Two Young Threw Bottle At Singer Kailash Kher During Karnataka Show, Goes Viral - Sakshi
Sakshi News home page

Kailash Kher: కర్ణాటకలో సింగర్‌ కైలాష్‌ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

Published Mon, Jan 30 2023 11:55 AM | Last Updated on Mon, Jan 30 2023 3:04 PM

Two Young Threw Bottle At Singer Kailash Kher During Karnataka Show - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యూజిక్‌ కన్‌సర్ట్‌లో పాట పాడుతున్న ఆయనపై ఇద్దరు యువకులు బాటిల్‌తో దాడి చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం బెంగళూరులో హంపీ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకలను నిర్వహించారు. 

జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆయన పాటలు పాడుతుండగా ఇద్దరు యువకులు ఆగ్రహంతో ఆయనపై వాటర్‌ బాటిల్‌ విసిరారు. అయితే ఆ బాటిల్‌ కైలాష్‌కు సమీపంలో పడటంతో ప్రమాదం తప్పింది.

బాటిల్‌ తనవైపు పడినప్పటికి కైలేష్‌ ఖేర్‌ అదేది పట్టించుకోకుండ తన ప్రదర్శను కొనసాగించారు. అనంతరం స్టేజ్‌పై ఉన్న సెక్యూరిటీ ఆ బాటిల్‌ను తీసేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన మొత్తం హిందీ పాటలే పాడుతున్నారని, కన్నడ పాట పాడటం లేదనే ఆగ్రహంతోనే బాటిల్‌ విసిరినట్లు సదరు యువకులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: 
పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’
తారకరత్న గురించి గుడ్‌న్యూస్‌ చెప్పిన మంచు మనోజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement