ఓడీఎఫ్ గ్రామాలకు నిధులు మంజూరు
ఓడీఎఫ్ గ్రామాలకు నిధులు మంజూరు
Published Thu, Nov 3 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ఆత్మకూరు(అనుమసముద్రంపేట) : ఆత్మకూరు మండలంలోని 10 ఓడీఎఫ్ గ్రామాల్లో సంపూర్ణ మరుగుదొడ్ల పఽథకం పూర్తయిందని దీంతో ప్రభుత్వం రూ.21 లక్షల మంజూరు చేసిందని జెడ్పీ సీఈఓ రామిరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఆత్మగౌరవంపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నెలాఖరులోపు రెండో విడత ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్లు పూర్తిచేయాలన్నారు. పమిడిపాడు, రావులకొల్లు, చెర్లోయడవల్లి, నాగులపాడు, నారంపేట, వెన్నవాడ, కనుపూరుపల్లి, బండారుపల్లి, నల్లపరెడ్డిపల్లి, మురగళ్ల గ్రామాలను మొదటి విడతలో ఓడీఎఫ్‌గా చేసి పూర్తి చేశామన్నారు.
ఎంఆర్‌సీ పరిశీలన
ఆర్డీఓ కార్యాలయం వెనుకవైపున ఉన్న నూతన ఎంఆర్‌సీ భవనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం నాసిరకంగా నిర్మించారని, ప్రారంభానికి ముందే పగుళ్లు ఇవ్వడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధ్యక్షులు కేతా విజయభాస్కర్‌రెడ్డి, యానాదిరెడ్డి, రామిరెడ్డి మోహన్‌రెడ్డి, అధికారులుపాల్గొన్నారు.
Advertisement
Advertisement