స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి | we should create swachh villages | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

Published Wed, Jan 24 2018 5:35 PM | Last Updated on Wed, Jan 24 2018 7:34 PM

we should create swachh villages - Sakshi

మరుగుదొడ్లను పరిశీలిస్తున్న పీడీ శంకర్‌

భీమిని : భీమిని, కన్నెపల్లి మండలాల్లోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీఆర్‌డీఏ పీడీ శంకర్‌ సూచించారు. మంగళవారం ఉదయం భీమిని, కన్నెపల్లి మండలాల్లోని రాంపూర్, కన్నెపల్లి గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బహిరంగ మలవిసర్జన ఉండకూడదని సూచించారు. ఈ నెల 31లోపు గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్, ఇన్‌చార్జి ఎంపీడీవో రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement