మాట్లాడుతున్న ఏయూ ఖాన్
లింగాపూర్ : మండలంలోని ప్రతీ అధికారి మండల అభివృద్ధికి సహకారించాలని మండల ప్రత్యేక అధికారి ఏయూ ఖాన్ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు మండలంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అన్నివిధాల కృషి చేస్తామని ఎంఈవో కుడిమెత సుధాకర్ అన్నారు.
మూడు మినీ భూసార పరీక్ష కేంద్రాలు..
వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను 50శాతం సబ్సిడిపై రైతులకు అందజేయడానికి నిధులు విడుదల చేసిందన్నారు. ఇందులో ఫెన్సింగ్ వైరు, స్ప్రింక్లర్లు, ఆయిల్‌ఇంజన్లు, తాడిపత్రిలు, పాడిపశువులైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల పటించాలన్నారు. భూముల సారాన్ని పరీక్షించడానికి మూడు మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఐకేపీ అధికారులపై కోరం సభ్యుల ఆగ్రహం..
ఐకేపి అ«ధికారుల పనితీరుపై కోరం సభ్యులు, అధికారులు మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాలకు విపరీతంగా రుణాలు అందజేసి రికవరీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్‌బీఎం మరుగుదొడ్ల నిర్మాణంలో ఎందుకు సహకరించడంలేదన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సంఘాలకు ఇచ్చిన రుణాలను రికవరీ చేయకపోవడంతో బ్యాంకు అధికారులు స్వయం ఉపాధి కోసం అందించే రుణాలను ఇవ్వకుండా నిలిపివేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా ఎవరూ నడుచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎస్సై రామారావు, ఐసీడీఎస్ సీడీపీవో ప్రభావతి, ఈవోపీఆర్‌డీ ఆనందరావు, సర్పంచ్‌లు సుదర్శన్, నాగోరావు, జాలీంశావ్, పద్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment