
స్వచ్ఛ, స్వాస్థ్ భారత్ కావాలి
దత్తత గ్రామం పుట్టమరాజువారి కండ్రిగలో ప్రజలకు సచిన్ టెండూల్కర్ పిలుపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్వచ్ఛ భారత్‌తోపాటు స్వాస్థ్(ఆరోగ్య) భారత్ తయారు కావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. తాను దత్తత తీసుకున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టమరాజువారి కండ్రిగ గ్రామంలో సచిన్ బుధవారం పర్యటిం చారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2014 నవంబరు 16న నెర్నూరు పంచాయ తీని దత్తత తీసుకున్నానని చెప్పారు. పుట్టమ రాజు కండ్రిగను పూర్తి స్థారుులో అభివృద్ధి చేశామని అన్నారు. ఇక్కడ రెండేళ్లలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించామని, మరో రెండు నెలల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనన్నారు. రెండో విడతలో ఈ పంచాయతీలోని నెర్నూరు, గొల్లపల్లి గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.
ఆటలు, చదువు.. రెండూ ముఖ్యమే
రెండేళ్ల క్రితం తాను పుట్టమరాజువారి కండ్రిగకు వచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా మారిపోరుుందని, ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పు కనిపిస్తోందని సచిన్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీలోని మిగిలిన రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణరుుంచినట్లు ప్రకటించారు. యువత బాగా ఆటలాడుతూ బాగా చదవాలని, మనిషి పరిపూర్ణ అభివృద్ధికి ఈ రెండూ ముఖ్యమేనన్నారు. గ్రామస్తులు మద్యం, పొగాకు మాని ఆ సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడపడానికి కేటారుుంచాలని సచిన్ కోరారు.పుట్టమరాజువారి కండ్రిగలోని రెండు క్రికెట్ జట్లకు బ్యాట్‌లు పంపిణీ చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మాట్లాడుతూ... హరిశ్చంద్రారెడ్డి అనే దాత సహకారంతో ఆరెకరాల భూమిలో సచిన్ పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరారు. వస్తానని సచిన్ హామీ ఇచ్చారు.
తెలుగులో పలకరింపు
తన దత్తత గ్రామమైన పుట్టమరాజువారి కండ్రిగ ప్రజలనుద్దేశంచి సచిన్ టెండూల్కర్ తెలుగులో ‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’ అని పలకరించారు. సభకు ముందు గ్రామంలో మహేశ్ అనే యువకుడి ఇంటికి వెళ్లి సచిన్ తేనీరు సేవించారు. 2014 నవంబరు 16న గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే ఇంట్లో కొంతసేపు గడిపారు. క్రికెట్ దిగ్గజం రెండుసార్లు తన ఇంటికి రావడం పట్ల మహేశ్ ఆనందం వ్యక్తం చేశాడు.