మొదలు పెడతారు. నేటి నుంచి 4 రోజులపాటు పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం 14వ తేదీన పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు, నిర్వహణ కోసం విద్యార్థుల భాగస్వామ్యంలో ఎకో క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. 15 నుంచి 18వ తేదీ వరకు వరుసగా తాగునీరు, జీవ వైవిధ్య సంబంధిత అంశాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాటిని సద్వినియోగం చేసుకునే విధానం, శక్తి ఉత్పత్తి, వినియోగం తదితర అంశాలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సమీక్షలు, చర్చా వేదికలు నిర్వహిస్తారు. 20న భూ అభివృద్ధి పనులు, భూ పరిరక్షణ, కాలుష్య సంబంధిత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 21, 22, 24 తేదీల్లో విద్యార్థులకు పరిశుభ్రత, పారిశుద్ధ్య సంబంధిత అంశాలపై వ్యాసరచన, నినాద రచన, పద్య పఠనం, క్విజ్ తదితర పోటీలను నిర్వహిస్తారు. 25న ఎస్ఎంసీ కమిటీ సమావేశాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఏర్పడిన అనంతరం 27న విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు స్వచ్ఛ్ భారత్ లక్ష్యాలను వివరించనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కలిసి సర్వే నిర్వహించి ఓ నివేదికను రూపొందించడంతో పాఠశాలల్లో ‘స్వచ్ఛ భారత్- స్వచ్ఛ విద్యాలయ’ కార్యక్రమం ముగుస్తుంది. -
మహాత్మా గాంధీ కలల్ని నిజం చేద్దాం!
-
వారం రోజుల ముందే..
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో ‘స్వచ్ఛ్ భారత్’ పథకం గురువారమే ప్రారంభం కానుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల రెండో తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా వచ్చే నెల 23 వరకు జరగనుంది. కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఇప్పటికే అన్ని భాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిగతా ప్రాంతాలకంటే ఢిల్లీ వెనుకబడకుండా చూడడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన మొట్టమొదటిసారిగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం అమలు కోసం వ్యూహాన్ని రూపొందిం చాలంటూ ఆయన వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన మరో సమావేశంలో అన్ని అంశాలను సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), రవాణా, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, పర్యటన. పట్టణ అభివృద్ధి శాఖ తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. బడి పిల్లలు, యువతతోపాటు నగర వాసులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. పభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యూఏ), వర్తక సంఘాలు, మార్కెట్ అసోసియేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఈ కార్యక్రమాన్ని వార్డు స్థాయిలో చేపట్టనుంది. దీని కింద పార్కులు, చెరువులు, వీధులు, రహదారులు, సర్వీస్ లేన్లు, ఖాళీ స్థలాల పరిశుభ్రతపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేయడం కోసం తాము చేపట్టనున్న చర్యలను మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు... ఎల్జీకి ఇప్పటికే వివరించారు. ఖాళీగాఉన్న వెయ్యికిపైగా ప్లాట ్లను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా ఢిల్లీ అభివృద్ధి సంస్థను ఎల్జీ ఆదేశించారు. కాగా పారిశ్రామికవాడల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో పేరుకుపోయిన దాదాపు 600 ట్రక్కులపైగా వ్యర్థాలను తొలగించనున్నారు. సామాస్య ప్రజలు కూడా తమ ఇళ్లు. దుకాణాల పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఎల్జీ కోరారు. రహదారులపై నిర్మాణ సామగ్రి, వ్యర్థాలను పారవేసే వారిపై ఈ కార్యక్రమంలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటారు. రహదారులు, పేవ్మెంట్లపై నిబంధనలకు భిన్నంగా నిలిపిఉంచిన వాహనాల యజమానులపై భారీఎత్తున జరిమానాలు విధిస్తారు. మరుగుదొడ్ల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మిస్తారు. జరిమానాల కింద రూ. 28 లక్షలు వసూలు న్యూఢిల్లీ: పారిశుధ్యాన్ని గాలికొదిలేసిన సంస్థలపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరే షన్ (ఎస్డీఎంసీ) కొరడా ఝళిపించింది. ఈ నెలలో ఇప్పటివరకూ నాలుగు వేలమందికి చలాన్లు పంపిన కార్పొరేషన్ వారి వద్దనుంచి రూ. 28 లక్షలను జరిమానా కింద వసూలు చేసింది. ఇలా జరిమానా చెల్లించినవాటిలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ), ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ)తోపాటు ఇంకా ప్రయివేటు సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మహేశ్ గుప్తా వెల్లడించారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టామని, మొత్తం నాలుగు జోన్లలో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇందులోభాగంగా డంప్‌లను తొలగిస్తున్నామన్నారు. వీధుల్లో ఉమ్మి వేయొద్దంటూ నగరవాసులను హెచ్చరిస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాల్సిందిగా స్థానికులను కోరుతున్నామన్నారు. త ప్పుచేసిన వారిని వదిలిపెట్టబోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా వీధుల్లో చెత్త పారేస్తే వారికి జరిమానా విధిస్తున్నమన్నారు. ఈ నెల ఏడో తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, వంద రోజులపాటు ఇది కొనసాగుతుందని అన్నారు.