ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పటి నుంచి బిగ్‌బీ తరచూ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన రచనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి ‘అకెలెపాన్ కా బాల్’ అనే కవితను షేర్ చేస్తూ అది తన తండ్రి రాసినట్లుగా చెప్పారు. కానీ అది గేయ రచయిత ప్రసూన్ జోషీ రాశారు. వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకున్న బిగ్‌బీ గురువారం క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు. ‘సరిదిద్దుకున్నా: నిన్న నేను పంచుకున్న పద్యం మా నాన్న హరివంశ్ రాయ్ బచ్చన్ రాసినది కాదు. అది ప్రసూన్ జోషి రాసినది. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు. బిగ్ బీ తండ్రి హరివంశ్ బచ్చన్ ప్రసిద్ద సాహిత్య కవి. (చదవండి: నాపై గౌరవం పోయినా సరే, నేను ఇంతే)
CORRECTION : कल T 3617 pe जो कविता छपी थी , उसके लेखक , बाबूजी नहीं हैं । वो ग़लत था । उसकी रचना , कवि प्रसून जोशी ने की है ।
— Amitabh Bachchan (@SrBachchan) August 6, 2020
इसके लिए मैं क्षमा प्रार्थी हूँ । 🙏🙏
उनकी कविता ये है - pic.twitter.com/hZwgRq32U9
ఆయన రాసిన సాహిత్య రచనలైన ‘అగ్నిపత్’, ‘అలాప్’, ‘సిల్సిలా’ పేరుతో వచ్చిన సినిమాల్లో అమితాబ్ నటించాడు. ప్రసూన్ జోషీ కవి, గేయ రచయిత, స్క్రీన్ రైటర్ కూడా. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తారే జమీన్ పర్’, ‘చిట్టాగ్యాంగ్’, ‘ఢిల్లీ 6’ సినిమాలకు కథను అందించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్‌గా ఉన్నారు.ఇటీవల బిగ్‌బీ, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, మనవరాలు అరాధ్య బచ్చన్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో మొదట ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు కోలుకోగా బిగ్‌బీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అభిషేక్ మాత్రం ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడు. (చదవండి: నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్)
Comments
Please login to add a commentAdd a comment