ODF villages
-
జాతీయ స్థాయికి రాష్ట్రం నుంచి ఏకైక పంచాయతీ!
సాక్షి, ఆదిలాబాద్ : ‘నిన్నటి వరకు నేను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గురించి చెప్పేవాడిని. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామం పేరు తలుస్తా.. గ్రామాలు ఎలా ఉండాలో చూసి రమ్మని అధికారులు, సర్పంచులకు చెబుతా..’’ఇది స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖరా(కే) గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షితో అన్నమాటలివి. నిజంగా సీఎం మాటలకు అనుగుణంగా అక్కడ అభివృద్ధి జరిగిందా? ఆ గ్రామం కేసీఆర్ దృష్టిని ఎలా ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఎందుకు ఎంపికైంది? ముఖరా(కే) గ్రామం అభివృద్ధిపై ప్రత్యేక కథనం. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామంలో 300 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 700 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత కనిపిస్తాయి. తడిచెత్త, పొడిచెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తయితే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు. వీటితోపాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తిస్తూ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక పంచాయతీ ముఖరా(కే) కావడం గమనార్హం. ప్రభుత్వ పథకాలను వంద శాతం ఉపయోగించుకుంటూ ఈ గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. నూతన పంచాయతీగా ఏర్పడినప్పటికీ అభివృద్ధిలో ముందంజలో ఉంది. నవంబర్ 19న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖరా(కే) సర్పంచ్ గాడ్గే మీనాక్షితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, సామూహిక మరుగుదొడ్లు వంటి పథకాలను వందశాతం అమలు చేయడంపై ఆయన సర్పంచ్‌ను అభినందించారు. గ్రామంలో ప్రకృతి వనం చూడముచ్చటగా ఉంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్పంచ్, ఆమె భర్త, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమలు చేస్తున్నారు. నర్సరీ, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, వైకుంఠధామం నిర్మించారు. మియావాకీ విధానంలో దట్టమైన అడవులు పెంచాలని ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ గ్రామంలో పంచాయతీ స్థలంలో 19 వేల మొక్కలు నాటి పెంచుతున్నారు. ఆనందంగా ఉంది బహిరంగ మల, మూత్ర విసర్జనతో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది. మహిళ సర్పంచ్‌గా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించా. ఫలితంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం సాధ్యమైంది. ముఖరా పంచాయతీకి జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం మహిళా సర్పంచ్‌గా చాలా గర్వంగా.. ఆనందంగా ఉంది. గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించి మా దగ్గర రూ.కోటికి పైగా నిధులు ఉన్నాయి. ఈ నిధులపై వచ్చే వడ్డీతో ప్రభుత్వ పథకాల అమలుకు కొంత ఉపయోగించుకొని బిల్లులు వచ్చిన తర్వాత మళ్లీ వీడీసీకి తిరిగి ఇస్తున్నాం. – గాడ్గే మీనాక్షి, ముఖరా(కే) సర్పంచ్ -
మోరి..వట్టి మోళీ..
సఖినేటిపల్లి (రాజోలు): అది 2016 డిసెంబర్ 29వ తేదీ. మండలంలోని మోరి గ్రామంలో చంద్రబాబునాయుడు పర్యటించారు. భారీ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మోరి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించారు. ఈ గ్రామాన్ని ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామమని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమని ఆర్భాటంగా ప్రకటించారు. తదనంతర కాలంలో మోరికి శివారుగా ఉన్న మోరిపోడు గ్రామాన్ని కూడా ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ జాబితాలోకి చేర్చింది. ఇంకేముంది..! సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటన చేయడంతో ఇక మోరి గ్రామ స్వరూపమే మారిపోతుందని అందరూ అనుకున్నా రు. అయితే, చంద్రబాబు ప్రకటనలు ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సు మారు ఏడాదిన్నర అవుతున్నా ఆచరణ అందుకు అనుగుణంగా లేదు. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు పని చేయకపోగా.. నగదు రహితం పేరుకే మిగిలింది. మరుగుదొడ్ల లక్ష్యం కూడా పూర్తి కాకపోవడంతో గ్రామంలో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది. అరకొరగా ఫైబర్ గ్రిడ్ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా మోరి, మోరిపోడు గ్రామాల్లో 1,500 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటన్నింటినీ స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. వీటిల్లో 300 కనెక్షన్లకు టీవీకి, ఫోన్‌కు పవర్ సప్లై చేసే ఐపీటీవీ బాక్సులలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అవి ఇన్స్టాల్ కాకపోవడంతో రిప్లేస్మెంట్ నిమిత్తం వెనక్కి ఇచ్చేశారు. వీటిని రిప్లేస్ చేయనున్నట్లు స్థానిక కేబుల్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ 150 రిప్లేస్ చేసినా, మరో 150 కనెక్షన్లకు రిప్లేస్మెంట్ పూర్తి కావాల్సి ఉంది. గ్రామ శివార్లలో ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తూ ఇచ్చిన సుమారు 300 కనెక్షన్లు వారంలో మూడు రోజులు సాంకేతిక, ఇతర సమస్యలతో పని చేయడం లేదు. టెరాసాఫ్ట్‌కు చెందిన పరికరాలు దెబ్బతిని, ఎక్కడైనా కేబుల్ తెగిపోతున్న సందర్భాల్లో ఆ వీధిలో ప్రసారాలు నిలిచిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు కేబుల్ ప్రసారాలకే పరిమితమైపోయారు. సాంకేతిక కారణాలతో ఇప్పటికీ ఫైబర్ గ్రిడ్ సేవలకు నోచుకోని కొన్ని టీవీలకు నో ఇంటర్నెట్ యాక్సెస్ వస్తోంది. దీంతో ఆ ఇంటి యజమానులు ఏం చేయాలో పాలుపోక, కేబుల్ ప్రసారాలతో సరిపెట్టుకుంటున్నారు. పాటలకే పరిమితమైన స్మార్ట్ఫోన్లు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మోరి గ్రామంలో 600 మందికి స్మార్ట్ఫోన్లు అందజేశారు. అవి నాణ్యమైనవి కాకపోవడంతో కొద్ది కాలానికే సమస్యలు తలెత్తాయి. ఫోన్ ఆన్ చేసిన వెంటనే బ్యాటరీ పని చేయక స్విచ్ ఆఫ్ అవడం, ఫోన్లలోని బ్యాటరీలు ఉబ్బిపోవడం తదితర సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఫోన్లు పనికిరాకుండా పోయాయి. మరోపక్క సిగ్నల్ సమస్యలతో ఇంటర్నెట్ సక్రమంగా పని చేయక అవి నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా మిగిలిపోయాయి. చివరకు సినిమా పాటలను వినడానికి మాత్రమే డ్వాక్రా మహిళలు వాటిని ఉపయోగించుకుంటున్నారు. నగదుతోనే వ్యాపారం గ్రామాన్ని నగదు రహితంగా సీఎం ప్రకటించగా.. ఇప్పటికీ ఇక్కడ నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. గ్రామంలో మెడికల్, కిరాణా, కూరగాయలు, పాన్‌షాప్.. ఇలా అన్నీ కలిపి సుమారు 40 వరకూ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని దుకాణాల్లోనూ నగదు లావాదేవీలే జరుపుతున్నారు. కొందరికి స్వైపింగ్ మెషీన్లు ఇచ్చినా సక్రమంగా పని చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలకు స్వస్తి పలికారు.మరికొంతమందికి స్వైపింగ్ మెషీన్లు చేరలేదు.కాగా, మోరి గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన జీడిపప్పు, చేనేత పరిశ్రమల్లో కార్మికులకు నగదు లేనిదే అడుగు ముందుకు పడడం లేదు. ఓడీఎఫ్.. ఉఫ్.. మోరి, మోరిపోడు గ్రామాలను సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహితంగా (ఓడీఎఫ్) తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి అప్పట్లో ప్రకటించారు. కానీ, సీఎం చెప్పిన ఈ మాట కూడా ఆర్భాటంగానే మిగిలింది. ఓడీఎఫ్ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నిషిద్ధం. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. కానీ, ఆచరణ అలా లేదు. కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు అరకొరగా నిర్మించి వదిలేశారు. అవి నిరుపయోగంగా మారాయి. స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ రెండు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇప్పటికీ మంజూరు చేయలేదు. వీటిని వచ్చే ఆగస్ట్‌లో ఆన్లైన్ చేస్తామని, అప్పటివరకూ ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఈ గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది.మరోపక్క ఈ గ్రామాల్లో పారిశుధ్యం పరమ అధ్వానంగా ఉంది. గ్రామంలో చెత్త వేసేందుకు కనీసం డంపింగ్ యార్డు కూడా లేదు. ఇటీవల చెత్త రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసినా అది వినియోగంలోకి రాలేదు. -
స్వచ్ఛత వైపు అడుగు వేయండి
దిలావర్పూర్ : జిల్లాలోని ప్రతీ మండలం, గ్రామం స్వచ్ఛతవైపు అడుగు వేయాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. మండలంలోని న్యూలోలం గ్రామంలో అన్ని కుటుంబాలు మరుగుదొడ్డి నిర్మించుకుని జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. ఈనేపథ్యంలో గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటిస్తూ శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ అతిథిగా హాజరై గ్రామస్తులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి అక్టోబర్ 2వరకు సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా ప్రకటించేలా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను సైతం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్ల తెలిపారు. మరుగుదొడ్లను నిర్మించుకోవడమే కాకుండా వాటిని వినియోగించాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామం స్వచ్ఛతపై దృష్టిసారిస్తే గ్రామాలన్నీ పారిశుధ్య గ్రామాలుగా మారి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందన్నారు. హైలెవల్ కెనాల్లో భూమి కోల్పోయిన న్యూలోలం గ్రామ రైతులకు వారం రోజుల్లో పరిహారం చెక్కులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో స్థానికంగా ఎలాంటి అవకతవకలు ఏర్పడినా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను స్థానిక సర్పంచ్ డి.లింబాదేవి, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలోడీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటిసి సభ్యురాలు ఆమ్గోత్ సుజాతమేర్వాన్, ఎంపీటీసీ సభ్యుడు సత్యం చంద్రకాంత్, ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ నర్సయ్య, ఏపీవో జగన్నాథ్, ఏపీఎం విజయలక్షి, ఓడీఎఫ్ ప్రత్యేకాధికారి దేవేందర్‌రెడ్డి , ఎంఈవో శంకర్, నాయకులు పాల్దె శ్రీనివాస్, ఒడ్నం కృష్ణ, స్వామిగౌడ్, బి.గంగన్నతోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఉపాధి పనులను పరిశీలించిని కలెక్టర్ అనంతరం గ్రామ సమీపంలో సారంగాపూర్ మండలం బీరవెల్లి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ఉపాధి పనులను కలెక్టర్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కూలీల సాయంతో గుంతలు తీసే పనులు చేపట్టారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ అధికారులు, కూలీలకు పలు సూచనలు , సలహాలు అందజేశారు. -
అభివృద్ధికి అందరూ సహకరించాలి
లింగాపూర్ : మండలంలోని ప్రతీ అధికారి మండల అభివృద్ధికి సహకారించాలని మండల ప్రత్యేక అధికారి ఏయూ ఖాన్ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు మండలంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అన్నివిధాల కృషి చేస్తామని ఎంఈవో కుడిమెత సుధాకర్ అన్నారు. మూడు మినీ భూసార పరీక్ష కేంద్రాలు.. వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను 50శాతం సబ్సిడిపై రైతులకు అందజేయడానికి నిధులు విడుదల చేసిందన్నారు. ఇందులో ఫెన్సింగ్ వైరు, స్ప్రింక్లర్లు, ఆయిల్ఇంజన్లు, తాడిపత్రిలు, పాడిపశువులైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల పటించాలన్నారు. భూముల సారాన్ని పరీక్షించడానికి మూడు మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐకేపీ అధికారులపై కోరం సభ్యుల ఆగ్రహం.. ఐకేపి అ«ధికారుల పనితీరుపై కోరం సభ్యులు, అధికారులు మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాలకు విపరీతంగా రుణాలు అందజేసి రికవరీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్బీఎం మరుగుదొడ్ల నిర్మాణంలో ఎందుకు సహకరించడంలేదన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సంఘాలకు ఇచ్చిన రుణాలను రికవరీ చేయకపోవడంతో బ్యాంకు అధికారులు స్వయం ఉపాధి కోసం అందించే రుణాలను ఇవ్వకుండా నిలిపివేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా ఎవరూ నడుచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎస్సై రామారావు, ఐసీడీఎస్ సీడీపీవో ప్రభావతి, ఈవోపీఆర్డీ ఆనందరావు, సర్పంచ్‌లు సుదర్శన్, నాగోరావు, జాలీంశావ్, పద్మ పాల్గొన్నారు. -
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
భీమిని : భీమిని, కన్నెపల్లి మండలాల్లోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీఆర్డీఏ పీడీ శంకర్ సూచించారు. మంగళవారం ఉదయం భీమిని, కన్నెపల్లి మండలాల్లోని రాంపూర్, కన్నెపల్లి గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బహిరంగ మలవిసర్జన ఉండకూడదని సూచించారు. ఈ నెల 31లోపు గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్, ఇన్చార్జి ఎంపీడీవో రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. -
ఓడీఎఫ్ గ్రామాలకు నిధులు మంజూరు
ఆత్మకూరు(అనుమసముద్రంపేట) : ఆత్మకూరు మండలంలోని 10 ఓడీఎఫ్ గ్రామాల్లో సంపూర్ణ మరుగుదొడ్ల పఽథకం పూర్తయిందని దీంతో ప్రభుత్వం రూ.21 లక్షల మంజూరు చేసిందని జెడ్పీ సీఈఓ రామిరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఆత్మగౌరవంపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నెలాఖరులోపు రెండో విడత ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్లు పూర్తిచేయాలన్నారు. పమిడిపాడు, రావులకొల్లు, చెర్లోయడవల్లి, నాగులపాడు, నారంపేట, వెన్నవాడ, కనుపూరుపల్లి, బండారుపల్లి, నల్లపరెడ్డిపల్లి, మురగళ్ల గ్రామాలను మొదటి విడతలో ఓడీఎఫ్‌గా చేసి పూర్తి చేశామన్నారు. ఎంఆర్సీ పరిశీలన ఆర్డీఓ కార్యాలయం వెనుకవైపున ఉన్న నూతన ఎంఆర్సీ భవనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం నాసిరకంగా నిర్మించారని, ప్రారంభానికి ముందే పగుళ్లు ఇవ్వడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధ్యక్షులు కేతా విజయభాస్కర్‌రెడ్డి, యానాదిరెడ్డి, రామిరెడ్డి మోహన్‌రెడ్డి, అధికారులుపాల్గొన్నారు. -
స్వచ్ఛ భారత్ వైపు ఇందూరు పయనం!
♦ 2012 బేస్‌లైన్ సర్వే ఆధారంగా కార్యక్రమం ♦ ఇప్పటికే ఓడీఎఫ్ గ్రామాలుగా 65 గుర్తింపు ♦ రెండు రోజుల జాతీయ సదస్సుకు కలెక్టర్ ♦ ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ యోగితారాణా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్‌ను పూర్తి పారిశుధ్య జిల్లాగా రూపొందించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు సమష్టిగా గ్రామ పంచాయతీలను యూనిట్లుగా తీసుకొని ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వినియోగంపై కూడా కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.12 వేల యూనిట్ విలువతోనే నిర్ణీత కొలతలతో మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు స్నానపు గదులను కూడా మంజూరు చేయటంపై గ్రామీణ కుటుంబాలు స్వచ్ఛభారత్ అమలులో భాగస్వాములవుతున్నాయి. మరుగుదొడ్ల వాడకంపై ఆసక్తిని పెంచి, పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బకెట్లు, ఫినారుుల్, బ్రేష్లను అందించేందుకు ప్రతి లబ్ధిదారుల నుంచి రూ.900లు సేకరించి గ్రామ జ్యోతి కమిటీలలో జమ చేశారు. అలాగే గ్రామాలను, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు ఇంటింటికీ మ్యాజిక్ సోక్పిట్లు, చేతిపంపుల వద్ద కమ్యూనిటీ సోక్ పిట్లు మంజూరు చేసి ఇళ్లలో వాడుకొని వదిలివేసిన నీటిని ఇంకిపోయే విధంగా చేయడంతోపాటు ఇళ్లలో ఉన్న చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డులను చేపట్టడం జరిగింది. ఇళ్లలోని చెత్తను తొలగించేందుకు రిక్షాలను గ్రామ పంచాయతీలకు అందచేస్తున్నారు.